పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పూట కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో వద్ద నుండి ఒక టెలిఫోన్ కాల్ ను అందుకొన్నారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలు ముడిపడివున్న పరిణామాలపై, ప్రత్యేకించి శీతోష్ణ స్థితిలో మార్పు అంశంపై ఒకరి అభిప్రాయాలను మరొకరికి తెలియజెప్పుకొన్నారు. పారిస్ ఒప్పందం అమలును ముందుకు తీసుకు వెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ఈ సంవత్సరంలో కెనడా కాన్ ఫెడరేశన్ 150వ వార్షికోత్సవం జరుపుకోనుండగా అందుకుగాను ప్రధాని శ్రీ ట్రూడో ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ అభినందించారు. కెనడా తో ద్వైపాక్షిక సంబంధాలు వివిధ రంగాలలో నిలకడైనటువంటి సర్వతోముఖ అభివృద్ధిని నమోదు చేస్తుండటాన్ని ఆయన మెచ్చుకొన్నారు.
శక్తివంతమైనటువంటి సంబంధాలను ప్రోత్సహించుకోవడం కోసం కమ్యూనికేషన్ ను, సహకారాన్ని కొనసాగించేందుకు ఉభయ నాయకులు సమ్మతించారు.
PM’s telephonic conversation with Prime Minister @JustinTrudeau of Canada. https://t.co/lgGyGwDrIf
— PMO India (@PMOIndia) June 19, 2017
via NMApp