పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సభ్యుల సంఖ్యను సరైన స్థాయికి తీసుకువచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిషన్‌లో ఒక ఛైర్ పర్సన్, ఆరుగురు సభ్యులతో (మొత్తం ఏడుగురు) ఉండగా దానిని ఒక ఛైర్ పర్సన్, ముగ్గురు సభ్యులుగా (మొత్తం నలుగురు సభ్యులు) చేసే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీలను భర్తీ చేయబోరు. మరో అదనపు ఖాళీ 2018 సెప్టెంబర్‌లో ఏర్పడనుంది. ప్రస్తుత సభ్యుడు ఒకరు తమ పదవీ కాలాన్ని పూర్తి చేయనుండడంతో ఈ ఖాళీ ఏర్పడుతుంది.
ప్రయోజనాలు…
ఈ ప్రతిపాదన వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన కనీస ప్రభుత్వం- గరిష్ఠ పాలనకు అనుగుణంగా కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల పోస్టులు తగ్గుతాయి. దేశంలో విలీనాలు, సమ్మిళితాల ప్రక్రియకు సంబంధించి 2017లో కనీస అమలు స్థాయిని ప్రభుత్వం సవరించింది. దీనిని అన్ని రూపాలలోని కాంబినేషన్లకు వర్తింప చేశారు. ఆస్తుల లెక్కింపు, అలాంటి కాంబినేషన్లలో ఉన్న టర్నోవర్ టార్గెట్ వంటి వాటినీ ప్రకటించారు. దీనితో కాంబినేషన్లలో ప్రవేశించే ముందు, కమిషన్‌కు వాణిజ్యసంస్థలు సమర్పించాల్సిన తప్పనిసరి పత్రాల సంఖ్యతగ్గిపోయింది. దీనితో కమిషన్ పనిభారం తగ్గింది.
విచారణలు వేగవంతం కావడం వల్ల ఆయా సంస్థలకు సంబంధించిన ఆమోదాలూ త్వరితగతిన రావడానికి వీలు కలుగుతుంది. ఇది కార్పొరేట్ సంస్థల వ్యాపార ప్రక్రియను పుంజుకునేట్టు చేయడమే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు వీలు కలుగుతుంది.
ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన కనీస ప్రభుత్వం- గరిష్ఠ పాలన విదానానికి అనుగుణంగా కమిషన్‌లోని మూడు పోస్టులు తగ్గుతాయి.
నేపథ్యం……
కాంపిటిషన్ యాక్ట్ 2002లోని సెక్షన్ 8(1) ప్రకారం కమిషన్‌లో ఛైర్ పర్సన్, ఇద్దరు సభ్యులకు తగ్గకుండా ఆరుగురు సభ్యులకు మించకుండా ఉండాలి.ప్రస్తుతం చైర్‌పర్సన్ , మరో నలుగురు సభ్యులు పదవులలో ఉన్నారు.
తొలుత ఒక ఛైర్‌పర్సన్, పది మంది సభ్యులకు మించకుండా కమిషన్‌లో ఉండాలని చట్టంలో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ప్రాంతాలలో ప్రిన్సిపల్ బెంచ్, ఇతర అదనపు బెంచ్‌లు, విలీనాల బెంచ్‌లలో కనీసం ఇద్దరు సభ్యులు ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టంలో ఇలాంటి ప్రస్తావన చేశారు.
2007లో వచ్చిన కాంపిటిషన్ (సవరణ) చట్టం (39 ఆఫ్ 2007), ప్రకారం చట్టంలోని సెక్షన్ 22 ను సవరించి బెంచ్ ల ఏర్పాటు నిబంధనను తొలగించారు. అదే సవరణ చట్టంలో ఒక ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులతో కాంపిటిసన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు వీలు కల్పించారు. అప్పుడు కమిషన్ సైజును అందుకు అనుగుణంగా తగ్గించలేదు. కమిషన్ చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులకు తగ్గకుండా ఆరుగురు సభ్యులకు మించకుండా అన్న నిబంధనను దానిని అలాగే ఉంచారు.
కమిషన్ ఏర్పడినప్పటి నుంచి అది కొలీజియంగానే పనిచేస్తున్నది. పలు ఇతర దేశాలలో ఉదాహరణకు జపాన్,అమెరికా, యుకెలలో కాంపిటిషన్ అథారిటీల సభ్యుల సంఖ్య ఈ స్థాయిలోనే ఉంది.