Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్ కాతా లోని మెరుగులు దిద్దబడినటువంటి నాలుగు వారసత్వ భవనాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన సందర్భం గా ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


మహిళ లు మరియు సజ్జనులారా,

కోల్ కతా లో సంస్కృతి మరియు సాహిత్యాల సౌరభాల తో నిండిపోయినటువంటి ఈ యొక్క వాతావరణాన్ని చూసి హృద‌య‌ం తో పాటు మస్తిష్కం కూడా ఉల్లాసభరితం అవుతున్నది.  ఒక రకం గా, ఇది నన్ను నేను పునశ్శక్తి ని దక్కించుకొనేందుకు మరియు బెంగాల్ యొక్క సంస్కృతి ని, బెంగాల్ యొక్క శోభాయమానమైన కళ ను గుర్తించి మరి వందనమాచరించడానికి నాకు చిక్కిన ఒక అవకాశం గా ఉన్నది.  మిత్రులారా, ఇక్కడకు వచ్చి కొద్ది సేపటి క్రితం సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసిన తరువాత, నా యవ్వనపు రోజుల నాటి పాత జ్ఞాపకాలు అనేకం మళ్లీ గుర్తు కు వస్తున్నాయి.  జీవితాన్ని గురించిన పలు ప్రశ్నలు, జీవితం యొక్క రహస్యాలు మరియు అందులో ని జటిలత లు నాలో స్ఫురించాయి; ప్రతి నవ యువకుని మస్తిష్కం లో ఉన్న మాదిరిగానే, నాలో కూడాను అటువంటి ప్రశ్న లు తల ఎత్తుతుండేవి.  బోలెడన్ని విషయాలు తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరికంటూ ఒకటి ఉండింది.  అనేకమైనటువంటి ప్రశ్న లు ఎదురయ్యాయి, మరి అదే విధం గా చాలా సమాధానాలు కూడా వచ్చి నిలబడ్డాయి.  కొన్ని జవాబుల ను కనుగొనడం అయితే ఎంతో కష్టం గా అనిపించేది కూడా.  అందువల్ల, మనం ఆ ప్రశ్నల ను పరిష్కరించడం కోసం మరియు స్పష్టత ను సాధించడం కోసం సమాధానాల అన్వేషణ లో ఉండిపోయే వారం.  మరి ఆ వయస్సు లో, ఈ యొక్క కోల్ కాతా గడ్డ మీది పవిత్రమైన ప్రదేశం బేలూర్ మఠం నన్ను ఆకట్టుకొంటూ ఉండేది.

ఈ రోజు న, మీ యొక్క సమక్షం లో, నేను ఇవన్నిటి నీ గమనిస్తూవుంటే, నా మస్తిష్కం ఆ ఉద్వేగాలతో మరో మారు ముప్పిరిగొన్నది.  మరి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూవుండగా, నేను ఆ కాలపు మహనీయ చిత్రకారులు మరియు కళాకారులు జీవించినటువంటి క్షణాల ను నేను మరొక్క మారు అనుభూతి చెందుతున్నానా అని అనిపించింది.  బెంగాల్ నేల తాలూకు ఈ అద్భుతమైనటువంటి శక్తి కి మరియు బెంగాల్ యొక్క సమ్మోహనకరమైనటువంటి పరిమళాని కి ప్రణామం చేసేందుకు నాకు ప్రాప్తించిన అవకాశం ఇది.  దీని తో గతంలో మరియు వర్తమానం లో అనుబంధం కలిగివున్నటువంటి వారు అందరికి కూడాను నేను స్మృత్యంజలి ని ఘటిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు న ఒక అతి ముఖ్యమైనటువంటి దినం; పశ్చిమ బెంగాల్ తో సహా భారతదేశం లోని కళా, సాంస్కృతిక మరియు సాహిత్య రంగాల కు ఇది ఒక చాలా పెద్దదైనటువంటి రోజు.  భారతదేశం యొక్క కళల ను, సంస్కృతి ని మరియు వారసత్వాన్ని 21వ శతాబ్దాని కి అనుగుణం గా పరిరక్షించుకోవడం కోసం, అలాగే వాటి ని మరొక్క మారు కనుగొనడాని కి, సరిక్రొత్త బ్రాండ్ ను అందించడానికి, పునర్ నవీనీకరించడానికి, ఇంకా పునరాశ్రయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఒక దేశవ్యాప్త ప్రచార ఉద్యమం పశ్చిమ బెంగాల్ గడ్డ మీది నుండి ఈ రోజు న ఆరంభం అవుతున్నది.

