పిఎంఇండియా
అణు ఇంధన భద్రతా సమావేశాల్లో పాల్గొనేందుకు వాషింగ్టన్ డిసి పర్యటనలో ఉన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ( ఏప్రిల్ ఒకటో తేదీన) కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడోతో సమావేశమయ్యారు.
ట్రోడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో కొత్త ఉత్తేజం, వేగం చోటు చేసుకున్నాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు. ఆర్థికంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు గల అవకాశాల గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. గత ఏడాది కెనడా సందర్శించిన సమయంలో తాను కెనడా పెన్షన్ ఫండ్ ప్రతినిధులతో జరిపిన సమావేశం గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం వారిలో కొందరు భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఎన్ఎస్ఎస్ విందు సమావేశంలో ప్రధాని శ్రీ మోదీ జోక్యం చేసుకున్నందుకు కెనడా ప్రధాని ఆయనను అభినందించారు. అణు ఇంధన వ్యాప్తిని నిరోధించే విషయంలో కెనడా, ఇండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ట్రోడో అన్నారు.
పునరుత్పాదక ఇంధన వనరులకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధాని శ్రీ మోదీ ప్రస్తావించారు. భారత్‌తో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే క్రమంలో స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక వసతులు, నైపుణ్యాల వృద్ధి విభాగాల్లో కెనడా సహకారాన్ని విస్తరించుకోవచ్చునని ఆయన సూచించారు. హైడ్రోకార్బన్ విభాగంలో కూడా ప్రభుత్వం ప్రగతిశీలకమైన విధానం అనుసరిస్తున్నదంటూ కోల్ గ్యాసిఫికేషన్, భూగర్భ బొగ్గు గనుల విభాగంలో కెనడా సహకరించాలని శ్రీ మోదీ కోరారు.
భారత్ సందర్శించాల్సిందిగా ప్రధాని ఆహ్వానాన్ని ట్రోడో అంగీకరించారు.
ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగానే ప్రధాని శ్రీ మోదీ బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను కలిశారు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గత ఏడాది జరిపిన బ్రిటన్ పర్యటన గురించి ఉభయులు గుర్తు చేసుకున్నారు. భారత బ్రిటన్ సంబంధాలు మరింత సుసంపన్నం, మరింత పటిష్ఠం అయినట్టు శ్రీ మోదీ చెప్పారు. రక్షణ సహకారం గురించి ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియాలోను ప్రత్యేకించి రక్షణ రంగంలోను చురుకైన భాగస్వామి కావాలని కామెరూన్‌ను శ్రీ మోదీ కోరారు. వీసా అంశం కూడా ఉభయుల మధ్య ప్రస్తావనకు వచ్చింది.
Canadian connect...today's meetings commence with an interaction with Canada's PM @JustinTrudeau. Both PMs discuss India-Canada relations.
— PMO India (@PMOIndia) April 1, 2016
Enhancing a vibrant partnership...PM @narendramodi & PM @David_Cameron talk India-UK ties. @Number10gov pic.twitter.com/P4a1BWAftt
— PMO India (@PMOIndia) April 1, 2016
A Summit that has brought together several nations to discuss a subject of great importance. pic.twitter.com/I4jPxvOZFc
— PMO India (@PMOIndia) April 1, 2016
NSS is about a commitment to making our world safer & creating a better tomorrow for future… https://t.co/C52c4bBCHd
— Narendra Modi (@narendramodi) April 1, 2016
There have been enriching interactions and discussions on Nuclear Security during #NSS2016. pic.twitter.com/7ZXmwojfBn
— Narendra Modi (@narendramodi) April 1, 2016
Was indeed wonderful to meet you again @JustinTrudeau. The new energy & dynamism in India-Canada ties is gladdening. https://t.co/tWTKmmHleJ
— Narendra Modi (@narendramodi) April 1, 2016
My meeting with PM @David_Cameron focused on defence cooperation, @makeinindia & other key issues. pic.twitter.com/zFENJehD4U
— Narendra Modi (@narendramodi) April 1, 2016