Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాఠ్ మాండూ లో పశుపతి నాథ్ ధర్మశాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఉపన్యాసం


గౌరవనీయ ప్రధాని ఓలీ గారు, సంస్కృతి, పర్యటన శాఖ మంత్రి రవీందర్ ప్రసాద్ అధికారి గారు, పశుపతి ప్రాంతం అభివృద్ధి ట్రస్టు సభ్యుడు డాక్టర్ ప్రదీప్ ధాకల్ గారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భోలే బాబా భక్తులు, ఇంకా నేపాల్ లోని నా ప్రియమైన సోదరీమణులు, సోదరులారా,

పశుపతి నాథ్ జీ ప్రాంగణం లో  సమావేశమైన మీ అందరికీ కాశీ కి చెందిన బాబా విశ్వనాథ్ కుమారుడు శిరస్సు ను వంచి అభివాదం చేస్తున్నాడు.  ప్రధాని ఓలీ గారు కొద్ది క్షణాల క్రితం చెప్పినట్లు నేపాలీ భాష ను, గుజరాత్ ప్రజలను అర్ధం చేసుకోవడం చాలా సులభం.
 
భారతదేశం, నేపాల్ ల స్నేహ బంధం ఎంతో లోతైనటువంటిది.  ఏదైనా విషాదం సంభవించిన సమయం లో మీకు సన్నిహితులు ఎవరైనా వస్తే ఎంతో ఓదార్పు కలుగుతుంది.  అటల్ గారు అస్తమించినప్పుడు క్షణాల్లో ఓలీ గారు నాకు ఫోన్ చేసి, సానుభూతి ని వ్యక్తం చేశారు.  అది లాంఛనంగా చేసిన కాల్ కాదని నాకు తెలుసు.  మీతో నేనున్నాను అంటూ ఒకరు కల్పించే సహజసిద్ధమైన ఓదార్పు అది.  మీ విదేశాంగ మంత్రి అదే గౌరవభావంతో, అదే మనోభావాలతో  అటల్ గారి అంత్యక్రియలకు హాజరయ్యారు.

అటల్ గారి పద్యాలను నేపాలీ భాష లో తర్జుమా చేయాలని ఈ రోజు నేపాల్ తలపెట్టింది.

ఈ రోజున మనం ఎంతో మహోన్నతమైన వ్యక్తి సందేశాలను, జ్ఞాపకాలను భవిష్యత్ తరాల కోసం జాగ్రత్త చేసి పదిలపరుచుకుంటున్నాం.  వాటిని మనం జీవితాలకు ఏ విధంగా వర్తింపచేసుకోగలిగితే ఆ మహోన్నతుని కి అంతగా నివాళి ని అర్పించినట్టవుతుంది.  ఆయన కు అత్యుత్తమ నివాళి ని ఘటిస్తున్నందుకు ఓలీ గారి కి, నేపాల్ ప్రభుత్వానికి, నేపాల్ ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.  అటల్ గారి ఆలోచనలను, వివేకాన్ని, సమకాలీన స్థితిగతులను ఆయన దర్శించిన తీరు అన్నీ ఆయన కవితలలో ప్రతిబింబిస్తాయి.

మన రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు అత్యంత ప్రాచీనమైనవి.  ప్రజల మధ్య బంధం పటిష్ఠంగా లేకపోతే ఒక దేశం తో సంబంధాలు పటిష్ఠంగా, శాశ్వతంగా నిలవవు.
 
నేపాలీలు, భారతీయులు ఒక్కటిగా నిలవలేకపోతే కాఠ్ మాండూ, ఢిల్లీ రెండూ ఒక్కటి గా నడవడం, కాఠ్ మాండూ, ఢిల్లీ లోని ప్రభుత్వాలు కలసి ముందడుగు వేయడం ద్వారా మాత్రమే సంబంధాలు పటిష్ఠంగా నిలవవు.  నేపాలీ, భారత స్నేహానికి చిహ్నం అయిన ఈ ధర్మశాల ను ప్రారంభించడం ద్వారా ఉభయ దేశాల మధ్య బంధాన్ని పటిష్ఠం చేయడానికి అద్భుతమైన పని చేసినట్టయింది.