మిత్రులారా,

సంప్రదాయం మరియు పర్యటన అనే రెండు విషయాలు మన గుర్తింపు, వారసత్వం మరియు మన భావావేశాల తో నేరు గా జతపడినటువంటివి అని చెప్పాలి.  భారతదేశం యొక్క సాంస్కృతిక శక్తి ని ప్రపంచం ముంగిట ఒక సరిక్రొత్త దృష్టికోణం లో నిలబెట్టాలనేదే కేంద్ర ప్రభుత్వ కృషి గా ఉన్నది.  తద్ద్వారా భారతదేశం ప్రపంచం లో వారసత్వ పర్యటన తాలూకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం గా రూపు ను సంతరించుకోగలుగుతుంది.  వారసత్వ పర్యటన పశ్చిమ బెంగాల్ తో సహా యావత్తు దేశం యొక్క పర్యటన సంబంధి పరిశ్రమ ను బలోపేతం చేయడం లో ఒక ముఖ్య భూమిక ను పోషించగలదు.  ఇది పశ్చిమ బెంగాల్ తో సహా యావత్తు దేశం లో ఎన్నో ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తుంది.  రబీంద్ర సేతు-హావ్ డా బ్రిడ్జ్ ను పర్యాటకుల కు మరింత గా ఆకర్షణీయం గా తీర్చిదిద్దడం కోసం ఒక ఇంటరాక్టివ్ లైట్ ఎండ్ సౌండ్ శో ను సైతం ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మొదలు పెట్టడం జరుగుతుంది.

మిత్రులారా,

దేశం యొక్క సాంస్కృతిక చిహ్నాల ను ఆధునికీకరించి వాటి ని పరిరక్షించుకోవాలి అన్నదే సదా దేశం అభిలాష గా ఉంటూ వచ్చింది.  ఈ భావన కు అనుగుణం గానే కేంద్ర ప్రభుత్వం దేశం లోని చారిత్రిక భవనాల కు మరమ్మతు లు చేసి మరి వాటి ని నవీకరిస్తోంది.  ఈ కార్యాన్ని కోల్ కాతా, ఢిల్లీ, ముంబయి, అహమదాబాద్ మరియు వారాణసీ ల యొక్క వారసత్వం తో మొదలుపెట్టడం జరుగుతోంది.  ఈ భవనాల లో నూతన చిత్ర ప్రదర్శన శాల లు, క్రొత్త ప్రదర్శన లు, రంగస్థలం, నాటకం, ఇంకా సంగీత కచేరిల కు గాను అవసరమయ్యేటటువంటి మౌలిక సదుపాయాల ను సిద్ధం చేయడం జరుగుతోంది.  అంతర్జాతీయ ప్రమాణాల ను అనుసరిస్తూ 5 వస్తు ప్రదర్శనశాలల ను దేశం లో  ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది.  ఈ కార్యాన్ని  ప్రపంచం లోని అతి పురాతనమైన వస్తు ప్రదర్శనశాలల్లో ఒకటైన ఇండియన్ మ్యూజియం కోల్ కాతా నుండే ఆరంభించడం జరుగుతోంది.  దీనికి అదనం గా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మరియు శ్రీ నగర్ లలో వస్తు ప్రదర్శనశాలల ను కూడా అభివృద్ధి పరచడం జరుగుతోంది.  మిత్రులారా, దేశం లోని ఈ వారసత్వ కట్టడాల ను సుందరీకరించడం మరియు వాటి ని పదిలం గా కాపాడడం అవసరమే కాకుండా, వాటి యొక్క నిర్వహణ కు, ఇంకా పరిపాలన కు కావలసినటువంటి వనరులను కూడాను తప్పక అభివృద్ధి పరచవలసివుంది.  దీని ని దృష్టి లో పెట్టుకొని, ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ కాన్ సర్ వేశన్’ను నిర్మించి మరి అలాగే ఆ సంస్థ కు ఒక డీమ్ డ్ యూనివర్సిటి యొక్క స్థాయి ని కట్టబెట్టాలనే అంశం పరిశీలన లో ఉంది.

