Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కీల‌క‌మైన మౌలిక సదుపాయాల రంగాల ప‌నితీరును స‌మీక్షించిన ప్ర‌ధానమంత్రి

కీల‌క‌మైన మౌలిక సదుపాయాల రంగాల ప‌నితీరును స‌మీక్షించిన ప్ర‌ధానమంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కీల‌క‌మైన అవస్థాపన రంగాలైన

రహదారులు, రైల్వేలు, విమానాశ్ర‌యాలు, ఓడరేవులు, డిజిట‌ల్‌ మరియు బొగ్గు రంగాల పురోగ‌తిపై మంగ‌ళవారం స‌మీక్షను నిర్వ‌హించారు. దాదాపు నాలుగున్న‌ర గంట‌ల‌ పాటు జ‌రిగిన ఈ స‌మీక్ష స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, నీతి ఆయోగ్ లకు చెందిన ఉన్న‌తాధికారులతో పాటు భార‌త ప్ర‌భుత్వం లోని అవస్థాపన సంబంధిత మంత్రిత్వ‌ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

నీతి ఆయోగ్ సిఇఒ ఇచ్చిన ప్రజెంటేష‌న్ మౌలిక‌ సదుపాయాల రంగంలోని ప‌లు విభాగాలలో విశేష పురోగతి చోటు చేసుకున్న విషయాన్ని స్పష్టం చేసింది. రహదారులు మరియు రైల్వేల రంగాలలో అభివృద్ధిని గురించి తెలుసుకున్న ప్రధాన మంత్రి ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులలో ఏకీకృత‌ విధానంతో ముందుకువెళ్లాల‌ని, వాటిని కచ్చితమైన కాల వ్యవధుల లోపల ముగిసే దిశగా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌ధాన మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌నలో భాగంగా గ్రామీణ రహదారుల విషయంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా రోజుకు స‌గ‌టున 130 కిలోమీట‌ర్ల మేర రోడ్ల నిర్మాణం జ‌రుగుతోంది. దీనితో 2016-17 లో పిఎమ్ జిఎస్‌వై లో 47,400 కిలోమీట‌ర్ల మేర రహదారులను కొత్తగా జోడించడమైంది. అద‌నంగా 11,641 జనావాసాలు రోడ్ల ద్వారా అనుసంధానించ‌బ‌డ్డాయి.

2017 ఆర్థిక సంవ‌త్స‌రంలో గ్రీన్ టెక్నాల‌జీ వినియోగం ద్వారా 4000 కిలోమీట‌ర్ల గ్రామీణ రోడ్లు నిర్మిత‌మ‌య్యాయి. సంప్రదాయేత‌ర వ‌స్తువులైన ప్లాస్టిక్‌, కోల్డ్ మిక్స్‌, జియో-టెక్స్‌టైల్స్‌, ఫ్లైయాష్‌, ఇనుము, రాగి ఉత్ప‌త్తిలో వెలువ‌డిన వ్య‌ర్థాల‌ను క‌లిపి ఈ గ్రీన్ టెక్నాల‌జీలో వాడ‌తారు.

స‌మ‌ర్థ‌వంత‌మైన‌, క‌చ్చిత‌మైన ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్య‌మైన రోడ్ల నిర్మాణం జ‌ర‌గాలని ప్ర‌ధాన మంత్రి ఆదేశించారు. మేరీ స‌డ‌క్ వంటి యాప్‌లాగా ప్ర‌స్తుత‌మున్న సాంకేతిక‌త‌కు తోడుగా.. అంత‌రిక్ష సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాలని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా తెలిపారు. ఇప్ప‌టిక‌వ‌రకు అనుసంధానం లేని గ్రామాల‌ను క‌లిపే కీల‌క‌రోడ్లను క‌లిపే.. రోడ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతిక‌త‌న‌ను కూడా వినియోగించుకోవాల‌న్నారు. ప్ర‌పంచ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా మౌలిక‌వ‌స‌తుల క‌ల్ప‌న‌, వాటి వినియోగం గురించి కొత్త సాంకేతిక వినియోగాన్ని ప‌రిశీలించాల‌ని నితి ఆయోగ్‌ను కోరారు.

