పిఎంఇండియా
కెనడా సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత జస్టిన్ ట్రుడ్యును భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయనకు శ్రీ మోదీ లేఖ రాశారు. ప్రధాని లేఖ సారాంశం ఇదీ-
సాధారణ ఎన్నికల్లో కెనడా లిబరల్ పార్టీని విజయం దిశగా నడిపించిన మీకు భారత ప్రభుత్వం, దేశ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దార్శనికత, యువత మీ నాయకత్వ బలం. ఇది దేశవిదేశాల్లో కెనడాకు విజయాల్ని అందిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతేగాకుండా అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఎన్నో సవాళ్ళ నేపథ్యంలో చూసినా మీ సారథ్యం ప్రపంచానికి కూడా ఎంతో కీలకమైది. గత ఏప్రిల్‌లో కెనడా పర్యటన సందర్భంగా మనిద్ధరి భేటీ ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యం, బాహుళ్యం, చట్టాలు, ప్రజసంబంధాలు పునాదులుగా విస్తరించిన మన రెండు దేశాల బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న మీ ఆలోచన నన్నెంతో ఆకట్టుంది.
భారత్, కెనడాల మధ్య సంబంధాలు ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందాయి. నా పర్యటనతో అవి వ్యూహాత్మక బంధం స్థాయికి ఎదిగాయి. భారత సాంఘిక, ఆర్థిక రూపాంతరీకరణలో కెనడా అనేది ఓ కీలకమైన, నమ్మకమైన భాగస్వామిగా ఎదిగింది. మన రెండు దేశాల భాగస్వామ్యం పలు రంగాల్లో ద్వైపాక్షిక ప్రయోజనాలకే కాకుండా, ప్రపంచంలో శాంతికి, శ్రేయో ప్రపంచాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మన రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలపడేలా, విస్తరించేలా ఇరువురం కలసి పనిచేయాలని ఆశిస్తున్నానను.
మీరు సకుటుంబ సమేతంగా భారత్‌కు అధికారిక పర్యటనకు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. న్యూఢిల్లీలో మీకు స్వాగతం పలకటానికి ఎదురుచూస్తుంటాను.