Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర జాబితా లో ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉప వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప‌రిశీలించేందుకు క‌మిషన్ ప‌ద‌వీకాలాన్ని పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


కేంద్ర జాబితా లో ఇత‌ర వెనుక‌బ‌డిన కులాల‌ ఉప వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప‌రిశీలించేందుకు క‌మిషన్ ప‌ద‌వీకాలాన్ని 2018 న‌వంబ‌ర్ వ‌ర‌కు పొడిగించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ఈ అంశం తో సంబంధం ఉన్న‌టువంటి వ‌ర్గాలు.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, రాష్ట్ర వెనుక‌బ‌డిన కులాల క‌మిష‌న్ లు, వివిధ స‌ముదాయ సంఘాల తో పాటు వేరు వేరు వెనుక‌బ‌డిన కులాలకు మ‌రియు క‌మిష‌న్ ల‌కు చెందిన సాధార‌ణ ప్ర‌జానీకం తో ఈ క‌మిష‌న్ విస్తృత స్థాయి లో స‌మావేశాల‌ను నిర్వ‌హించింది. అంతేకాదు, ఈ క‌మిష‌న్ ఉన్న‌త విద్య సంస్థ లో చేరిన ఒబిసి ల కులంవారీ రికార్డుల‌ను మ‌రియు ఇదే మాదిరిగా కేంద్ర విభాగాలలో, కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లలో, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులలో, ఇంకా ఆర్థిక సంస్థ‌ల లో జ‌రిగిన భ‌ర్తీ ల కులంవారీ స‌మాచారాన్ని కూడా స్వీక‌రించింది.

ప‌రిశీలించిన మ‌రియు విశ్లేషించిన స‌మాచారం ఆధారంగా ఉప వ‌ర్గీక‌ర‌ణ కు సంబంధించిన జాబితాల‌ను మ‌రియు త‌త్సంబంధిత నివేదిక‌ ను ఖ‌రారు చేసే క‌న్నా ముందు రాష్ట్రాల తోను, ఆయా రాష్ట్రాల వెనుక‌బ‌డిన కులాల క‌మిషన్ ల తోను మ‌రో విడ‌త చ‌ర్చ జ‌ర‌ప‌వలసిన అవ‌స‌ర‌ం ఉందన్న అభిప్రాయాన్ని క‌మిషన్ వెలిబుచ్చింది.

**