మిత్రులారా,

భారతదేశం లో అత్యంత సంపన్న సాంస్కృతిక కేంద్రాల లో ఒకటి గా కోల్ కాతా ఉంది.  మీ అనుభూతుల కు అనుగుణం గా, కోల్ కాతా యొక్క ఈ ఉత్తమమైనటువంటి గుర్తింపు ను ఒక సరిక్రొత్త రూపం లో ప్రపంచం ఎదుట నిలిపే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.  కోల్ కాతా లోని 4 సరూప ప్రదర్శనశాల లు అయినటువంటి ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వెడేయర్ హౌస్, విక్టోరియా మెమోరియల్, ఇంకా మెట్ కాఫ్ హౌస్ ల ను నవీనీకరించే పనులు పూర్తి అయ్యాయి.  బెల్వెడేయర్ ను మ్యూజియం ఆఫ్ ద వరల్డ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచన అనేక పర్యాయాలు తెర మీదకు వచ్చింది.  ప్రస్తుతం ఆ ఆలోచన కు కార్యరూపాన్ని ఇచ్చే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.  భారత ప్రభుత్వ టంకశాల ను కూడా మ్యూజియం ఆఫ్ కాయినేజ్ & కామర్స్ గా అభివృద్ధి పరచాలన్న ఒక ఆలోచన కూడా ఉంది.

మిత్రులారా,

విక్టోరియా మెమోరియల్ తాలూకు 5 ప్రదర్శనశాలల్లో 2 ప్రదర్శనశాల లు చాలా కాలం నుండి మూతబడి ఉండడం మంచిది కాదు.  వాటి ని తెరచేందుకు కొంత కాలం గా ప్రయత్నాలు జరిగాయి.  స్వాతంత్ర్య ఉద్యమ కాలం లో బెంగాల్ కు చెందిన విప్లవకారులు అందించినటువంటి తోడ్పాటు కు మూడో ప్రదర్శన శాల లో ఒక స్థానాన్ని ఇవ్వండని కూడా మీకు నేను విన్నపాన్ని చేస్తున్నాను.

‘బిప్లబీ భారత్’ పేరిట వస్తు ప్రదర్శన శాల లు ఏర్పాటు కావాలి; మరి వాటి లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆరబిందో ఘోష్, రాస్ బిహారీ బోస్, ఖుదీ రాం బోస్, దేశ్ బంధు, బాఘా జతిన్, బినాయ్, బాదల్, దినేశ్.. ఇటువంటి మహా స్వాతంత్ర్య సమరయోధుల కు చోటు దక్కాలి.  మిత్రులారా, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాతి దశాబ్దాల లో ఏమి జరిగిందీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పట్ల ప్రజల మస్తిష్కాల లో నెలకొన్న అనుభూతు లు ఇవి మనమంతా ఎరుగుదుము.  దేశం యొక్క అదే అనుభూతి ని గౌరవిస్తూ, నేతాజీ పేరు తో ఎర్ర కోట లో ఒక వస్తు ప్రదర్శన శాల ను నిర్మించడమైంది; మరి అలాగే అండమాన్  & నికోబార్ దీవుల లో ఒక దీవి కి నేతాజీ పేరు ను పెట్టడమైంది.  ఆజాద్ హింద్ సర్ కారు కు 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో, ఎర్ర కోట మీద పతాకాన్ని ఆవిష్కరించే సౌభాగ్యం నాకు దక్కింది.  నేతాజీ కి సంబంధించినటువంటి ఫైళ్ల ను బహిరంగ పరచాలనే ఒక డిమాండు ఉండింది; అది ప్రస్తుతం నెరవేరింది.

