పిఎంఇండియా



క్రెడాయి తో ముడిపడ్డ యువ మిత్రులు మరియు సీనియర్ ప్రముఖులు.. మీకు అందరికీ అనేకానేక అభినందన లు.
మనం ఒక ‘న్యూ ఇండియా’ దిశ గా పయనిస్తున్న కాలం లో ఈ యూథ్ కాన్ సమావేశం చోటు చేసుకొంటోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే మీ తో భేటీ కావడం కోసం ఇక్కడ కు నేను విచ్చేశాను. ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు నూతనమైన స్వప్నాల ను జోడించడం లో మిత్రులారా, మీరందరూ ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తున్నారు. సామాన్య ప్రజల కోసం ఒక ఇంటి ని నిర్మించేటటువంటి కల ను తీర్చడం లో మీరు నిమగ్నం అయ్యారు.
క్రెడాయి భారతదేశ పౌరుల కోసం గృహాల ను నిర్మించే సేవల ను గత రెండు దశాబ్దాలు గా అందిస్తూ వస్తోంది. మీరు 23 రాష్ట్రాల లో 205 నగరాల కు విస్తరించి ఉన్నారని, మరి మీ సంస్థ లో 12,000 మంది కి పైగా సభ్యులు ఉన్నారని నా దృష్టి కి వచ్చింది. భారతదేశం లో స్థిరాస్తి రంగం లో గొప్ప వృద్ధి చోటు చేసుకొంది. దాని తో పాటు మీ సంస్థ సైతం వర్ధిల్లింది. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సుల తో మీ సంస్థ ను ప్రారంభించుకొని మరి ఈ స్థాయి కి చేరుకోవడం నాకు అమిత సంతోషాన్నిస్తోంది.
పట్టణ ప్రాంతాల లో పేద కుటుంబాల మరియు మధ్య తరగతి కుటుంబాల యొక్క సొంతింటి కలల ను నెరవేర్చేందుకు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నిటి కన్నా ముందు ఒక ప్రయత్నాన్ని చేపట్టారు. అటల్ గారు ఈ పట్టణాల లోను, పల్లెల లోను నివసించేవారి కి ఇంటి ని అందించేందుకుగాను 2001వ సంవత్సరం లో లఖ్ నవూ లో “వాల్మీకి- ఆంబేడ్ కర్ ఆవాస్ యోజన”ను ఆరంభించారు. ఆయన నేతృత్వం లోని ప్రభుత్వం పట్టణ ప్రాంతాల అభివృద్ధి ని మరియు గృహ నిర్మాణాన్ని ప్రైవేటు రంగాని కి ఇచ్చేందుకు తలుపుల ను తెరచింది. ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుందని నేను తలుస్తాను.
ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం అటల్ గారి ప్రయత్నాల ను మరింత విస్తరిస్తోంది. అది దేశం లోని మధ్య తరగతి కావచ్చు, లేదా పేద ప్రజానీకం కావచ్చు- మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావడాన్ని వేడుక గా జరుపుకొనే సరికి, అంటే 2022వ సంవత్సరం కల్లా- గృహ వసతి లేనటువంటి ప్రతి ఒక్కరు వారికంటూ ఒక సొంత ఇల్లు ను కలిగివుంటారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా ప్రస్తుతం దేశం లో నగరాల లో మరియు గ్రామాల లో సుమారు 1,50,00,000 ఇళ్ళ ను నిర్మించడమైంది. వాటి లో దాదాపు గా 15 లక్షల ఇళ్ళు పట్టణ ప్రాంతాల పేదల కోసం కట్టినవి.
గృహ నిర్మాణాల ను గురించిన ఈ సంఖ్య ను నేను ప్రస్తావించినప్పుడల్లా, మా రాజకీయ ప్రత్యర్థి మరియు ప్రసార మాధ్యమాలు ఇటువంటి పథకం లో కొత్తదనం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నాయి. పథకాలు ఇదివరకు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ ప్రణాళిక లు కచ్చితం గా ఇంతకు ముందు కూడా అమలయ్యాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన విషయాని కి వస్తే, మరి ఈ ఇదివరకటి గృహ నిర్మాణ పథకాల కు, దీని కి ఉన్న ఒకటో తేడా ఏమిటంటే ఉద్దేశ్యం పరంగా ఉంది ఆ తేడా.
ఈ పథకం ఎవరి పేరు కైనా చిర స్థాయి ని కలిగించడానికో లేదా వారి పేర్ల తో ఏవైనా నాణేల ను ముద్రించడానికో జరిగిన ప్రయత్నం కాదు. ప్రధాన మంత్రి పదవి ని స్వీకరించిన ఏ వ్యక్తి అయినా ఈ పథకాల ను అమలుపరుస్తూవుంటారు. నేను చెప్పడానికి ఏమైనా ఇందులో ఉందా ? ఈ పథకం ఏ వ్యక్తి ని గురించో ప్రచారాన్ని నిర్వహించడానికి ఉద్దేశించినటువంటిది కాదు. ఈ పథకం లో స్వీయ ప్రయోజనాన్నో లేదా పేరు నో తొలగించిన పక్షం లో అటువంటప్పుడు మీ యొక్క విధానం స్పష్టం అయిపోతుంది. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా అవినీతి భావన, స్వ- పర భావన, మీది లేక నాది అనే భావన లు తొలగించబడుతాయి.
