Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాన్ పుర్ లో పట్టణ సార్వజనిక రాక పోకల కు ఊతం


రెండు కారిడోర్ లు ఉన్న కాన్ పుర్ మెట్రో రైలు ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కాన్ పుర్ లో ప్రధాన కూడళ్ళను మరియు జనావాస సముదాయాల ను కలుపుతూ ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు వల్ల వాహనాల రద్దీ తగ్గి, రాకపోక లు సాఫీ గా జరుగుతాయి. ప్రయాణ వ్యయం, ప్రయాణ సమయం లతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటు వల్ల రెండు కారిడోర్ ల వెంబడి అభివృద్ధి చోటు చేసుకొంటుంది. దాని వల్ల ఆ మార్గం లో మరిన్ని నివాస , వాణిజ్య భవన సముదాయాల నిర్మాణాని కి తోడ్పాటు లభిస్తుంది.

ప్రధాన అంశాలు

కాన్ పుర్ మెట్రో రైల్ ప్రోజెక్టు ప్రధాన అంశాల లో.. :

1. ఐ ఐ టి నుండి నౌబస్తా కారిడోర్ మధ్య దూరం 23.785 కిలోమీటర్లు దానిలో కొన్ని ఎత్తయిన మరికొన్ని భూగర్భ స్టేశన్ లు; మొత్తం స్టేశన్ లు 22 (వీటిలో 14 ఎత్తయినవి మరియ 8 భూగర్భంలో ఉండేవి)

2. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి బారా -8 కారిడోర్ మధ్య దూరం 8.60 కిలోమీటర్లు; మొత్తం 8 స్టేశన్ లు 8 (వీటిలో 4 ఎత్తయినవి మరియు 4 భూగర్భంలో ఉండేవి)

3. ప్రాజెక్టు అంచనా వ్యయం 11,076.48 కోట్ల రూపాయలు. ఈ ప్రోజెక్టు 5 సంవత్సరాల లో పూర్తి అవుతుంది..

వంటివి ఉన్నాయి.

సంధానం తాలూకు ముఖ్యాంశాలు

ఐ ఐ టి కాన్ పుర్ నుండి నౌబస్తా కారిడోర్ మార్గం నగరం నడిబొడ్డు మీదు గా ఐ ఐ టి కాన్ పుర్, సి ఎస్ జె ఎం విశ్వవిద్యాలయం, జి ఎస్ వై ఎమ్ వైద్య కళాశాల, ఝకర్ కటీ బస్ స్టేశన్ మరియు కాన్ పుర్ సెంట్రల్ రైల్వే స్టేశన్ తో పాటు పలు ప్రముఖ విద్యా సంస్థల ను, రైలు మరియు బస్ స్టేశన్ లను కలుపుతుంది.

కాకాదేవ్, గోవింద్ నగర్ వంటి జనసమ్మర్ద ప్రాంతాలకు సులభతర రవాణా సౌకర్యాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం- బారా 8 కారిడోర్ సమకూర్చనుంది.

పట్టణ నివాసుల, పారిశ్రామిక కార్మికుల మరియు యాత్రికుల అవసరాలు తీర్చే పర్యావరణానికి అనుకూలమైనటువంటి మరియు దీర్ఘావధి సార్వజనిక రవాణా వ్యవస్థ గా మెట్రో ఉంటుంది.

వాణిజ్య కార్యకలాపాలు ఆరంభమైన అనంతరం 40 లక్షల జనాభా కలిగిన కాన్ పుర్ మెట్రో రైల్ పథకం తో ప్రత్యక్షం గా, పరోక్షం గా ప్రయోజనాలను పొందగలుగుతుంది.

ప్రతిపాదిత కారిడోర్ ను వివిధ స్థాయి లలో రైల్వే స్టేశన్ లతో జోడించడం జరుగుతుంది. వీటిలో ఫీడర్ బస్సులు, మధ్యవర్తి సార్వజనిక రవాణా (ఐ పి టి), మోటార్లు ఉపయోగించని రవాణా ల వంటి సౌకర్యాలను అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతుంది. టికెట్ చార్జీల తో పాటు ఈ ప్రోజెక్టు మార్గం లో ఏర్పాటు చేసే స్టేశన్ లలో అద్దెలు మరియు ప్రకటన ల జారీ కి వెసులుబాటు కల్పించడం ద్వారా రాబడి ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు.

మెట్రో రైల్ కారిడోర్ ల మార్గం లో ఉన్న నివాస ప్రాంతాల లో ఉండే వారు ఈ ప్రోజెక్టు వల్ల చాలా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ ప్రాంతాల వాసులు వారి ఇంటి ఇరుగుపొరుగు స్టేశన్ ల నుండి నగరం లోని వివిధ ప్రాంతాల కు సులభం గా చేరుకోగలిగే సదుపాయం అందివస్తుంది.

ప్రోజెక్టు ముఖచిత్రం

• ఈ ప్రోజెక్టు అమలు కోసం భారత ప్రభుత్వాని కి, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాని కి 50:50 భాగస్వామ్యం తో సంయుక్త యాజమాన్యం ఉంటుంది. ఈ ప్రోజెక్టు కార్యరూపం లోకి రావడం కోసం లఖ్ నవూ మెట్రో రైల్ కార్పోరేశన్ ను ‘‘ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్ కార్పోరేశన్’’ (యుపిఎంఆర్ సి) గా పునర్ వ్యవస్థీకరిస్తారు.

• కాన్ పుర్ మెట్రో రైల్ ప్రోజెక్టు లో భారత ప్రభుత్వాని కి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాని కి సమాన నిష్పత్తి లో ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. చేరి సగం పెట్టుబడి పెట్టడంతో పాటు ద్వైపాక్షిక / బహుళపక్ష అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ/సంస్థల నుండి సరళ వడ్డీ రుణాన్ని తీసుకుంటారు.

• ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 ఆర్ధిక సంవత్సరం బడ్జెటులో ఈ ప్రోజెక్టు కోసం 175 కోట్ల రూపాయల ను కేటాయించింది.

ప్రభావం

ఈ ప్రోజెక్టు వల్ల నగర వాసుల కు అందుబాటు ధరల లో నమ్మకమైన, సురక్షితమైన, అడ్డంకులు లేని, అంతరాయం లేని రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. దానివల్ల ప్రమాదాలు, ప్రయాణ సమయం, ఇంధన వినియోగం, సంఘ వ్యతిరేక ఘటన లు తగ్గుతాయి. క్రమ పద్ధతి లో పట్టణ విస్తరణ, భూ వినియోగం వల్ల నిలకడైన అభివృద్ధి జరగడాని కి తోడ్పడుతుంది.

పూర్వరంగం

ఉత్తర్ ప్రదేశ్ లోని అతి పెద్ద నగరాలలో కాన్ పుర్ ఒకటి. నగర జనాభా 41 లక్షలు. అనేక పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలతో నగరానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. పట్టణీకరణ , సత్వర ప్రగతి వల్ల నగరం లో వాహనాల రద్దీ, వాయు కాలుష్యం పెరిగింది. అందువల్ల కాన్ పుర్ నగరం లో సార్వజనిక రవాణా వ్యవస్థ ను బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ అవసరాన్ని ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రోజెక్టు తీర్చగలదు. ఈ ప్రోజెక్టు కు ఆమోదం తెలపడం తో పాటు మెట్రో ప్రోజెక్టు కు ఆమోదం లభించిన ఒక సంవత్సర కాలం లోపల కాన్ పుర్ లో సిటీ బస్ సర్వీసుల ను పటిష్టపరచాలని మంత్రివర్గం నిర్దేశించింది.

*****