2017 ఆర్థిక సంవ‌త్స‌రంలో జాతీయ ర‌హ‌దారుల రంగంలో 26వేల కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణం జ‌రిగింది. రోజురోజుకూ వేగం పెరుగుతోంది.
రైల్వే రంగంలో 2016-17లో 953 కిలోమీట‌ర్ల కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. గ‌తంలో ఇది 400 కిలోమీట‌ర్లుగా ఉండేది. ఇదే స‌మ‌యంలో 2వేల కిలోమీట‌ర్ల క‌న్నా ఎక్కువే ట్రాక్ విద్యుదీక‌ర‌ణ, వెయ్యి కిలోమీట‌ర్ల‌కు పైగా గాజ్ మార్పు జ‌రిగింది. 2016-17లోనే దాదాపు 1500కు పైగా కాప‌లాదారుల్లేని రైల్వే క్రాసింగుల‌ను తొల‌గించాం. వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం.. 115 రైల్వే స్టేష‌న్ల‌లో వైఫై యాక్సెక్‌, 34వేల బ‌యో టాయిలెట్లు ఏర్పాటుచేశాం. రైల్వేస్టేష‌న్ల పున‌ర‌భివృద్ధి ప‌నులు, చార్జీలు పెంచ‌కుండా ఆదాయం పెంచ‌టంపైనా దృష్టి సారించాల‌ని ఈ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని కూడా ప్ర‌ధాని సూచించారు.

రైల్వే, రోడ్డు రంగాల్లో ముఖ్య‌మైన ప్రాజెక్టులైన ఈస్టర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే, చార్‌ధామ్ ప్రాజెక్టు, క్వాజీగుండ్‌-బ‌నీహాల్ ట‌న్నెల్‌, చీనాబ్ రైల్వే బ్రిడ్జి, జిరిబామ్‌-ఇంఫాల్ ప్రాజెక్టుల అభివృద్ధి పైనా ప్ర‌ధాని స‌మీక్ష జ‌రిపారు. వైమానిక రంగంలో ప్రాంతీయ అనుసంధాన‌త ప‌థ‌కం ద్వారా 43 ప్రాంతాల‌ను (31 కొత్త ప్రాంతాల‌ను) క‌ల‌ప‌నున్నారు. విమాన‌యాన రంగంలో ప్ర‌యాణికుల సామ‌ర్థ్యం కూడా ఏడాదికి 282మిలియ‌న్ల‌కు చేరింది.

పోర్టుల రంగంలో, సాగ‌ర‌మాల ప్రాజెక్టులో భాగంగా.. రూ.8ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌తో 415 ప్రాజెక్టుల‌ను గుర్తించారు. 1.37 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులను అమ‌లుచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. నౌకాప్ర‌యాణం, ఎగ్జిమ్ కార్గోల క్లియ‌రెన్స్‌ల్లో మంచి ఫ‌లితాలు రావాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నొక్కిచెప్పారు. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో మేజ‌ర్ పోర్టుల్లో 100.4 ఎంటీపీఏల సామ‌ర్థ్యం అద‌నంగా న‌మోదైంది. 193 లైట్ హౌజ్‌లు సౌర‌శ‌క్తితో అనుసంధాన‌మ‌య్యాయి. అన్ని ప్ర‌ధాన పోర్టుల్లో భూరికార్డుల‌న్నీ డిజిటైజేష‌న్ పూర్త‌య్యాయి.
డిజిట‌ల్ మౌలిక‌వ‌స‌తుల రంగంలో, 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో వామ‌ప‌క్ష ఉగ్ర‌వాదం ప్ర‌బ‌లంగా ఉన్న జిల్లాల్లో 2187 మొబైల్ ట‌వ‌ర్లు నిర్మించారు.

జాతీయ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్‌పైనా ప్ర‌ధాని స‌మీక్షించారు. వ‌చ్చే కొన్ని నెల‌ల్లో వేల గ్రామ పంచాయ‌తీల‌ను అనుసంధానంచేసే డిజిట‌ల్ క‌నెక్టివిటీ నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌టంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల అద్భుత‌మైన సాధికార‌త పెంచ‌టంతోపాటు వారి జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచేలా స‌రైన ప‌రిపాల‌న ప‌ద్ధ‌తుల ద్వారా మ‌ద్ద‌తిచ్చేందుకు ప్ర‌ధాని భ‌రోసా ఇచ్చారు
బొగ్గు రంగంలో, 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో బొగ్గు లింకేజీల హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌, మూమెంట్ సంపాద‌న ద్వారా రూ.2500 కోట్ల వార్షిక పొదుపు జ‌రిగింది. గ‌తేడాది బొగ్గు దిగుమ‌తిలో గ‌ణ‌నీయ‌మైన త‌గ్గుద‌లపై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ.. బొగ్గు దిగుమ‌తికి ప్ర‌త్యామ్నాయం, కొత్త బొగ్గు సాంకేతిక‌త అమ‌లు, గ్యాసిఫికేష‌న్ సాంకేతిక‌త‌ కోసం మ‌రింత క‌ఠిన ప్ర‌య‌త్నాలు చేయాల‌ని కోరారు.