నా సోదర సోదరీమణులారా,

నేను కాఠ్ మాండూ చేరగానే నేపాలీ ప్రజల ప్రేమ, ఆదరణ ఎంతగానో ఆస్వాదించాను.  ఇది నా ఒక్కడి విషయం లో చూపింది మాత్రమే కాదు, ఇదే మనోభావాన్ని భారతదేశం పట్ల నేపాల్ ప్రదర్శిస్తుంది.  నాలుగు సంవత్సరాల క్రితం శ్రావణం చివరి సోమవారం రోజు న పశుపతి నాథ్ జీ పాదాలను పూజించుకొనే భాగ్యం నాకు లభించింది.  కొద్ది నెలల క్రితం నేను నేపాల్ ను సందర్శించినప్పుడు పశుపతి నాథ్, ముక్తినాథ్, జానకిధామ్.. మూడింటినీ దర్శించుకునే భాగ్యం కలిగింది.  ఈ రోజున బాబా పశుపతి నాథ్ పాదాలను మరో సారి దర్శించుకొని ప్రార్థన చేసుకునే అవకాశం నాకు కలిగింది.  నా ఒక్కడికే కాదు, భారతదేశం లోను, ప్రపంచవ్యాప్తం గాను భగవాన్ శివుడిని ఆరాధించే భక్తులు, ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించే వారు, మతపరమైన సంప్రదాయాలను పాటించే వారు, భగవంతుని పైన భక్తి గల వారందరూ జీవితకాలం లో ఒక్కసారైనా పశుపతి నాథ్ జీ ని దర్శించుకోవాలని కోరుకుంటారు.  భారత నేపాల్ లు రెండింటిలోనూ శివ భగవానుని పట్ల భక్తి భావం ఉన్న శివ భక్తులంతా ఇదే భావాన్ని కలిగివుంటారు.  ఆ బంధాన్ని దూరం గాని, చేరడానికి కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు గాని ప్రభావితం చేయలేవు.  కాఠ్ మాండూ, కన్యాకుమారి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నా తమిళ నాడు లో పశుపతినాథ్ జీ కథలు 1500 సంవత్సరాల నుండి మార్మోగుతూనే ఉన్నాయి.

और बाबा पशुपतिनाथ ने सुदूर दक्षिण भारत के अपने अनंत भक्‍तों को पीढ़ी-दर-पीढ़़ी सैकड़ों साल से गणेश और कार्तिक की तरह अपने आप इस मंदिर में स्‍थान दिया है। और इसलिए आज मेरे परम मित्र प्रधानमंत्री ओली जी के साथ मिलकर नेपाल-भारत मैत्री पशुपति धर्मशाला को विश्‍वभर के यात्रियों के लिए, टूरिस्‍टों के लिए, शिव भक्‍तों के लिए समर्पित करते हुए मेरी प्रसन्‍ता की कोई सीमा नहीं है। दुनियाभर से यहां आने वाले श्रद्धालुओं की सुविधा के लिए सवा सौ करोड़ भारतवासियों की तरफ से पशुपतिनाथ जी के चरणों में यह एक छोटी सी भेंट देने का सौभाग्‍य मुझे मिला है।

పశుపతినాథ్ జీ ప్రదేశంలో శైవ్ కురువార్ తైవరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందులో చక్కని ప్రస్తుతి ఉంది.  గణేశుని కి, కార్తికేయుని కి  స్థానం కల్పించినట్టే దక్షిణ భారతం లోని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్త కోటి కి శతాబ్దాలుగా, తరతరాలుగా పశుపతినాథ్ జీ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివ భక్తులు, పర్యాటకుల కోసం నేపాల్, భారత స్నేహచిహ్నమైన ఈ పశుపతి ధర్మస్థలను మంచి మిత్రుడైన ప్రధాన మంత్రి ఓలీ గారి తో కలసి నేను ప్రారంభిస్తున్నాను.  125 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రపంచం యావత్తు నుండి వచ్చే భక్తుల కోసం భగవాన్ పశుపతినాథ్ పాదాల వద్ద ఈ చిన్ని కానుక ను అందించే అదృష్టం నాకు కలిగింది.

