Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టికి ఆస్ట్రేలియా- భార‌త్ పౌర అణు స‌హ‌కార ఒప్పందం ప‌రిణామాలు


ఆస్ట్రేలియాతో పౌర అణు సహ‌కార ఒప్పందం అమ‌లుకు అవ‌స‌ర‌మైన ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఏర్పాట్ల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అద్య‌క్ష‌త‌న నేడు (డిసెంబ‌రు 30, 2015) జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప‌రిశీలించింది. ఈ ఒప్పందం ఈ ఏడాది నవంబ‌రు 13 నుంచి అమ‌లులోకి వ‌చ్చింది. ఇంద‌న స‌ర‌ఫ‌రాపై ఆస్ట్రేలియాతో కుదుర్చ‌కునే ఒప్పందంతో భార‌త్‌కు ఇంద‌న భ‌ద్ర‌త పెంపొందుతుంది. భార‌తావ‌నిలో అణు విద్యుత్ కేంద్రాల విస్త‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుంది.నిర్మించేందుకు అవ‌కాశం ఒన‌గూరుతుంది.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో 2015 సంవ‌త్స‌రం పౌర అణు స‌హ‌కారం రంగం పెద్ద విజ‌యాల‌ను తీసుకువ‌చ్చింది. 2015 డిసెంబ‌రు 12న జ‌పాన్ ప్ర‌ధాని అబే భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌పుడు ఉభ‌య దేశాల మ‌ద్య పౌర అణు స‌హ‌కార ఒప్పందానికి రంగం సిద్ధ‌మైంది. గ‌త అయిదు సంవ‌త్స‌రాల నుంచి చేసిన కృషి ఒక కొలిక్కి వ‌చ్చింది. జ‌పాన్ నాయ‌కుల‌తో ప‌లు మార్లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డ‌వం అణు రంగంలో గొప్ప మైలురాయి వంటి ప‌రిణామం సాధ్య‌మైంది.

2015 జ‌న‌వ‌రి 25 నుంచి 27 దాకా అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబామా న్యూఢిల్లీకి వ‌చ్చిన‌పుడు పౌర అణు స‌హ‌కార ఒప్పందాన్ని తిర‌గ‌దోడి అది అమ‌లు అయ్యేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. అప్ప‌టి నుంచి ఈ ఒప్పందం అమ‌లుకు ప‌రిపాల‌నాప‌ర‌మైన ఏర్పాట్ల‌కు సంత‌కాలు జ‌రిగాయి. అణు విద్యుత్ కేంద్రాల వల్ల జ‌ర‌గ‌రానిది జ‌రిగితే అందుకు బాధ్య త వ‌హించేందుకు అణు బీమా పూల్‌ ఏర్పాటు అయ్యింది. నూక్లియ‌ర్ డామేజి యాక్ట్, 2010 ఆధారంగా సివిల్ ల‌య‌బులిటీ క్లాజు పుట్టుకొచ్చింది. ఈ విష‌యంలో భార‌త్‌లో ప‌లువురు వెలిబుచ్చిన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ క్లాజు రూపొందింది. గుజ‌రాత్ లోని విర్ది అనే ప్రాంతంలో ఏపీ- 1000 రియాక్ట‌ర్ కు చెందిన‌ 6 యూనిట్ల నిర్మాణ ప్ర‌తిపాద‌న‌లు 2016లో నిర్దార‌ణ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ విష‌యంలో ఎన్‌పీసీఐఎల్‌- వెస్టింగ్ హౌస్ ల మ‌ధ్య వాణిజ్య‌ప‌ర‌మైన సంప్ర‌దింపులు చోటు చేసుకున్నాయి.

అంతే కాకుండా ర‌ష్యా, ఫ్రాన్స్ ల స‌హ‌కారంతో పౌర అణు స‌హ‌కార ఒప్పందం అమ‌లుకు భార‌త ప్ర‌భుత్వం ఈ ఏడాది చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న‌లో లార్స‌న్ అండ్ టుబ్రో- అరెవా కంపెనీల మ‌ధ్య‌ అవ‌గాహ‌నపూర్వ‌క‌ ఒప్పందం కుదిరింది. దీని వ‌ల్ల మ‌హారాష్ట్ర‌లోని జైతాపూర్‌ ప్రాజెక్టు నిర్మాణం ప‌నుల‌ను స్థానికంగా చేప‌ట్ట‌డం వ‌ల్ల అంచ‌నా వ్య‌యం త‌గ్గింది. అదే విధంగా ఈ ఏడాది డిసెంబ‌రు 22న ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన‌ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌తో రెండు దేశాల మ‌ధ్య సంయుక్త కార్యాచ‌ర‌ణ సాధ్యం అయ్యింది. ర‌ష్యా సాంకేతిక విజ్ఞానం ఆదారంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు భార‌త్‌లో చేప‌ట్టేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ర‌ష్యా స‌హ‌కారంతో క‌నీసం12 రియాక్ట‌ర్ల‌ను నిర్మించాల‌నేది ల‌క్ష్యం.

ఈ ఏడాది ఏప్రిల్ లో ప్ర‌ధాన మంత్రి కెన‌డా లో ప‌ర్య‌టించిన‌పుడు యురేనియం దీర్ఘ‌కాలిక స‌ర‌ఫ‌రా కోసం ఒక కాంట్రాక్టుపై సంత‌కాలు జ‌రిగాయి. దీంతో 2015 డిసెంబ‌రులో యురేనియం తొలి విడ‌త క‌న్‌సైన్‌మెంట్ భార‌త్ కు చేరింది. ఇదే విధంగా, ప్ర‌ధాని 2015 జులై లో క‌జ‌క్‌స్థాన్ లో ప‌ర్య‌టించిన‌పుడు యురేనియం కొనుగోలు కోసం దీర్ఘ‌కాలిక స‌ర‌ఫ‌రా కాంట్రాక్టు పై సంత‌కాలు జ‌రిగాయి.

వీటికి తోడుగా దేశంలో కూడా తీసుకొన్న కొన్ని చొర‌వ‌లు మ‌రీ ముఖ్యంగా అణు శ‌క్తి చ‌ట్టానికి పార్ల‌మెంటులో స‌వ‌ర‌ణ తేవ‌డం ద్వారా దేశంలో అణు విద్యుత్ రంగం అభివృద్ది అయ్యేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఈ చ‌ర్య మూలంగా ఇత‌ర ప్ర‌భుత్వ రంగం సంస్థ‌ల‌తో ఎన్‌పీసీఐఎల్ జాయింట్ వెంచ‌ర్లు కుదుర్చుకునేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఈ ఒప్పందాలు దేశంలో అణువిద్యుత్ కేంద్రాలు విస్త‌రించేందుకు బ‌ల‌మైన పునాదిని వేశాయి. ఎన్నో ఆశ‌లు, ఆశ‌యాలు పెంచుకున్న ఈ స‌దుద్దేశం వ‌ల్ల అణు విద్యుత్ రంగం లో ప్ర‌గ‌తి సాధ్యం అయ్యింది.