Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరోనా వైరస్ పై పోరాడటం కోసం ఒక బలమైన వ్యూహాన్ని రూపొందించడానికి సార్క్ సభ్యత్వ దేశాల కు పిలుపు ను ఇచ్చిన ప్రధాన మంత్రి


కరోనా వైరస్ పై పోరాడటం కోసం ఒక బలమైన వ్యూహాన్ని రూపొందించడానికి ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) సభ్యత్వ దేశాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ వ్యూహాల పై వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా చర్చ ను చేపట్టవచ్చని, అలాగే సార్క్ సభ్యత్వ దేశాలు అన్నీ కలసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచాని కి ఒక ఉదాహరణ ను ఇవ్వవచ్చని మరియు ఒక ఆరోగ్యదాయకమైనటువంటి భూ గ్రహం ఏర్పడటానికి వాటి వంతు తోడ్పాటు ను అందించవచ్చునని కూడా ఆయన సూచనలు చేశారు.

ప్రపంచ జనాభా లో గణనీయమైన సంఖ్యలను కలిగిన ప్రజల కు ఆశ్రయాన్ని ఇస్తున్నటువంటి దక్షిణ ఆసియా తన యొక్క ప్రజల ఆరోగ్యాని కి పూచీ పడటం కోసం సర్వ శక్తుల ను ఒడ్డాలి అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాల ను ట్విటర్ లో అక్షర బద్ధం చేశారు. సిఒవిఐడి-19 నోవల్ కరోనా వైరస్ పై పోరు సలిపేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల లో తన వంతు గా సర్వోత్తమమైనటువంటి ప్రయత్నాల ను చేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.