Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్రాయోజిత‌ ప‌థ‌కాల్లో హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రుల ఉప సంఘం నివేదిక

కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో హేతుబ‌ద్ధీక‌ర‌ణ పై ముఖ్య‌మంత్రుల ఉప సంఘం ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ఈ ఉప సంఘం త‌ర‌ఫున తుది నివేదిక‌ను మధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్‌చౌహాన్ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీకి స‌మ‌ర్పించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, అరుణాచ‌ల్‌ ప్ర‌దేశ్‌, జ‌మ్మూ కాశ్మీర్‌, జార్ఖండ్‌, కేర‌ళ‌, మ‌ణిపూర్‌, నాగాలాండ్‌, రాజ‌స్థాన్‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రుల‌తోపాటు అండ‌మాన్ నికోబార్ దీవుల లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఈ ఉప సంఘం లో స‌భ్యులుగా ఉన్నారు.

నివేదిక స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మంలో అరుణాచ‌ల ప్ర‌దేశ్‌, జ‌మ్మూ కాశ్మీర్‌, జార్ఖండ్‌, మ‌ణిపూర్‌, రాజ‌స్థాన్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, అండ‌మాన్ నికోబార్ దీవుల లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పాల్గొన్నారు.
నివేదిక త‌యారీ కోసం ముఖ్య‌మంత్రులు చేసిన కృషిని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌శంసించారు.