Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)

కౌలాలంపూర్ పర్యటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు, ముఖ్యాంశాలు (22 నవంబర్ 2015)


కౌలాలంపూర్ లో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ, భారత సంతతికి చెందినవారినుద్దేశించి ప్రసంగం

1. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని: సర్వత్రా వ్యాపించిన ఉగ్రవాద భూతం నీడలు
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం

కౌలాలంపూర్ లో ఏర్పాటైన తూర్పుఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ప్రపంచానికి ఉగ్రవాదం విసరుతున్న సవాళ్లపైన ఉపన్యసించారు.

పారిస్ లో ఉగ్రవాదులు చేసిన అనాగరిక దాడులు, అంకారా, బీరుట్, మాలిలతోపాటు రష్యా విమానం కూల్చివేతదాకా ఉగ్రవాదులు ఎంతకైనా తెగబడ్డ సంఘటనలు అనేక సవాళ్లను మన ముందుంచుతున్నాయి. అమాయకులను ఉగ్రవాదులుగా మార్చడం, విధ్వంస లక్ష్యాలు మొదలైనవాటిని చూసినప్పుడు ఉగ్రవాద భూత భయంకర నీడలు మన సమాజాలతోపాటు మొత్తం ప్రపంచమంతా విస్తరించాయనే కఠిన సత్యం గుర్తుకొస్తోంది. రాజకీయాలతో పని లేకుండా ప్రపంచవ్యాప్తంగా మనందరం ఒక తీర్మానం చేసుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి నూతన వ్యూహాలు రచించుకోవాలి. ఏ దేశం ఉగ్రవాదాన్ని పోషించకూడదు. దానికి మద్దతు ఇవ్వకూడదు. ఉగ్రవాద ముఠాల మధ్యన ఎలాంటి తేడా లేదు. వారు తలదాచుకోవడానికి ఏ దేశం ఒప్పుకోకూడదు. నిధులందించకూడదు. ఆయుధాలందేలా చూడకూడదు. అంతే కాదు మనం మన సమాజాల్లో దీనిపైన కొన్ని చర్యలు చేపట్టాలి. మన యువతతో మాట్లాడి వారికి అవగాహన కల్పించాలి. మతాన్ని ఉగ్రవాదాన్ని విడదీసి చూసే మంచి ప్రయత్నాన్ని,దానికి కావలసిన నిబద్దతను నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతి విశ్వాసానికి మూలమైన మానవీయ విలువల్ని ప్రోత్సహించడం ప్రశంసనీయం.

అన్ క్లాజ్ (యు ఎన్ సి ఎల్ ఓ ఎస్) వ్యవస్థను ఉపయోగించుకొని ఇండియా, బంగ్లాదేశ్ ఈ మధ్యనే తమ సముద్ర జలాల సరిహద్దులను నిర్ణయించుకున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో తలెత్తిన సమస్యలను సంబంధిత దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఈ దేశాలు దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై వెలువడిన ప్రకటనకు కట్టుబడి ఉండాలి. ఈ ప్రకటను అమలు కావడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను అందరూ అనుసరించాలి. దీనికి సంబంధించిన దేశాలన్నీ ఏకాభిప్రాయం ఆధారంగా ఒక ప్రవర్తనా నియమావళిని ఎంత వీలైతే అంత తొందరగా రూపొందించడానికి వీలుగా తమ కృషిని మరింత పటిష్టం చేయాలి.

2. స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

రామకృష్ణ మిషన్ కార్యాలయంలో నెలొకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచానికి అందించిన స్ఫూర్తిని చాటారు. వివేకానందుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, వేల సంవత్సరాల పురాతన భారతీయ సంస్కృతికి ఆత్మలాంటివాడని కొనియాడారు. ఉపనిషత్ లనుంచి ఉపగ్రహాలదాకా విస్తరించిన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకున్నవారికి వివేకానందుని స్ఫూర్తి అర్థమైనట్టేనని మోదీ అన్నారు. భౌతిక విషయాలు, ఆధ్మాత్మిక విషయాలుగా ప్రపంచం విడిపోయిన సమయంలో స్వామి వివేకానందుడు భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాల ముందుకు తీసుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. గత రెండు రోజులుగా తాను పాల్గొంటున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో పదే పదే ఆసియా ఏకత్వమనే నినాదం వినిపించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఆలోచనను మొదటగా వినిపించింది స్వామి వివేకానందేననే విషయాన్ని ప్రధాని సభికులకు గుర్తు చేశారు.