మిత్రులారా,

పశుపతినాథ్, ముక్తినాథ్, ఇంకా జానకీధామ్.. ఈ మూడూ నేపాల్ లో భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీకలు.  అవి ప్రతి ఒక్క క్షణం అందించే అనుభూతి భారతదేశం, నేపాల్ ల బంధం యొక్క పటిష్ఠత కు కొత్త శక్తిని ఇస్తుంది.  బాబా విశ్వనాథ్, పశుపతినాథ్ కాశీ, కాఠ్ మాండూలను అనుసంధానం చేస్తారు.  నేను సోమనాథుని ప్రదేశానికి చెందిన వాడిని.  సోమనాథ్ నుండి విశ్వనాథ్, విశ్వనాథ్ నుండి పశుపతినాథ్, అలాగే సీతామాత, శ్రీరామచంద్రుల బంధం జనక్ పుర్ ను అయోధ్య తో అనుసంధానం చేస్తాయి.  అలాగే జగన్నాథ్, ముక్తినాథ్ లు పురీ, మస్తంగ్ లను చేరువ చేస్తారు.  ఎంతో సుందరమైన ఈ భాగమతి లోయ లో పశుపతినాథుడు కొలువై ఉన్నారు.  ఈ క్షేత్రానికి ఒకవైపున ధౌళగిరి, అన్నపూర్ణ, మరో వైపున సాగరమాత, కాంచన్ జంగ లు ఉన్నాయి.  శివ భక్తులు, ప్రపంచం లోని పలు ప్రదేశాల నుండి వచ్చే తైర్థికులకు ఇవి అద్భుతమైన అనుభూతి ని అందిస్తాయి.  ఈ పవిత్ర కాఠ్ మాండూ హైందవం, బౌద్ధం ల సంగమ స్థలం.  ఆ రకంగా చూస్తే ఈ రెండు విశ్వాసాలు పరస్పరం సమ్మిళితమై ఉన్నాయి.  రెండు రకాల విశ్వాసాలను అనుసరించే వారి మధ్యన కూడా చక్కని సామరస్యం ఉంది.  కాఠ్ మాండూ లోని వీధులలో సంచరించే ఏ ఒక్కరికైనా ఇది అనుభవం లోకి వస్తుంది.  ఈ భగవాన్ పశుపతి నాథ్ ఆలయం కూడా ఎన్నో రకాల విశ్వాసాలకు ఆలంబన.  బౌద్ధ సన్యాసులతో కూడా అది అనుబంధాన్ని కలిగివుంది.  ప్రదీప్ గారు కొన్ని క్షణాల క్రితం చెప్పినట్టుగా ఓం మణి పద్మే హం అనే శ్లోకాన్ని పఠించడం తెలియని వారికి కూడా భగవాన్ శివ భక్తులు నిరంతరం చేసే ఓం నమశ్శివాయ తో అనుసంధానం చేస్తుంది.  భారతదేశం, నేపాల్ ల బంధాన్ని ఈ సంప్రదాయం కూడా సన్నిహితం చేస్తుంది.  నేపాల్ లోని లుంబిని ప్రపంచానికి గౌతముడిని అందిస్తే భారతదేశం లోని బోధ్ గయ ఆయన ను భగవాన్ బుద్ధుని గా ప్రపంచానికి అందించింది.  గౌతమ బుద్ధుడు చూపిన మార్గం ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది.