ప్రస్తుతం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఒక శాస్త్రీయమైన పద్ధతి లో లబ్ధిదారుల ను ఎంపిక చేయడం జరుగుతోంది. ఒకప్పుడు కొద్ది మంది ద్వారా పేర్ల ను తొలగించడమో లేదా జాబితా కు ఒక పేరు ను జోడించడమో జరిగేది. ఈ తతంగం లో పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉండే వారు. నిజాని కి భవన నిర్మాతల కన్నా ఎక్కువగా డీలర్లే సంపాదించుకొనే వారు. మరి ప్రస్తుతం ఈ వ్యాపారం మూసివేయబడింది. మీలో కొంత మంది కి నష్టం కూడా వచ్చి ఉంటే వుండవచ్చును; కానీ, ఇప్పుడు మీరు ప్రధాన మంత్రి గా ఎటువంటి వ్యక్తి ని ఎంపిక చేశారంటే మరి ఏమి చేయాలి?
మిత్రులారా, మూడో తేడా నాణ్యత కు సంబంధించింది. ఇదివరకు నిర్మితమైన గృహాల లక్ష్యం పేదల కు సౌకర్యాన్ని కలిగించాలి అనేది కాదు. వాటి ని కేవలం కొన్ని పేర్ల ను ప్రచారం లోకి తీసుకు రావడం కోసం నిర్మించడమైంది. అంటే, వారు ఇళ్ళ ను పేరు కోసమే కట్టారు అన్న మాట. ఈ మధ్య నేను ఒక టివి కథనాన్ని చూస్తూ వున్నాను- మరి ఆ కార్యక్రమాన్ని మీరు వీక్షించారో లేదో నాకయితే తెలియదు; ఉత్తర్ ప్రదేశ్ లో అమేఠీ అని ఒక ప్రాంతం ఉంది. దాని ని గురించి మీరు ఎందుకు దృష్టి లో పెట్టుకోవాలి? నేను అనుకోవడం ఏమిటంటే నాకంటే మీకే బాగా తెలుసు ను అని.
అక్కడి ప్రజలు కొంత మంది కి లేదా చిర పరచితమైన కుటుంబం లో కొందరి కి అధిక ప్రేమ ను పంచి ఇచ్చారు. వారి ని ప్రజలు ఎన్నడూ ప్రశ్నలు అడిగిందే లేదు. అమేఠీ నుండి వెలువడిన ఒక కథనం ఒక దళిత జనుల మురికివాడ ను గురించి ప్రస్తావిస్తోంది. అక్కడ పది సంవత్సరాల కిందట ప్రజల కు ప్రభుత్వం ఇళ్ళ ను ఇచ్చింది. ఆ ప్రభుత్వమే తన పేరు ను ప్రతి చోటా ప్రకటించుకొంది. అయితే, ఈ రోజు న పరిస్థితి ఎలా ఉంది అంటే వారి పేర్ల ను చాటి చెప్పిన గోడలు పది సంవత్సరాల లోపే కూలిపోయాయి.
ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా అవే జనావాసాల లో గృహాలు నిర్మాణ దశ లో ఉన్నాయి. ఈ గృహాలు మరింత పెద్దవి; వీటి లో భాగం గా స్నానాల గది, వంట గది, వంట గ్యాస్ కనెక్షన్ లతో పాటు విద్యుత్తు కనెక్షన్ కూడా ఉంది. ఈ ఇంటి కి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడాను అందుతూవున్నాయి. ఇప్పుడు వేరు వేరు పథకాల కోసం పేద ప్రజలు ప్రత్యేకం గా దరఖాస్తు చేసుకోవడం గురించి ఆందోళన చెందవలసిన పని లేదు.
నాలుగో తేడా ఏమిటంటే అది వేగాని కి మరియు పరిమాణాని కి సంబంధించిన తేడా. మునుపటి ప్రభుత్వం యొక్క పది సంవత్సరాల హయాం లో పట్టణ ప్రాంత పేదల కోసం 13 లక్షల గృహాల ను ఆమోదించడమైంది. ఇంతవరకు గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలం లో 73 లక్షల గృహాల కు ఆమోదం లభించింది. అంటే, దాదాపు గా ఈ సంఖ్య ఆరు రెట్లు అన్నమాట. ఇదివరకటి ప్రభుత్వం యొక్క పది సంవత్సరాల పాలన కాలం లో దాదాపుగా 38 వేల కోట్ల రూపాయల ను గృహాల కోసం ఆమోదించడం జరిగింది. మరి గత నాలుగున్నర సంవత్సరాల కాలం లో రమారమి 4 లక్షల కోట్ల ను ఆమోదించడమైంది. అంటే, మునుపటి ప్రభుత్వం కన్నా పది రెట్లు అధికం. మునుపటి ప్రభుత్వం 8 లక్షల గృహాల ను నిర్మించగా, మేము గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలం లో దాదాపుగా 15 లక్షల గృహాల ను నిర్మించాం. అంటే, దాదాపు గా రెండు రెట్లన్నమాట. ఇంత వేగం గా పని జరుగుతూ ఉన్నందున 2022వ సంవత్సరం కల్లా ఇల్లు లేని ప్రతి ఒక్క కుటుంబాని కి తల దాచుకొనేందుకు నీడ దొరుకుతుంది.
