పిఎంఇండియా
శ్రేష్ఠుడైన అధ్యక్షుడు పుతిన్,
గౌరవనీయురాలైన తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత గారు,
మంత్రి సుష్మ స్వరాజ్ గారు,
మంత్రి పొన్ రాధాకృష్ణన్ గారు,
ప్రియమైన మిత్రులారా..
నమస్కారం
వణక్కమ్
ఈ రోజు నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు.
ఈ రోజు కుడన్ కుళమ్ పరమాణు విద్యుత్ కేంద్రం ఒకటో యూనిట్ ను దేశానికి అంకితమిచ్చే గౌరవాన్ని శ్రేష్టుడైన పుతిన్ మరియు నేను దక్కించుకున్నాము.
మరీ ముఖ్యంగా, అధ్యక్షుడు పుతిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు నేనెతో కృతజ్ఞుడిని.
అలాగే తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా ఈ సందర్భంగా హాజరవ్వడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
మిత్రులారా..
కుడన్ కుళమ్ 1 ని దేశానికి అంకితం ఇవ్వడం ద్వారా భారతదేశం- రష్యా సంబంధాలలో మనం మరొక్క చరిత్రాత్మకమైన అడుగును వేశాము.
ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడం మన ప్రత్యేకమైన, విశేషాధికారం కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క శక్తిని చాటిచెప్పే ఒక చక్కని ఊదాహరణే కాదు; ఇది మన మైత్రీబంధం జరుపుకొంటున్న ఒక వేడుక కూడా.
అంతే కాకుండా, ఈ రంగంలో మన సహకారానికి ఇది ఒక ఆరంభం మాత్రమే.
1,000 ఎమ్ డబ్ల్యు సామర్ధ్యం కలిగిన కుడన్ కుళమ్ 1 భారతదేశంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక యూనిట్ అనే సంగతి బహుశా అందరికీ తెలియకపోవచ్చు.
రానున్న కాలంలో మనం పరమాణు విద్యుత్ ఉత్పాదనలో ఒక గొప్ప కార్యాచరణను నిర్దేశించుకోవాలని కంకణ బద్ధులమయ్యాము.
ఒక కుడన్ కుళమ్ లోనే ఒక్కొక్కటి 1,000 ఎమ్ డబ్ల్యు సామర్ధ్యం కలిగి ఉండే మరో 5 యూనిట్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము.
మన ఈ సహకారపూర్వక ప్రయాణంలో ఇంకా పెద్దదైన పరమాణు విద్యుత్ యూనిట్లను నిర్మించాలని కూడా మన భావిస్తున్నాము.
మిత్రులారా,
ఈ రోజు చేపట్టిన కార్యక్రమం భారతదేశం మరియు రష్యా లకు చెందిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఇంకా సాంకేతిక నిపుణుల బృందం ఎంతో ఆనందించే సందర్భంగా కూడా.
వారి అంకితభావానికి, కఠోర పరిశ్రమకు, వారు పడ్డ కష్టం ఫలప్రదం అయినందుకు వారికి మనం ప్రణామాలు చేద్దాం.
మిత్రులారా,
సాంకేతిక విజ్ఞానపరంగా పురోగతి సాధించడం, ఇంకా ఆర్థికపరంగా సమృద్ధిని సాధించడం.. వీటితోనే మానవ వికాస గాథ పెనవేసుకుపోయింది.
అయితే ఇది మన పర్యావరణంపై భారం పడకుండా సిద్ధించలేదన్న విషయం మనకందరికీ తెలుసు.
మన ఆర్థిక పురోగతి భూమాత గౌరవాన్ని పెంచేదిగా ఉండాలన్నదే నా స్వప్నం.
అలాగే, మన పారిశ్రామిక వికాసం చోదకాలు శుద్ధ శక్తి ఆలంబనగా పరుగు తీస్తున్నవే.
కుడన్ కుళమ్ 1 భారతదేశంలో శుద్ధ శక్తి ఉత్పాదనను పెంచుకోవాలనే దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన భాగం.
అంతే కాకుండా పర్యావరణ స్నేహపూర్వకమైన వృద్ధికి భాగస్వామ్య స్పూర్తితో బాటలు వేయాలన్న మన సంయుక్త నిబద్ధతకు ఒక సంకేతం కూడా.
శ్రేష్టుడైన అధ్యక్షుడు పుతిన్,
పరమాణు విద్యుత్ ఉత్పాదనలో మన సంయుక్త కృషి జయప్రదం కావడం మన సహకారం సాధించినటువంటి ఒక గర్వించే అంశం, ఇది మన బంధాలను ధృడంగానూ, స్థిరంగానూ నిలుపుకోవాలన్న మన ఉమ్మడి కట్టుబాటుకు ఒక నిదర్శనం కూడా.
అన్నింటిని మించి ఇది మన వ్యక్తిగతమైన నిబద్ధతను నిరూపిస్తున్నది. అంతేకాదు, మన సంబంధాల స్వరూప, స్వభావాలను పరివర్తనకు లోను చేయడంలో నిరంతరం మనం అందించుకుంటున్న మద్దతుకు పటిష్టమైన నాయకత్వానికి ఇది ఒక రుజువు.
ఇందుకు గానూ అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను.
భారతదేశ ప్రజానీకం సహజంగానే మీ గొప్పదేశ ప్రజలతో ఎంతో సౌఖ్యంగా ఉంటున్నారు.
ఇక నేను స్వయంగా మన స్నేహాన్ని ఎంతో విలువైందిగా భావిస్తు వస్తున్నాను.
కాబట్టే మనం ఇద్దరం కలసి కుడన్ కుళమ్ పరమాణు విద్యుత్ కేంద్ర ఒకటో యూనిట్ ను అంకితం ఇవ్వడం మన మధ్య ఉన్న మిత్రత్వానికి, సహకారానికి మరింత శక్తిని సమకూర్చే ఒక సరైన పని అవుతోంది.
భారతదేశం-రష్యా ల మైత్రి బంధం వర్ధిల్లు గాక !
ఈ కార్యక్రమంలో నాతో కలిసి పాలుపంచుకున్నందుకు అధ్యక్షుల వారికి నేను మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మనతో కలసి పాలుపంచుకున్నందుకు జయలలిత గారికి ఇవే నా మన: పూర్వక ధన్యవాదాలు.
కృతజ్ఞతలు.
మళ్లీ మళ్లీ ధన్యవాదములు..
Kundankulum 1 is an important addition to India's continuing efforts to scale up production of clean energy in India: PM Modi
— PMO India (@PMOIndia) August 10, 2016
Kudankulam 1 also signals our joint commitment to build pathways of partnership for green growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 10, 2016
I have always deeply valued our friendship with Russia & it is fitting that we jointly dedicate Kudankulam Nuclear Power Plant Unit 1: PM
— PMO India (@PMOIndia) August 10, 2016