మిత్రులారా, 

భారతదేశానికి, నేపాల్ కు మధ్య విశ్వాసం, సాన్నిహిత్యంతో కూడిన చారిత్రకమైన ఆత్మబంధం ఉంది.  ఇది మన విడదీయరాని బంధానికి మూలం; ఇదే మన కు అమూల్యమైనటువంటి ఖజానా ఇంకా వారసత్వం కూడాను.  వేలాది సంవత్సరాల మన మహోన్నత చరిత్ర, వసుధైవ కుటుంబకమ్ తో మన కు ఉన్న అనుబంధం ప్రపంచం లోని ఇతర నాగరికతల కన్నా మన నాగరికత లను భిన్నంగా నిలుపుతోంది.
 ఓలీ గారు చెబుతున్నట్టు ‘సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా’ అనేది కేవలం మన సన్నిహితుల ను ఉద్దేశించిందే కాదు, ప్రపంచం లోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరే శక్తి అది.  ఇదే ఈ రెండు దేశాల మూల సిద్ధాంతం.  అలాంటి మహోన్నత సంస్కృతి అందించే ఆత్మవిశ్వాసం ప్రపంచంలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తుంది.  ఇరు దేశాల భవిష్యత్తు ను కూడా ఈ విశ్వాసమే నిర్ణయిస్తుంది.  ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందినప్పుడే మనం సాధించిన విజయాలకు సార్ధకత.  ఈ రోజు న భారతదేశం ఆర్థిక అభివృద్ధి లో కొత్త శిఖరాలకు చేరుతోంది.  అభివృద్ధి పథం లో ఒక చిహ్నం గా నిలుస్తోంది.  సంస్కరణ, పనితీరు, పరివర్తన ల పథం లో ఆర్థిక వ్యవస్థ పయనిస్తోంది.  ప్రతి ఒక్కరి వికాసం, ప్రతి ఒక్కరితో అనుబంధం (‘సబ్ కాసాత్- సబ్ కా వికాస్’) అనే సిద్ధాంతం తో ముందుకు సాగుతున్నాం.  అదే తరహా లో నేపాలీ సోదరులు, నేపాలీ సోదరీమణులకు కూడా స్థానం ఉంది.  మేం ఆ సిద్ధాంతం గురించి మాట్లాడితే అది అందరికీ చెందుతుంది.  పొరుగు వారికి సహాయ పడడం, వారి సుసంపన్నత కు సాయం చేయడం మా సంప్రదాయం లో భాగం.  బాబా పశుపతినాథ్ ఆశీస్సుల తో ఉభయ దేశాల సంబంధాలు కూడా పురోగమిస్తున్నాయి.

మిత్రులారా,

నేపాల్ ఈ రోజు న రాజకీయం గా స్థిరం గా ఉండడం పట్ల ప్రతి ఒక్క భారతీయుడు ఆనందిస్తున్నాడు.  దాని ఫలితంగా నేపాల్ అభివృద్ధి పథంలో ముందంజ వేస్తోంది.  నేపాల్ కు, నేపాల్ ప్రజల సంక్షేమానికి భారతదేశం శుభకామనలు, సహకారం ఎప్పుడూ ఉంటాయని ప్రధాని కి, నేపాల్ ప్రజలకు నేను హామీని ఇస్తున్నాను.  భగవాన్ పశుపతినాథ్ ఈ భూమి కి సదా తన ఆశీస్సులను అందిస్తూ ఉండాలని, భారతదేశం- నేపాల్ స్నేహ బంధానికి అండ గా నిలవాలని నేను ప్రార్థిస్తున్నాను.  అచంచలమైన ఈ విశ్వాసం, నాగరికత, సంస్కృతులే భారతదేశం, నేపాల్ లకు చెందిన కోట్లాది మంది ని సుసంపన్నం చేస్తున్నాయి.  