పేద ప్రజలు అందరికీ ఇళ్ళ ను నిర్మించి ఇచ్చే కల ను నెరవేర్చేటంత వరకు మేము విశ్రమించే ప్రసక్తి లేదు. మన దేశం లోని మధ్య తరగతి వర్గం కోసం కృషి చేసిన ఒక ప్రభుత్వం ఉండటం ఇది ఒకటో సారి. దీని కోసం మేము క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సిఎల్ఎస్ఎస్) ను విస్తరించి, అమలుపరుస్తున్నాం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా 18 లక్షల రూపాయల వార్షిక ఆదాయ స్థోమత కలిగిన మధ్య తరగతి కుటుంబాల కు గృహ రుణ వడ్డీ ని మినహాయించడం జరుగుతోంది. ఈ పని ని మొట్ట మొదటి సారిగా చేయడమైంది. ఈ ప్రణాళిక లో గృహ కొనుగోలుదారులు ఆరు లక్షల రూపాయల వరకు ఆదా చేసుకోనున్నారు. ప్రస్తుతం ఒక మధ్య తరగతి కుటుంబం ఇంటి ని నిర్మించుకొని తన బడ్జెటు లో ఆరున్నర లక్షల రూపాయల ను ఆదా చేసుకో గలుగుతుంది. ఇది వారి జీవితాల లో గణనీయమైన పాత్ర ను పోషించ గలుగుతుంది. మేము కిందటి సంవత్సరం లో ఎల్ఐజి, ఇంకా ఎమ్‌ఐజి గృహాల పరిమాణాన్ని కూడా పెంచాము.
ఈ మధ్యే, బడ్జెటు లో కొన్ని ప్రధానమైన నిబంధనల కు తావు ఇవ్వడమైంది. వీటిని ఉపయోగించుకొని, మధ్య తరగతి లోని యువ ప్రతినిధులు ఒక ఇంటి ని నిర్మించుకోవాలన్న వారి యొక్క కల ను నెరవేర్చుకోగలుగుతారు. పన్నుల ను అయిదు లక్షల రూపాయల వరకు పన్ను విధించదగ్గ ఆదాయం పై సున్నా స్థాయి కి తగ్గించడమైంది. మధ్య తరగతి వర్గాల కు చెందిన యువత వారి యొక్క వృత్తి జీవనం ఆరంభ కాలం లోనే సొంత ఇంటి ని కొనుగోలు చేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందుకోగలుగుతున్నారు. ప్రభుత్వం పన్నుల సంబంధిత నష్టాల ను భరిస్తుంది. అయితే, లబ్ధి ని మాత్రం మీరు పొందుతారు. ఏమిటి, చప్పట్లు బిగ్గరగా వినిపించడం లేదు. దీని ని నేను మరింత సరళమైన మాటల లో వివరిస్తాను. మధ్య తరగతి కుటుంబాలు ఆదా చేసుకొనే సొమ్ము ను ఒక గృహాన్ని నిర్మించడం లో వెచ్చిస్తాయి. అది ఆ తరువాత మీ యొక్క జేబుల ను నింపుతుంది.
ఇంతకు ముందు, ఒక లక్షా 80 వేల వరకు కిరాయి మీద పన్ను ను తగ్గించడం జరిగేది కాదు. కానీ, ఇప్పుడు ఈ మొత్తాన్ని 2 లక్షల 40 వేలు చేసేయడమైంది. ఏమిటి చప్పట్లు బిగ్గరగా వినపడడమే లేదు. దీనికి కారణం ఏమిటంటే నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. ఈ బడ్జెటు గృహ నిర్మాణ పరిశ్రమ కు ఎంత ఇచ్చింది అనేది ఎవ్వరూ మీకు విడమరచి చెప్పనే లేదు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రే స్వయం గా వివరించవలసి వచ్చింది. ఇదిగో చూడండి, కిరాయి మీద పన్ను లేదని ఎవరికైనా తెలిస్తే అప్పుడు అతడు ఒక కొత్త ఇంటి ని నిర్మిస్తాడు. మరిన్ని గృహాల ను నిర్మించి, వాటి ని అద్దె కు ఇవ్వడం వ్యాపారం లో ఒక భాగమైపోతుంది. అందుకని, ఎవరు ఇంటి ని నిర్మిస్తారు, ఆ ఇంటి ని ఎవరు కొనుగోలు చేస్తారు, వారు మోదీ దగ్గర నుండి కొనుగోలు చేస్తారా? మంచిది. నేను మీతో భేటీ అయ్యాను.. లేని పక్షం లో ప్రతి ఒక్కరు నా బడ్జెటు ను అర్థం చేసుకొన్నారని నేను నమ్మే వాడి ని. పార్లమెంట్ కు వివరించే కాలం లో మేము బాగా శ్రమించే వాళ్ళము. ఒక కుటుంబం యొక్క అవసరాల ను గమనించినప్పుడు రెండు ఇళ్ళ ను కొనవలసి వస్తే, వారు అంచనా వేసినటువంటి కిరాయి కి పన్ను ను చెల్లించవలసి వచ్చేది. ప్రస్తుతం దాని మీద ఆదాయపు పన్ను ను రద్దు చేయడమైంది. దీని అర్థం ఏమిటన్నది మీరు తెలుసుకోలేరా? జిఎస్‌టి కి ఏమైందన్నది మాత్రమే మీకు తెలుసు. మీరు జిఎస్‌టి అనే అంశం లో చిక్కుబడి పోయారు.