మిత్రులారా,

నూతన సంవత్సరం లో, క్రొత్త దశాబ్ది లో, పశ్చిమ బెంగాల్ యొక్క ఇతర పుత్రుల తోడ్పాటు కు సైతం ఆదరణ లభించాలని ప్రస్తుతం దేశం భావిస్తోంది.  ప్రస్తుతం మనం అందరమూ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 200వ జయంతి ని జరుపుకొంటున్నాము.  ఇదే విధం గా, 2022వ సంవత్సరం లో మరొక ముఖ్యమైన కాకతాళీయ ఘటన చోటు చేసుకోబోతోంది.. అదేమిటంటే భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకొని 75 సంవత్సరాల ను జరుపుకొనే సందర్భం.  2022వ సంవత్సరం మహా సంఘ సంస్కర్త మరియ విద్యావేత్త రాజా రాం మోహన్ రాయ్ యొక్క 250వ జయంతి  కి కూడాను సాక్షీభూతం కానుంది.  దేశం లో నిబ్బరాన్ని రేకెత్తించడం కోసం, సమాజం లోని పుత్రికలు, సోదరీమణులు, యువజనుల హుందాతనం కోసం దోహదపడినటువంటి ఆయన యొక్క ఉత్తరదాయిత్వాన్ని ముందుకు తీసుకు పోవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.  ఆయన యొక్క 250వ జయంతి ని మనం ఒక ఉత్సవం వలె జరుపుకొందాము.  ఇది మన అందరి యొక్క కర్తవ్యం.

మిత్రులారా,

దేశ వారసత్వాన్ని పరిరక్షించడం, మన మహానుభావుల యొక్క మరియు మన చరిత్ర యొక్క ఈ విధమైన చిత్రణ దేశ నిర్మాణం లో ఒక ప్రధానమైనటువంటి భాగం గా ఉంటుంది.  బ్రిటిషు పాలన కాలం లోను, మరి స్వాతంత్ర్యం అనంతర కాలం లోను దేశ చరిత్ర ను లిఖించేటపుడు చరిత్ర తాలూకు కొన్ని ముఖ్య ఘట్టాల ను విస్మరించడం చాలా దురదృష్టకరం.  

మిత్రులారా,

పవిత్రమైనటువంటి బెంగాల్ భూమి ని గురించి 1903 వ సంవత్సరం లో గురుదేవులు టాగోర్ వ్రాసిన వ్యాసాల లో ఒక వ్యాసం లో వ్రాసిన దాని ని నేను ప్రస్తావించదలచాను.  ఆయన ఇలాగని వ్రాశారు- ‘‘మనం పరీక్షల కోసం చదువుకొంటున్నటువంటి మరియు జ్ఞాపకం పెట్టుకొంటున్నటువంటిది భారతదేశం యొక్క చరిత్ర కాదు.  దేశం బయటి నుండి వచ్చినటువంటి కొంత మంది; తనయుడి ని వధించిన తండ్రి, సోదరుడి ని హతమార్చిన సోదరుడు; సింహాసనం కోసం సంఘర్షణ మొదలైనవి భారతదేశం యొక్క చరిత్ర కాదు.  భారతదేశపు ప్రజానీకం, భారతదేశపు పౌరులు ఆ కాలం లో ఏం చేస్తూ వచ్చారు? ఈ వివరణ ఏదీ ఈ యొక్క చరిత్ర లో లేదు.  వారు అసలు అప్పుడు లేనే లేరా?’’ 

మిత్రులారా,

గురుదేవులు తన వ్యాసం లో హఠాత్తు హింసాయుతమైన మార్పు ను గురించి మరియు గందరగోళాన్ని గురించిన ఒక అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ను కూడా పొందుపరచారు.  ఆయన వ్రాశారు కదా.. ‘‘ఎన్ని హఠాత్తు హింసాయుతమైన మార్పు లు అయినా రానీ గాక, అప్పట్లో సంక్షోభం చెలరేగిన కాలం లో అక్కడి ప్రజలు వాటి ని ఎలా ఎదుర్కొన్నారన్నది చాలా ప్రధానమైనటువంటిది’’ అని.

మిత్రులారా,

చరిత్రకారులు గందరగోళాన్ని ఇంటి వెలుపలి నుండి చూశారు అని గురుదేవులు పేర్కొన్నారు.  చరిత్ర పరిశీలకులు గందరగోళాల తో తలపడిన వారి గృహాల కు వెళ్లలేదు.  ఇక, బయటి నుండి చూసే వ్యక్తి గందరగోళాన్ని మాత్రమే దర్శించగలుగుతాడు!  దాని కి ఎదురొడ్డి నిలబడి సంఘం, సామాన్య మానవుడు ఏ విధం గా పోరాడిందీ చరిత్రకారులు చూడలేకపోయారు.  అటువంటి పరిస్థితి లో, భారతదేశం యొక్క చరిత్ర తాలూకు పలు ముఖ్య వాస్తవాలు మరుగునపడి పోయాయి.

మిత్రులారా,

మనం గనక మన దేశం యొక్క చరిత్ర కేసి మరియు వారసత్వానికేసి దృష్టి ని సారించామా అంటే, అటువంటప్పుడు కొందరు దానిని అధికారం కోసం ఉద్దేశించిన సంఘర్షణ కు, హింస కు మరియు ఉత్తరాధికారాని కి పరిమితం చేసివేశారు.  అయినప్పటికినీ దీనంతటి నడుమ, ఏ విధం గా గురుదేవులు కూడాను అన్నారో, చరిత్ర తాలూకు మరొక దృష్టికోణం చాలా ప్రధానమైనటువంటిదిగా ఉంది.  దాని ని గురించి కూడాను ఈ రోజు న మీతో నేను చర్చించదలచుకొన్నాను.

