Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోయంబ‌త్తూరులోని పంక‌జ మిల్స్ రోడ్డు లో ఎయిర్ ఇండియా కు ఉన్న స్థ‌లం విక్ర‌యానికి మంత్రివ‌ర్గం ఆమోదం


కోయంబ‌త్తూరులోని పంక‌జ మిల్స్ రోడ్డు లో ఎయిర్ ఇండియాకు ఉన్న 0.99 ఎక‌రాల స్థ‌లాన్ని రూ.19.81 కోట్ల రూపాయ‌ల‌కు అమ్మే ప్రతిపాదనకు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రిర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

నేప‌థ్యం :

కోయంబ‌త్తూరు, పంక‌జ మిల్స్ రోడ్డులో త‌న‌కు ఉన్న సుమారు ఒక ఎక‌రం మేర స్థ‌లాన్ని రూ.19.81 కోట్ల‌కు నేష‌న‌ల్ బిల్డింగ్ క‌న్‌స్ర్ట‌క్ష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌బీసీసీ)కి విక్ర‌యించాల‌ని ఎయిర్ ఇండియా నిర్ణ‌యం తీసుకొంది. మెస్సర్స్ మెటల్ అండ్ స్క్రాప్‌ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎమ్ఎస్ టీసీ) ద్వారా ఇ- టెండర్ విధానంలో విక్రయ ప్రక్రియను చేపట్టారు.

అనేక సంవత్సరాలుగా ఎయిర్ ఇండియా నష్టాలలో ఉంది. దీంతో ఎయిర్ ఇండియా తన పన్నేతర రాబడిని పెంచుకొనే క్రమంలో తనకు ఉపయోగంలో లేని స్థిరాస్తులను విక్రయం లేదా లీజు లేదా సంయుక్త సంస్థ రూపాలలో నగదుగా మార్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అభ్యాసంలో భాగంగా స్థలాన్ని ఎన్‌బీసీసీకి విక్రయిస్తున్నారు.