అదే విధం గా, ఎవరయితే వారి యొక్క పాత ఇంటిని అమ్ముతారో, వారు ధర కు బదులుగా రెండు చిన్న నూతన గృహాల ను కొనుగోలు చేయవచ్చును. వారి కి పన్ను పరం గా భారీ రాయితీ దొరుకుతుంది. ఇప్పుడు ప్రజలు మూలధన లాభాల పన్ను పరం గా ఆదా చేసుకొనే ఆస్కారం ఉంది. ఒకటి కి బదులు, రెండు గృహాల ను విక్రయించడం వల్ల వచ్చిన డబ్బు ను మీరు పెట్టుబడి పెట్టవచ్చును. మరి ఎక్కడయితే మీరు పాత బంగళాలను తీసుకొని ఫ్లాట్ యొక్క పథకాన్ని అమలులోకి తెస్తారో వారి కి వివరించే పని ఇప్పుడిక మీదే. ఈ సలహా ను ఇచ్చినందుకు నాకు ఎటువంటి పన్ను ను చెల్లించనక్కర లేదు.
ఒక ఇంటి ని కట్టుకోవాలనేది భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ఒక సహజ లక్షణం గా ఉంది. మీ రంగాని కి ఒక ఉజ్వలమైన భవిత తాలూకు అంశం ఇమిడివుంది. భారతదేశం లో నవీన మధ్య తరగతి శర వేగం గా వ్యాప్తి చెందుతోంది.
మన దేశం లో ఆకాంక్షలు మరియు స్వప్నాలు ఇదివరకు ఎరుగని శిఖర స్థాయి ల వద్ద ఉన్నాయి. ఈ కలలు వారి యొక్క స్వగృహం వద్ద ఆరంభమవుతాయి. దాని తాలూకు బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది.
భారతదేశం లో ప్రజలు పేదరికం నుండి చాలా వేగం గా బయటపడుతున్నారని ప్రపంచవ్యాప్తం గా వస్తున్న నివేదికల ను మీరు చదివే ఉంటారు. మరి నవీన మధ్య తరగతి లో అనేక ఆకాంక్షలు తొణికిసలాడుతున్నాయి. మీరు చేయాల్సిందల్లా మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, మీ యొక్క పథకాన్ని పరిచయం చేయడమూను. ‘నిర్మా’ ను గురించి మీరు వినే ఉంటారు. బహుళజాతీయ కంపెనీ లు అనేకం ఉన్నాయి. మరి ‘నిర్మా’ తన బట్టలు ఉతికే సబ్బు ను సైకిల్ మీద విక్రయించి, భారతదేశం లోని మధ్య తరగతి యొక్క విపణి ని చేజిక్కించుకొంది. ఈ కంపెనీ బహుళ జాతీయ కంపెనీ లకు సవాలు విసరి మరీ ఈ పని ని సాధించింది. ఇటువంటి నవీన మధ్య తరగతి ని మీరు మీ యొక్క పథకాని కి లక్ష్యం గా చేసుకోవలసిన తరుణం ఆసన్నం అయింది.
మరి నేను ఇస్తున్న వ్యాపార సలహా గనుక తప్పు అని తేలితే నా యొక్క బ్యాంకు ఖాతా లో ఉన్నదంతా మీదవుతుంది.. నాకు తెలుసు ఈ విషయం లో మీరు ఎటువంటి ఆసక్తి చూపరు అని. ఎందుకంటే అందులో ఏమీ లేదు.
నవీన మధ్యతరగతి ఆకాంక్షల ను అర్థం చేసుకొని , వాటిని మీ విపణి కి, వ్యాపార వ్యూహాల కు సంధానం చేయండి. విశ్వాసం తో నేను ఒక మాట ను చెప్పగలను.. మీ కంపెనీ రెండు సంవత్సరాల కిందటో లేదా ఐదు సంవత్సరాల కిందటో ఏర్పాటు చేసింది కావచ్చు; కానీ, మీరు బాగా స్థిరపడ్డ కంపెనీ ల కన్నా మంచి లాభాలను గడిస్తారు. ఎందుకంటే భారీ విపణి మీ కోసం ఎదురుచూస్తోంది.