మిత్రులారా,

అస్థిరత్వం యొక్క ఆ కాలం లో, హింసాయుత వాతావరణం లో, దేశ ప్రజల అంతరాత్మ ను మేల్కొలపడం కోసమని దాని కి ఎదురొడ్డి నిలవడం దాని ని ఎదుర్కోవడం; మరి ఆ పోరు ను తదుపరి తరాల వారి వరకు తీసుకు పోవడం ముఖ్యం గా ఉండింది.  దశాబ్ది తరువాతి దశాబ్దం, తరం తరువాతి మరో తరం, శతాబ్దం గడచిపోయిన తరువాత మరో శతాబ్దం పాటు ఈ పని ని చేసింది ఎవరు?  ఈ కార్యాన్ని మన కళ లు, మన సాహిత్యం, మన సంగీతం, మన పండితులు, మన సాధువులు మరియు మన తత్త్వవేత్త లు వారి భుజాన వేసుకొన్నారు.  మరి ఈ కారణం గా, భారతదేశం లోని మూల మూల న కళ యొక్క మరియు సంగీతం యొక్క వేరు వేరు రకాల కు సంబంధించినటువంటి ప్రత్యేక సంప్రదాయాల ను మీరు చూడగలుగుతున్నారు.  భారతదేశం లోని ప్రతి ఒక్క ప్రాంతం లో మీరు మేధావులు మరియు సంన్న్యాసుల ప్రభావాన్ని గమనించవచ్చును. ఈ వ్యక్తులు, వారి ఆలోచన లు, వివిధ రూపాల్లోని కళా సాహిత్యాలు వాటివైన రీతుల లో చరిత్ర ను సంపన్నం చేసివేశాయి.  మరి అటువంటి మహనీయులు భారతదేశ చరిత్ర లో అతి పెద్దవైన సంఘ సంస్కరణల కు నేతృత్వం వహించారు అన్న సంగతి ని మీకందరి కి ఎంతో బాగా ఎరుకే.  భారతదేశం ఆది శంకరాచార్యుల వారు, తిరునావుక్కరసర్ ల వంటి కవి వరేణ్యులు, సాధువుల ఆశీస్సుల ను అందుకొన్నది.  ఆండాళ్, అక్క మహాదేవి, భగవాన్ బసవేశ్వర, గురు నానక్ దేవ్ జీ లు చూపిన మార్గం ఈనాటి కి కూడా మనకు ప్రేరణ ను అందిస్తున్నది.  భారతదేశం లోని వేరు వేరు ప్రాంతాల లో భక్తి ఉద్యమం ఆరంభం అయిన కాలం లో, దాని ని సుసంపన్నం చేసింది ఎంతో మంది సాధువులు మరియు సంస్కర్త ల యొక్క గీతాలు, ఇంకా ఆలోచన లే.  సంత్ కబీర్, తులసీదాస్ జీ, ఏక్ నాథ్ జీ, నామ్ దేవ్ జీ, సంత్ తుకారామ్ జీ లు సమాజాన్ని తట్టి మేల్కొలపసాగారు.  ఆ కాలం లో అటువంటి గొప్ప మనుషులు అంటూ లేనటువంటి ప్రాంతం ఏదీ కూడా భారతదేశం లో లేదు.  సంఘం లో మార్పు ను తీసుకు రావడం కోసం రాజా రాం మోహన్ రాయ్ జీ, ఇంకా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జీ లు చేసిన యత్నాలు నేటి కి కూడా అంతే సమానమైనటువంటి స్ఫూర్తి ని ప్రసాదించేవి గా ఉన్నాయి.  అదే విధం గా, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, గాంధీజీ, బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ మరెందరో ఆ కోవ కు చెందిన ఘనులు భారతదేశ చరిత్ర ను సుసంపన్నం చేసిన తీరు ను మనం గమనించాము.

సామాజిక సంస్కరణ, సంఘం లోని దురాచారాలపై ఎలుగెత్తడం, మహిళ ల సాధికారిత తాలూకు కార్యాలు ఆ కాలం లో దేశ ప్రజల అంత:కరణ ను జాగృతం గా ఉంచేందుకు చేసినటువంటిప్రయత్నాలు గా చెప్పుకోవాలి.  మరి నేను చెప్పిన వ్యక్తుల పేరులు, చాలా మంది యొక్క పేరుల ను నేను ప్రస్తావించలేకపోయినప్పటికీ కూడాను, వారు అందరూ వారి వారి సందేశాల ను వ్యాప్తి లోకి తీసుకు వచ్చేటందుకు గాను సాహిత్యాన్ని, కళల ను మరియు సంగీతాన్ని మాధ్యమం గా చేసుకొన్నారు. ఇదీ కళ కు, సంగీతాని కి, సాహిత్యాని కి ఉన్నటువంటి శక్తి.  వారు ఆయుధాల యొక్క శక్తి తో కాక అంగబలం తో ఒక పరివర్తన ను తీసుకు రావడం ద్వారా చరిత్ర ను లిఖించారు.  వారు ఆయుధం తో పోల్చి చూసినప్పుడు రచన కు గల శక్తి ని చాటిచెప్పారు.

మిత్రులారా,

ఏ దేశం యొక్క ఆత్మ అయినా అక్కడి ప్రజల యొక్క అనుభూతుల కు ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది.  పాట, సంగీతం, కళ మరియు సాహిత్యం ల ద్వారా చెప్పేది ఏమి అయినప్పటికీ, అది ఆ ప్రజల ప్రవృత్తే!  రాజకీయ అధికారం మరియు సైనిక అధికారం తాత్కాలికం, కానీ ప్రజల యొక్క మనోరాగం కళ ద్వారాను, సంస్కృతి ద్వారాను వ్యక్తం అవుతాయి.  మరి అందువల్ల, మన సంపన్న చరిత్ర ను, మన వారసత్వాన్ని పరిరక్షించుకొంటూ ఉండడం, వాటి ని ప్రోత్సహించుకోవడం భారతదేశాని కి, భారతదేశం లో ప్రతి ఒక్కరి కి చాలా ముఖ్యం అయిన విషయాలు.  ఇది మనను ప్రపంచం లోని ఇతర దేశాల నుండి విభిన్నం గా ఉంచేటటువంటి సంపద.