3. మలేషియా భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం..

మలేషియాలో నివిసిస్తున్న భారతీయులనుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశమంటే సరిహద్దుల మధ్యనున్న ప్రాంతమే కాదు. ప్రపంచవ్యాప్తంగా నివిసిస్తున్న ప్రతి భారతీయునిలో భారతదేశం ఉందని ఆయన అన్నారు.

స్వతంత్ర భారతదేశం మలేషియా భారతీయులకు ఎంతగానో రుణపడి ఉంది. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మలేషియా భారతీయుల త్యాగాలు కూడా చిరస్మరణీయంగా లిఖించి వున్నాయి. మలేషియా భారతీయుల తాతలు, తండ్రులు వేలాదిమంది నేతాజి సుభాష్ చంద్రబోస్ తోపాటు కదం కదం కలిపారు. ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి పోరాటాలు చేశారు. మహిళలు ఎంతో మంది భుజం భుజం కలిపి నేతాజి సుభాష్ చంద్రబోస్ తో కలిసి స్వాతంత్ర్యం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు అంటూ ప్రధాని మలేషియా భారతీయుల చరిత్రను స్మరించుకున్నారు.

మలేషియా భారతీయుల స్మృతికి ఘన నివాళి ఘటిస్తున్నానన్నారు. వారు తమ జీవితాలను తృణప్రాయంగా భావించడంతోనే భారతదేశం దాస్య శృంఖలాలనుంచి బైటపడిందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.

70 సంవత్సరాల క్రితం అత్యంత భయానకమైన ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ సంగ్రామంలో లెక్కలేనంతమంది భారతీయ సైనికులు మలేషియా గడ్డపైన ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మశాంతికి ఇదే నా నివాళి. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారిలో సిక్కుల సంఖ్య ఎక్కువ. వారి రుధిరం శాశ్వతంగా మలేషియా గడ్డపైన నిక్షిప్తమైంది. ఈ యుద్ధం ఇరు దేశాలపైన గణనీయమైన ప్రభావం చూపింది. ఆ నాడు వారు మలేషియా గడ్డపైన చిందించిన రక్తం రెండు దేశాల మధ్యన బంధానికి పునాది వేసింది. ఆ బంధం చరిత్రలో చిరస్మరణీయంగా ఉంటుంది అంటూ ప్రధాని భావోద్వేగంతో ప్రసంగించారు.

ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదం పెనుసవాల్ గా నిలిచింది. దీనికి సరిహద్దులు లేవు. ఇప్పుడీ భూతం తన లక్ష్యాలను అందుకోవడానికి మతాన్ని ఉపయోగించుకుంటోంది. ఇది దుర్మార్గమైన చర్య. ఈ భూతం అన్ని మతాలవారిని చంపేస్తోంది. మతాన్ని, ఉగ్రవాదాన్నుంచి విడదీయాలి. మానవత్వం ఉన్నవారు, లేనివారనే రెండు వర్గాలే మన ముందున్నాయి. ఈ విషయాన్ని నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఉగ్రవాదం. దీన్ని మనందరం కలిసికట్టుగా నిలిచి ఎదుర్కోవాలి అంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

మలేషియాలో 1954లో ఇండియా స్టూడెంట్స్ ట్రస్ట్ ఫండ్ ను నెలకొల్పారు. మలేషియాలో నివసిస్తున్న పేద భారతీయ కుటుంబాల విద్యార్థులు చదువుకోవడానికి సాయం చేయాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఇప్పటికీ మలేషియాలోని కొంతమంది భారతీయ కుటుంబాలకు ఈ ఫండ్ అవసరముంది. ఈ ఫండ్ నిర్వహణ సజావుగా సాగడానికిగాను భారతదేశం ఒక మిలియన్ అమెరికా డాలర్లను గ్రాంటుగా ఇస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వేలాది మంది మీ పిల్లలు భారతదేశానికి వెళ్లి డాక్టర్లు అవుతున్నారు. డాక్టర్ల అవసరం చాలా ఉన్నదనే విషయాన్ని నేను మరిచిపోవడం లేదు. అలాగే విద్యారంగంలోని ఇతర విభాగాల్లో కూడా మీ పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నాను. తాము అందజేసిన డిగ్రీలను మలేషియా, ఇండియాలు రెండూ వెంటనే గుర్తించాలి. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా ప్రధాని శ్రీ నజీబ్ దృష్టికి తీసుకుపోతున్నాను అంటూ ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.