మీలో చాలా మంది తదుపరి తరం డివెలపర్ లు ఉన్నారు. కనుక మీరు ఆ తరం అవసరాల ను అర్థం చేసుకోగలరు. మీరు ఆధునిక భారతీయ సంస్కృతి ని అర్థం చేసుకోగలరు. దేశ స్థిరాస్తి రంగాన్ని ఆధునీకరించే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది.
స్థిరాస్తి రంగం లో అర్థవంతమైన మార్పుల ను తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలు గా ప్రయత్నాలు చేస్తోంది. సులభతర వ్యాపారాని కి వీలు కల్పించడంతో పాటు, తప్పుడు పద్ధతుల ను నిలువరించేందుకు పలు చర్యల ను తీసుకోవడమైంది. గడచిన కొన్ని దశాబ్దాలు గా స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విశ్వసనీయత లేకపోవడం అని నాకు అనిపిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం వరకు పరిస్థితి ఎలా ఉందంటే, మధ్యతరగతి కుటుంబం ఏదైనా ఇంటి కొనుగోలు పై పెట్టుబడి ని పెట్టాలంటే వంద సార్లు ఆలోచించవలసి వచ్చేది. వీటి మీద లక్షలాది మంది న్యాయస్థానాల కు వెళ్లడం మనం చూసే వుంటాము. కొందరు వ్యక్తుల నిజాయతీ లేమి కారణం గా ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకొన్న డబ్బు నిరుపయోగం అవుతోంది. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకు వచ్చేందుకు వరుస గా పలు చర్యల ను తీసుకోవడం జరిగింది. నోట్ల రద్దు స్థిరాస్తి రంగాని కి గొప్ప లబ్ధి ని చేకూర్చింది. అక్రమ డబ్బు తో స్థిరాస్తి రంగం లో వృద్ధి లోకి రావాలనుకొన్న వారు కార్యకలాపాల ను మూసివేసుకొన్నారు. ఇక ఇప్పుడు నిజాయతీ గల వారు వృద్ధి లోకి రాగలుగుతారు. మీరు నా పాలన ను ఇప్పటికే 5 సంవత్సరాలు, గుజరాత్ అయితే 13 సంవత్సరాలు చూసింది. ఇందులో నిలుకడ తనం కలిగిన ఒక విధానం ఉంది. అదేమిటంటే నేను తీసుకొన్న ప్రతి నిర్ణయం విషయం లో మొదట్లో నేను ఎన్నో సమస్యల ను ఎదుర్కోవలసి వస్తోంది. అన్ని సందర్భాల లోనూ ఇది జరుగుతోంది. ఎందుకంటే, నేను కాలం కన్నా కాస్త ముందున్నాను కాబట్టి. ఇక వెనుక కు వెళ్లి చూస్తే, గుజరాత్ రైతు లు విద్యుత్తు ను అడిగే వారు. కరెంటు కావాలో లేక నీళ్లు కావాలో తేల్చుకోండని వారి కి నేను చెప్పాను. అన్ని రాజకీయ పక్షాలు వారి కి ఉచిత విద్యుత్తు ను ఇస్తూ వస్తున్నాయని వారు అన్నారు. విద్యుత్తు కు సంబంధించి ఇప్పటి వరకు వారు తప్పుడు హామీల ను ఇస్తూ వచ్చారు కనుక ఇక ఇప్పుడు నిర్ణయించుకోండి అని నేను అన్నాను. నేను మాత్రం వారి పంటలు పచ్చ గా ఉండడానికి నీటి ని ఇవ్వాలని నిర్ణయించుకొన్నట్టు చెప్పాను. మీకు చెబితే ఆశ్చర్యం వేస్తుంది కానీ, మా భాగస్వామ్య పక్షం లోని వారు నాకు వ్యతిరేకం గా నిరాహార దీక్ష కు కూర్చున్నారు!
నా స్వంత ప్రజలే ప్రతి గ్రామం లో దిష్టిబొమ్మల ను దగ్ధం చేయడం మొదలుపెట్టారు. ఎన్నికల వేళ ఉచిత విద్యుత్తు హామీ కోసం నాపై ఒత్తిడి తీసుకు వచ్చారు. నేను మాత్రం నీళ్ల గురించే చెబుతూ వచ్చాను. మొదట్లో ఎవరూ నా మాట వినిపించుకోలేదు. కానీ ఆ తరువాత ఇది అనుభవం లోకి వచ్చాక వారు ప్రతి బొట్టు నీటి కి మరింత పంట, బిందు సేద్యం, పానీ బచావో, పానీ పహుంచావో కు మద్దతు గా మాట్లాడటం మొదలుపెట్టారు. గుజరాత్ లో వ్యవసాయ వృద్ధి వరుస గా 10 శాతం గా కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసింది గుజరాత్ గతం లో వ్యవసాయ రాష్ట్రం కాదు అది ఎడారి భూమి అన్న సంగతి ని. ఇదంతా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
నేను దేశ ప్రజల కు, భవిష్యత్ తరాల కు ఒక మాట చెబుతున్నాను, బేనామీ ఆస్తుల చట్టం దేశం లో నిజాయతీ ని బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
రియల్ ఎస్టేట్ రెగ్యులేశన్ యాక్టు (ఆర్‌ఇఆర్‌ఎ) ద్వారా కస్టమర్ కు మీకు మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేయడం జరగింది. ఈ విషయం లో ప్రభుత్వం కీలక పాత్ర ను పోషించింది.