మిత్రులారా,

సంస్కృతి ని పరిరక్షించుకోవడాన్ని గురించి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అన్నారు కదా- “పాశ్చాత్య జ్ఞానం తాలూకు తలుపులు తెరచి ఉంచబడినందువల్ల మనకు వచ్చే చిక్కు ఏమీ లేదు.  సమస్యల్లా ఈ జ్ఞానాన్ని మన మీద రుద్దడం తోనూ మరియు భారతీయ సంస్కృతి తో రాజీ పడిపోవడం తోనే.  భారతీయ సంస్కృతి ని నిర్లక్ష్యం చేయకండాను, దాని ని అంతం చేయకుండాను ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యాన్ని సాధించవలసిన ఆవశ్యకత ఉంది’’ అని.  డాక్టర్ ముఖర్జీ యొక్క ఈ ఆలోచన ఆ కాలం లో ముఖ్యమైందిగా ఉండడమే కాక ఈ కాలాని కి సైతం ఉపయుక్తం గా ఉంది.  మనం ప్రపంచం లోని ప్రతి ఒక్క సంస్కృతి నుండి ఏదో ఒక మంచి ని నేర్చుకోవచ్చును, అయితే అది మన భారతీయ సంస్కృతి యొక్క విలువల ను మూల్యం గా పెట్టి జరుగకూడదనే విషయం పట్ల మనం శ్రద్ధ వహించాలి.

మిత్రులారా,

బెంగాల్ గడ్డ మీద జన్మించిన మరియు పెరిగిన పుత్రులు, రుషులు భారతదేశం యొక్క సంపన్నమైనటువంటి సాంస్కృతిక వారసత్వపు ప్రాముఖ్యాన్ని సదా గ్రహించి, దానికి ఒక మేధోపరమైన నాయకత్వాన్ని ఇచ్చారు.  నింగి లో వెలుగులు చిమ్మేది ఒకే ఒక జాబిల్లే అయినప్పటికీ, పశ్చిమ బెంగాల్ భారతదేశపు ప్రకాశాన్ని ప్రపంచాని కి చూపించడం కోసమని ఎన్నో చందమామల ను ప్రసాదించింది.  నేతాజీ సుభాష్ చంద్ర,  శరత్ చంద్ర, బంకిమ్ చంద్ర, ఈశ్వర్ చంద్ర, జగదీశ్ చంద్ర, కేశవ్ చంద్ర, బిపిన్ చంద్ర.. ఇలాగ మరెందరో చంద్రులు భారతదేశం యొక్క గుర్తింపు నకు మిలమిలల ను సంతరించారు.

చైతన్య మహాప్రభు మొదలుకొని రాజా రాం మోహన్ రాయ్, స్వామి వివేకానందుల వారు మరియు గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్ గారు.. వీరంతా యావత్తు భారతదేశాన్నే కాకుండా యావత్తు జగత్తు ను జాగృతం చేయడం కోసం శ్రమించారు.  ఈ మహానుభావులు అందరూ భారతదేశం అంటే వాస్తవం లో ఏమిటో మరి భారతదేశం యొక్క సిసలైన బలం ఏదో మొత్తం ప్రపంచాని కి చాటారు.  వారు  మన సంస్కృతి మరియు మన గత కాలపు జ్ఞానం.. ఇవే మన యథార్థమైనటువంటి మూలధనం అని భారతదేశ ప్రజలు గ్రహించుకొనేటందుకు కూడా కారకులు అయ్యారు.  నజ్ రూల్ ఇస్లామ్ యొక్క కవితలు మరియు సత్యజిత్ రే తీసిన చలనచిత్రాలు కూడా ఈ భావజాలాన్నే వ్యాప్తి చేశాయి.

