Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేర‌ళ రాష్ట్రం లో వ‌ర‌ద ప‌రిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేరళ లో వ‌ర‌ద ప‌రిస్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్ తో మాట్లాడారు.

“కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్ తో ఈ రోజు ఉద‌యం మ‌రో మారు మాట్లాడాను. మేము రాష్ట్రం లో వ‌ర‌ద ప‌రిస్థితి ని గురించి చ‌ర్చించాము. రాష్ట్ర వ్యాప్తంగా ర‌క్ష‌ణ మ‌రియు స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాలంటూ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కు సూచించాను. కేర‌ళ లో ప్ర‌జ‌ల భ‌ద్ర‌త, ఇంకా అభ్యున్న‌తికై ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

*****