ఈ నిర్ణయాలు మీ బలాన్ని , మీ స్థాయి ని ఎలా పెంచాయో తెలియజేసేందుకు ఇవన్నీ ఒక వర్క్ షాప్ లో ఉండాలని నేను కోరుకొంటున్నాను.
ఇవాళ మీరు ప్రపంచం లో ఏ దేశానికైనా వెళ్లండి, లేదా మీరు ఇప్పటికే వెళ్లి వచ్చిన దేశాన్ని గమనించండి; మిగిలిన వారు మనల్ని దూరం గా ఉంచిన అభిప్రాయం కలిగేది. కానీ ఇవాళ వారు మనల్ని వదులుకొనేందుకు సిద్ధం గా లేరు. ప్రపంచం మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుత తో ఉంది. ఇదంతా నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియ లో , పనితీరు లో ఉంది. ఇది మీపై నేరు గా ప్రభావాన్ని చూపక పోవచ్చు; కానీ ఈ వాతావరణం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఇది మన దేశ ప్రజల ను తమ దేశాన్నిచూసి గర్వపడేటట్టు చేస్తుంది.
మీరు గుర్తు చేసుకొన్నట్లయితే 2013-14 ఎన్నికల కాలం లో, ప్రజలు అనుకొనే వారు, ఈయన ను గురించి గుజరాత్ వెలుపల, దేశం లో ఎవరి కి తెలుసు? అని. ఆయన కు “విదేశాంగ విధానం ఏమీ తెలియదు” అనుకొన్నారు. వంటావార్పు గురించి తెలియదన్నారు. ఇలా ఏవేవో అనుకొన్నారు. నేను ఒప్పుకొంటాను, కానీ నా విధానం ఒక్కటే; నేను ఏది చేసినా, దేశం కోసం చేస్తాను. వాటి ఫలితాల ను ఇవాళ మీరు చూస్తున్నారు. కొన్ని సందర్భాల లో ఈ నిర్ణయాల ఫలితాల ను మీరు మీ స్వంత వ్యాపారాల లో గమనిస్తారు. మీ ప్రధాన బృందాన్ని ఈ విషయం లో మీరు ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు మీరు ప్రభుత్వం చట్టాలు, నిబంధనలు ఊరకే చేయదని అర్థం చేసుకొంటారు. చట్టాలు చేసేటపుడు నేను ఎందరితోనో మాట్లాడుతాను. దాని అవసరం గురించి నేను అర్థం చేసుకొంటాను. అప్పుడు విత్తనం నాటుతాం, మనం ఫలితాన్ని పొందుతాము.
ఇవాళ, నాకు జక్సయ్ చెప్పారు- మీరు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే ఆర్ ఇ ఆర్ ఎ ను – అమలు చేస్తున్నట్టు, అనుసరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఈ దిశ గా మరింత ముందుకు పోవడమే అని నేను విశ్వసిస్తున్నాను. ఈ విషయం లో నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీలో కొందరు ఇంకా అందులో చేరి ఉండకపోవచ్చు. కానీ, ఇక ఇప్పుడు మీ మనసు లో మాత్రం పటిష్టమైన పునాది పై నిలబడాలని భావిస్తారని నేను విశ్వసిస్తున్నాను. నేను గతాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చోను. విశ్వాసం తో రేపటి వైపు చూస్తాను. ఆర్‌ఇఆర్‌ఎ ని 28 రాష్ట్రాల లో నోటిఫై చేసినట్టు విశ్వసిస్తున్నాను. 21 రాష్ట్రాల లో ట్రైబ్యూనల్స్ కూడా పనిచేస్తున్నాయి. ఇవాళ దేశంలో 35 వేల స్థిరాస్తి పథకాలు, 27 వేల రియల్ ఎస్టేట్ ఏజెంట్ లు నమోదై ఉన్నారు. ఈ పథకాల లో భాగం గా లక్షలాది ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. మానవ జీవితం లోని ముఖ్యమైన పార్శ్వం తో సంబంధం ఉన్న రంగం మీది. ఒక ఇంటి ని కట్టుకోవాలన్నది వారి కోరిక. ఈ ఆకాంక్ష ఎన్నటికీ పోదు.
