Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళప్పిరవి సందర్భంగా కేరళమ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


కేరళప్పిరవి ఈ రోజు. ఈ సందర్భంగా కేరళమ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళానికి చెందిన చైతన్యవంతమైన సంప్రదాయాలను, అసాధారణ స్ఫూర్తిని ఈ విశిష్ట సందర్బంలో ఒక ఉత్సవం మాదిరిగా ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటారని శ్రీ మోదీ అన్నారు. ప్రాకృతిక శోభతో పాటు సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని సమృద్ధంగా కలిగివున్న ఈ రాష్ట్రానికి దేశ చరిత్రలో సదా కీలక స్థానం ఉందని ప్రధానమంత్రి అన్నారు.
‘‘కేరళమ్ ప్రజానీకం ఈ రాష్ట్రానికి ఉన్న అత్యంత గొప్ప శక్తి. వారి అంకితభావం, ప్రావీణ్య సాధన పట్ల వారికి ఉన్న నిబద్ధత భారత్‌కు వెలుపల కూడా ప్రశంసలను పొందాయి. ఆరోగ్యసంరక్షణ, విద్య, ఔత్సాహిక పారిశ్రామికత్వం, విజ్ఞ‌ానశాస్త్రం సహా విభిన్న రంగాలలో వారు సాధిస్తున్న విజయాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘కేరళంలోని నా సోదరీ, సోదరులకు కేరళప్పిరవి శుభాకాంక్షలు.
ఈ విశిష్ట సందర్భం కేరళానికి చెందిన చైతన్యభరిత సంప్రదాయాలతో పాటు అసాధారణ స్ఫూర్తిని పండుగ చేసుకొనే సందర్భం. ప్రాకృతిక శోభతో పాటు సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని సమృద్ధంగా కలిగివున్న ఈ రాష్ట్రానికి, దేశ చరిత్రలో సదా కీలక స్థానం లభిస్తోంది.
కేరళమ్ ప్రజానీకం ఆ రాష్ట్రానికి ఉన్న అత్యంత గొప్ప శక్తి. వారి అంకితభావం, ప్రావీణ్య సాధన పట్ల వారికి ఉన్న నిబద్ధత భారత్‌కు వెలుపల కూడా ప్రశంసలను పొందాయి. ఆరోగ్యసంరక్షణ, విద్య, ఔత్సాహిక పారిశ్రామికత్వం, విజ్ఞ‌ానశాస్త్రం సహా విభిన్న రంగాలలో కేరళమ్ ప్రజలు సాధిస్తున్న విజయాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.
రాబోయే కాలంలో కేరళంలో ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, మరింత సౌభాగ్యం, నిరంతర ప్రగతి లభిస్తాయని నేను ఆశిస్తున్నాను.
കേരളത്തിലെ എന്റെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പപ്പിറവി ആശംസകൾ!
കേരളത്തിന്റെ സജീവമായ പാരമ്പര്യങ്ങളെയും അസാധാരണമായ ആത്മവീര്യത്തെയും ആഘോഷിക്കുന്ന വിശേഷ ദിനമാണിത്. സമൃദ്ധമായ പ്രകൃതിസൗന്ദര്യവും സമ്പന്നമായ സാംസ്കാരിക പൈതൃകവും അനുഗ്രഹിച്ച ഈ സംസ്ഥാനത്തിന്, എന്നും നമ്മുടെ രാജ്യത്തിന്റെ ചരിത്രത്തിൽ പ്രിയപ്പെട്ട ഒരു സ്ഥാനമുണ്ട്.
കേരളത്തിന്റെ ഏറ്റവും വലിയ കരുത്ത് അവിടുത്തെ ജനങ്ങളാണ്. അവരുടെ സമർപ്പണബോധവും മികവിനോടുള്ള പ്രതിബദ്ധതയും ഇന്ത്യയുടെ അതിരുകൾക്കപ്പുറത്തും ഏറെ പ്രശംസ പിടിച്ചുപറ്റിയിട്ടുണ്ട്. ആരോഗ്യം, വിദ്യാഭ്യാസം, സംരംഭകത്വം, ശാസ്ത്രം തുടങ്ങി നിരവധി മേഖലകളിൽ മലയാളി കൈവരിച്ച നേട്ടങ്ങൾ രാജ്യത്തിന് എന്നും അഭിമാനകരമാണ്.

വരും വർഷങ്ങൾ കേരളത്തിലെ ഓരോ വ്യക്തിക്കും പുതിയ അവസരങ്ങളും കൂടുതൽ ഐശ്വര്യവും തുടർച്ചയായ പുരോഗതിയും കൊണ്ടുവരട്ടെയെന്ന് ഞാൻ ആശംസിക്കുന്നു.’’

***