Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల రంగంలో భార‌త్‌, మాల్దీవుల మ‌ధ్య అవ‌గాహ‌న‌పూర్వ‌క ఒప్పందం


క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల రంగంలో భార‌త‌దేశం, మాల్దీవుల‌కు మ‌ధ్య 2015 అక్టోబ‌రులో ఒక అవ‌గాహ‌న‌పూర్వ‌క ఒప్పందం (ఎంఓయూ)పై సంత‌కాలు జ‌ర‌గ‌గా, ఆ ఎంఓయూకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోద‌ముద్ర వేసింది. ఇక‌మీద‌ట‌ ఇరు దేశాల మ‌ధ్య చోటు చేసుకొనే మార్పిడి కార్య‌క్ర‌మాలు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ ల వంటి రంగాల‌లో ప్రావీణ్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందింప‌చేసుకోవ‌డానికి తోడ్ప‌డుతాయి. ఇంకా.. శిక్ష‌ణలో మెల‌కువ‌లు, యువ‌జ‌నోత్స‌వాలు, శిబిరాల‌లో ప్రాతినిధ్యం వంటివి అంత‌ర్జాతీయ ఆట‌ల పోటీల‌లో భార‌తీయ క్రీడాకారుల ప్ర‌తిభా ప్ర‌ద‌ర్శ‌న‌కు మెరుగులు దిద్దేందుకు కూడా దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌వు. అలాగే, ఇటువంటి కార్య‌క్ర‌మాలు ఉభ‌య దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేస్తాయ‌ని భావిస్తున్నారు.