ఎంతో మందికి ఉపాధి ని కల్పించే రంగం మీది. కేవలం తాపీ పని వారి గురించి కాదు నేను చెప్పేది. వారు ప్రత్యక్షం గా ఇందులో భాగస్వాములు అవుతారు. ఉదాహరణ కు మీ ప్రాజెక్టు సిమెంటు ను వాడుతుందనుకోండి, ఆ రంగం లోనూ మీరు ఉపాధి ని కల్పిస్తున్నట్టే. మీరు ఉక్కు ను వినియోగిస్తే అక్కడా ఉపాధి ఉంది. అంతేకాదు, మీ ప్రాజెక్టు మంచి సొసైటీ ని ఏర్పాటు చేస్తే దానికి తోటమాలి కావాలి. వార్తాపత్రిక అందించే వ్యక్తి కావాలి, పాలు పోసే వ్యక్తి కావాలి. ఇలా ఎన్ని ఉపాధి అవకాశాలో చూడండి. ఉపాధి రంగం లో చోదక శక్తి గా మీరు పనిచేస్తారు. అయితే మీకు లభించవలసినంత గౌరవం లభించడం లేదు. ఎందుకని ? అందుకు కారణం, మిమ్మల్నిజవాబుదారుతనం లేని వారు గా చేసే వారి తో మీలో కొందరు భాగస్వాములు అవుతున్నారు. ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేస్తున్నారు. అటువంటి వారే మిమ్మల్ని పతనం చేస్తున్నారు.
నాకు మీ ప్రయత్నాల మీద విశ్వాసం ఉంది. జక్సయ్ అతని చిన్నతనం నుండి నాకు తెలుసును. గుజరాత్ లో వజ్రాల పరిశ్రమ వర్గాల తో నేను మాట్లాడే వాడి ని. ఆ సమయం లో నేను రాజకీయాల లో లేను. వారి ని నేను అడిగాను. మీరు చాలా చిన్న వయసు లో వజ్రాలు కోయడానికి, వాటికి పాలిష్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు కంపెనీల కు యజమానులు అయ్యారు. వజ్రాల ను ఎగుమతి చేస్తున్నారు. కానీ సమాజం లో మీపై ఉన్న అభిప్రాయం ఎందుకు మారలేదు అని. ఇది 20-25 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి. వజ్రాల వ్యాపారం తో సంబంధం ఉన్న వారి కి ఇల్లు అద్దె కు ఇవ్వడానికి ఒకటి కి రెండు సార్లు ఆలోచించే రోజులు అవి. కానీ ఇవాళ చూస్తే పరిస్థితి పూర్తి గా మారిపోయింది. వారి ని ఎంతో గౌరవిస్తున్నారు. ఏ సామాజిక కార్యక్రమాలలో అయినా వారు కీలక స్థానాల లో ఉంటూ వస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే వారి తో నేను సంబంధాల ను కలిగివుండటం లో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాను. మీ రంగం లో మీరు విద్యావంతులో, సంపన్నులో కావలసిన అవసరం లేదు. మీ మిత్రుని గా నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రధాన మంత్రి గా నేను చెప్పడం లేదు. మీ రంగం ప్రతిష్ఠ పెంచడం మీ బాధ్యత గా, ప్రాధాన్యం గా ఉండాలి. ఇక్కడ మీ ప్రతిష్ఠ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మిమ్మల్ని మీరు విశ్వసనీయ వ్యక్తులు గా తీర్చిదిద్దుకొంటే మీరు ఎక్కలేని శిఖరాలంటూ ఉండవు. ఇటువంటి గొప్ప రంగం లో సామాజిక ప్రతిష్ఠ, సామాజిక ఆమోదయోగ్యత లు ఎంతో కీలకం. ఎవరైనా జీవితం లో తమ పిల్లల చదువు, వివాహం కోసం, ఒక ఇంటి ని నిర్మించుకోవడం కోసం కష్టపడి జీవితం లో సంపాదిస్తారు. వారు తమ కలల ను సాకారం చేసుకోవడానికి మిమ్మల్ని నమ్ముతారు. వారు జీవితమంతా కష్టపడి సంపాదించింది మీ కాళ్ల దగ్గర పెడతారు. అటువంటి వ్యక్తుల ను మోసం చేస్తే అతని విశ్వాసం దెబ్బ తింటుంది. ఒకసారి మోసపోతే దాని ప్రభావం ఇక్కడ వందలాది మంది మీ వారిపై పడుతుంది. మీరు ఈ సవాలు ను అర్థం చేసుకొన్నట్టయితే, దానికి పరిష్కారం లభిస్తుంది. దాని నుండి గొప్ప మార్పు ను మీరు గమనిస్తారు.