ఈ భారతదేశం-నేపాల్ ధర్మశాల పర్యాటకులు వచ్చి బస చేసే ఒక ప్రదేశం మాత్రమే కాదు, భారతదేశం- నేపాల్ స్నేహాని కి ఒక స్తంభం గా ఉంటుందని నేను నమ్ముతున్నాను.  ఇదే భావన పర్యాటకులు ఇళ్ల కు చేరిన తరువాత కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.  ఇటువంటి ప్రదేశాలు వాటికవే చిహ్నాలు గా ఉంటాయి.  ఇక్కడ ఏర్పాట్లు బాగుండడమే కాదు, జీవితానికి ఒక కొత్త బలాన్ని ఈ ధర్మశాల అందిస్తుంది.  ఉభయ దేశాల మధ్య పర్యటకానికి ఒక కొత్త శక్తి ని ఇస్తుంది.  నేపాల్ ను సందర్శించే యాత్రికులకు ఇది ఒక అదనపు స్థలంగా నిలుస్తుంది.  ఒక మోస్తరు ఆదాయం ఉన్న వ్యక్తి కూడా ఈ ఏర్పాట్ల నుండి ప్రయోజనాన్ని పొందగలుగుతాడు.  ఇది కేవలం విశ్రాంతి తీసుకునే లేదా నిద్రించే భవనం కానే కాదు.  నేపాల్ లో పర్యటక కార్యకలాపాలకు కొత్త శక్తి ని అందిస్తుంది.  ఆర్థికంగా కొత్త శక్తి ని ఇస్తుంది.  తక్కువ పెట్టుబడి తో గరిష్ఠ స్థాయి లో ఉపాధి అవకాశాలను కల్పించే రంగం పర్యటక రంగం. ఇటువంటి సదుపాయాలు అందుబాటు లో ఉన్నప్పుడు పర్యటకులు, సాధారణ ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని, ఇక్కడ బస చేయాలని ఆసక్తి చూపుతారు. ఒక పర్యటకుడు ఇక్కడ బస చేస్తే అతను కచ్చితం గా ఏదో ఒకటి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.

ఈ భారతదేశం- నేపాల్ మైత్రీ పశుపతినాథ్ ధర్మశాల స్నేహ పటిష్ఠత కు ఒక సేతువు గా నిలచి ఆర్థిక వ్యవస్థ కు కొత్త శక్తి ని అందిస్తుందన్న ప్రగాఢమైన నమ్మకం తో నేపాల్ ప్రధాని కి నేను మరోమారు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. 
కాఠ్ మాండూ లో జరిగిన అత్యంత కీలకమైన బిఐఎమ్ఎస్ టిఇసి (బిమ్స్ టెక్ ) సమావేశం యావత్తు ప్రపంచాని కి సానుకూల సందేశాన్ని ప్రసారం చేసింది.  భగవాన్ పశుపతి నాథ్ పాదాల వద్ద చేసిన తీర్మానాలు ఏవీ సాఫల్యం కాకుండా మిగిలిపోవు.  హిమాలయ పర్వత శ్రేణువుల ఒడి లో ప్రధాని ఓలీ గారి సమర్థ నాయకత్వం లో చేసిన తీర్మానాలు ప్రాంతీయం గా శాంతి సుస్థిరతల స్థాపన లో పెద్ద, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి.. ప్రధాని ఓలీ గారు ఇందుకు మూల కారణంగా నిలచారు.  ఆయన ను మరో సారి కొనియాడి, అభినందించవలసిన అవసరం ఉంది.  ఆయనకు నా ధన్యవాదాలు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మీరు సమయాన్ని వెచ్చించినందుకు మీకు నేను మరో మారు ధన్యవాదాలు తెలియజేయాలనుకొంటున్నాను.  మనిద్దరం కలసి ఇక్కడ ఈ కొత్త బహుమతి ని అందించే భాగ్యం కలిగింది.  ఇక్కడి ఏర్పాట్ల పట్ల భారతీయులు, నేపాలీలు ఎంతో ఆనందిస్తారు.  ఈ ప్రదేశం నేపాల్ ఆర్థిక అభివృద్ధి కి కొత్త మార్గాలను తెరుస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో, భావన తో మరో సారి భగవాన్ పశుపతినాథ్ జీ కి శిరస్సును వంచి అభివాదం చేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు.

**