Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) పదో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగం

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సామాన్యుడి చేతిలో అస్త్రమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టం ద్వారా సామాన్యుడికి కేవలం సమాచారాన్ని తెలుసుకునే హక్కు లభించడమే కాకుండా, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే హక్కు కూడా వచ్చిందని ఆ యన ఉద్ఘాటించారు.

కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) పదో వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఆ ర్టీఐకి అదనపు బలమని ఆ యన అన్నారు. ఎందుకంటే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టడం ద్వారా పారదర్శకత ఏర్పడుతుందని, ఇది అంతిమంగా వి శ్వాస పూర్వక విధానాలకు కారణమవుతుందని వి వరించారు.

బొ గ్గు గనుల, స్పెక్ట్రం, ఎఫ్‌ఎం రేడియా లైసెన్సుల వేలాల గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజలకు క్రియాశీలక రీతిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆ యన అన్నారు.

ప్రభుత్వంలో నిగూఢ, రహస్య తరహా విధానాలకు స్వస్తి పలకాల్సి ఉందని ప్రధానమంత్రి ఉద్బోధించారు. ప్రజలను సందేహించడానికి బదులు వారిని వి శ్వాసంలోకి తీసుకుంటూ పరిపాలనా ప్రక్రియ సాగాలని అభిప్రాయపడ్డారు.

సుపరిపాలనకు ఆ ర్టీఐ ఒ క ఉపకరణంగా మారిందని ప్రధాని అభివర్ణించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రగతి వేదిక, ఆ యా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడంలో ఎ లా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదో శ్రీ నరేంద్రమోదీ ఈ సందర్భంగా వి వరించారు.