మిత్రులారా,

బెంగాల్ భూమి వహించినటువంటి బాధ్యత, అది సజీవం గా ఉంచినటువంటి సంప్రదాయం- అదే, భారతదేశం యొక్క ప్రాచీనమైన గుర్తింపు ను, భారతదేశం యొక్క జ్ఞానాన్ని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయడం- వీటి కి న్యూ ఇండియా లో పూచీ పడవలసింది మీరు.  భారతదేశానికి మరియు మొత్తం ప్రపంచాని కి ప్రాతినిధ్యం వహించగల నూతనమైనటువంటి, సమర్ధమైనటువంటి నాయకత్వాన్ని అందజేయడానికి ఇదే సరి అయిన కాలం గా ఉన్నది.  స్వామి వివేకానందుల వారి యూనివర్సిటి ఆఫ్ మిశిగన్ లో కొందరు వ్యక్తుల తో సంభాషించిన సందర్భం లో ఆడిన మాటల ను మనం అందరమూ జ్ఞప్తి కి తెచ్చుకోవలసివుంది.

స్వామి వివేకానందుల వారు అన్నారు కదా – ‘‘ప్రస్తుత శతాబ్దం మీది కావచ్చు, కానీ 21వ శతాబ్దం భారతదేశాని ది అవుతుంది’’ అని.  స్వామి వివేకానందుల వారి సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే, మనమంతా, దేశం లోని ప్రతి ఒక్కరు  పూర్తి శక్తి తో నిరంతరం గా శ్రమించాలి.  మరి ఈ యొక్క ప్రచార ఉద్యమం లో, ఎప్పుడయితే మీ స్నేహితులు అందరి యొక్క- ఎవరయితే పశ్చిమ బెంగాల్ యొక్క బుద్ధిజీవి వర్గమో- వారి శక్తి, వారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయో, అదుగో అప్పుడు సంకల్పాల ను నెరవేర్చే వేగం మరింత గా జోరు ను అందుకొంటుంది.  మీరు వేసేటటువంటి మీ యొక్క ప్రతి ఒక్క అడుగు లోను, మీ యొక్క ప్రతి ప్రయత్నం లోను కేంద్ర ప్రభుత్వం మరియు స్వయం గా నేను సైతం మీ తో భుజం భుజం కలిపి నిలబడేటందుకు చొరవ ను తీసుకొంటాము; మరి మీ నుండి నేర్చుకోవాలని కూడాను ఎదురుచూస్తాము.   ఈ రోజు న ఈ యొక్క ముఖ్యమైనటువంటి సందర్భం లో మీ సమక్షాని కి తరలి వచ్చి, మీ తో మాట్లాడేటందుకు ఒక అవకాశాన్ని నాకు అందించినందుకు గాను మీకు నేను నా యొక్క హృద‌య‌పూర్వకమైన కృత‌జ్ఞత‌ల ను వ్యక్తం చేస్తున్నాను.  కోల్ కాతా కు వస్తే, ఈ నాలుగు సరూప ప్రదేశాల ను సందర్శించవలసింది గా దేశ ప్రజల కు కూడాను  నేను విజ్ఞప్తి ని చేస్తున్నాను.  మన మహనీయుల ఆలోచనల ను, వారి యొక్క కళల ను, వారి యొక్క భావనల ను మరియు ఆ కాలపు జన మానసాల అభివ్యక్తీకరణల ను మీరు చూసి, వాటి ని గురించి అవగాహన ను ఏర్పరచుకొని, మీ మనోభావాల ను కూడా రంగరించి మరీ ఈ జగతి ఎదుట వ్యక్త పరచాలి సుమా.  అనేకానేక ధన్యవాదాలు.

**