Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొత్త సంవత్సరాది నేపథ్యంలో ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు


పవిత్ర నవ సంవత్సరం (కొత్త సంవత్సరాది) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఆద్యంతం యావత్‌ ప్రజానీకం సంపూర్ణ సౌభాగ్యంతో వర్ధిల్లాలని, జాతీయ ప్రగతిపై నవ్య నిబద్ధత ఏర్పరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపి, సేవాభావన ఇనుమడించేలా చూడాలని ప్రధానమంత్రి ఆ దైవాన్ని అర్థించారు. దేశ ప్రగతి దిశగా సమష్టి కృషికి ఈ విలువలు నవ్యోత్తేజం ఇవ్వగలవని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరులందరూ ఎనలేని ఆనందం, నిరంతర విజయం, సుదీర్ఘ  ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా పంపిన సందేశంలో:

“దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది మీ అందరి జీవితాలలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలని, సేవాభావనను మరింత బలోపేతం చేసి, దేశ ప్రగతి దిశగా సమష్టి కృషికి కొత్త ఉత్తేజం కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే…

— నరేంద్ర మోదీ, 19 మార్చి 2026

 

***