Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ క‌ర‌వు భ‌త్యం (డిఎ) మ‌రియు పెన్ష‌న‌ర్ల డియ‌ర్‌నెస్ రిలీఫ్ (డిఆర్‌) లలో 2018 జులై 1 నుండి అద‌నంగా 2 శాతానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ధ‌ర‌ల‌ లో పెరుగుద‌ల‌కు ప‌రిహారంగా, 2018 జులై 1వ తేదీ నుండి అమ‌ల‌య్యే విధంగా, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క‌ర‌వు భ‌త్యం (డిఎ) ను, పెన్ష‌న‌ర్ లకు డియ‌ర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ను మరో 2 శాతం మేర‌కు ఇచ్చేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించిన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మూల వేతనం/పెన్ష‌న్ తాలూకు రేటు అయిన 7 శాతానికి అద‌నంగా ఉంటుంది.

క‌ర‌వు భ‌త్యం మ‌రియు డియ‌ర్‌నెస్ రిలీఫ్ లు రెండింటి కార‌ణంగా ఖ‌జానా పై ప్రతి సంవత్సరానికి 6112.20 కోట్ల భారం పడుతుంది; 2018 – 19 ఆర్థిక సంవ‌త్స‌రం లో (2018 జులై నుండి 2019 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్యన ఉన్న 8 నెల‌ల కాలానికి) 4074.80 కోట్ల భారం ప‌డనుంది.

ఇది 48.41 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌రియు 62.03 ల‌క్ష‌ల మంది పింఛన్ దారులకు ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చనుంది.

ఈ పెరుగుద‌ల ఆమోదించిన‌టువంటి ఫార్ములా కు అనుగుణంగా ఉంది. ఇది 7వ కేంద్రీయ వేత‌న సంఘం సిఫారసులపైన ఆధారపడి ఉంది.

***