Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని కారవార్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారుఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారుఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానుఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నాంగాయపడిన వారికి రూ. 50,000 అందుతాయి.”

 

****