నిర్మాణ రంగాని కి సంబంధించిన పర్మిట్ లు అన్నీ ఇప్పుడు ఇంతకు ముందు కన్నా వేగం గా జారీ అవుతున్నాయి. ఇది దేశాన్ని గత నాలుగున్న ర సంవత్సరాల లో సులభతర వాణిజ్యాని కి సంబంధించిన స్థానాల లో 67 వ స్థానం లో నిలబెట్టింది. ప్రపంచాని కి ఇదొక ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం ర్యాంకింగ్ లో ఇంత పెద్ద ముందడుగు ఎలా వేసిందన్నది వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు ఒక రోజు న నాకు ఫోన్ చేసి ఒక అభివృద్ధిచెందుతున్న దేశం, ఇంత పెద్ద దేశం ఇంత వేగం గా నిర్దేశిత లక్ష్యాన్నిచేరుకోవడాన్ని ఊహించలేకపోతున్నానని అన్నారు. నన్ను అభినందించడానికి ఆయన ప్రపంచ బ్యాంక్ బృందాన్నంతటి ని పంపారు. మీరు దీని ప్రయోజనాల ను అందిపుచ్చుకోకపోతే దేశం ఎంతగానో నష్టపోతుంది. అందువల్ల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవలసిందంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను.
జిఎస్ టి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అటు డివెలపర్ లకు, ఇటు కస్టమర్ లకు సులభం చేసివేసింది. మొదట నిర్మాణ రంగం పై 15 నుండి 18 శాతం పన్ను విధించే సంగతి మీరు ఎరుగుదురు. పెయింట్, టైల్స్, టాయిలెట్స్, షవర్, కేబుల్, వైర్ లకు 30 శాతం పైగా పన్ను ను వసూలు చేసే వారు. జిఎస్ టి అమలు లోకి వచ్చిన తరువాత మధ్య తరహా ఇళ్ల కు 8 శాతం పన్ను ను, ఇతరుల కు 12 శాతం పన్ను నిర్ణయించారు. వాణిజ్య ఆస్తుల కు కూడా పన్ను ను తగ్గించారు. అదే విధం గా, నిర్మాణ సామగ్రి పైనా జిఎస్ టి ని బాగా తగ్గించడమైంది. పెయింట్, వైర్లు, ఎలక్ట్రికల్ ఫిటింగ్ లు, శానిటరీ వేర్, ప్లైవుడ్ , టైల్స్ తదితరాల కు జిఎస్ టి ని 28 శాతం నుండి 18 శాతాని కి తీసుకు వచ్చారు. ఇటుకల పై జిఎస్ టి 12 శాతం ఉండగా, దాని ని 5 శాతాని కి తగ్గించడం జరిగింది.
ప్రస్తుతం మనం మధ్యతరగతి ప్రజలందరి కి సరి అయిన ధర ల లో మంచి ఇళ్ల ను నిర్మించ గలం. దీని కోసం ఆదాయపు పన్ను ను సైతం మినహాయించడమైంది. 2016వ సంవత్సరంలో సెక్షన్ 80 ఐబిఎ ని జోడించడమైంది. దీని ని ఉపయోగించి చౌక గృహనిర్మాణ పథకం తాలూకు లాభం లో 100 శాతం పన్ను మినహాయింపు ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటువంటి పథకాల ను పూర్తి చేయడానికి కాలాన్ని కూడాను మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల కు మార్చడమైంది. ఈ సంవత్సరం తక్కువ ఖర్చు తో కూడిన గృహనిర్మాణ పథకాని కి ఆమోదం పొందేందుకు ఉన్న కాల అవధి ని 2019వ సంవత్సరం మార్చి 30వ తేదీ కి బదులు గా ఒక సంవత్సర కాలం పాటు- అంటే 2020వ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు- పొడిగించడం జరిగింది. అమ్మకం కానటువంటి గృహ సముదాయాల సమస్య ను దృష్టి లో పెట్టుకొని, ప్రస్తుతం జాతీయ అద్దె ఆదాయం పై రెండు సంవత్సరాల పాటు పన్ను ను విధించడం జరుగదు. మధ్యతరగతి కి ఉద్దేశించిన గృహాల ను బలోపేతం చేయడానికి ఇటువంటి అనేక నిబంధనల ను గత నాలుగున్నర సంవత్సరాల కాలం లో అమలు చేయడం జరుగుతోంది.
స్థిరాస్తి కి మరియు గృహ నిర్మాణ రంగాని కి నిధుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రయత్నాల ను చేపట్టడం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం స్థిరాస్తి మరియు మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత పెట్టుబడి ట్రస్ట్ కు రుణ విపణి నుండి నిధుల సేకరణ కై అనుమతి ఇవ్వడమైంది. ఆ తరహా ట్రస్టు ల ను 2017వ సంవత్సరం నుండి డివిడెండ్ డిస్ట్రిబ్యూశన్ ట్యాక్స్ నుండి మినహాయించడమైంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లు విదేశాల నుండి నిధుల ను సేకరించుకొనేందుకు వీలు గా గత సంవత్సరం లో ‘సెక్టరల్ రిమిటన్స్’ను కూడా తొలగించడమైంది.
మధ్య తరగతి గృహాల కు మౌలిక సదుపాయాల ను పెంపొందించేటందుకే ఈ ప్రయత్నాలు. ఈ చర్య ల కారణం గా ఉపాధి కల్పన కూడా ఉత్తేజాన్ని పొందింది. ఈ రంగం లో కోట్లాది ప్రజలు పని చేస్తున్నారు. వారి లో చాలా మంది అసంఘటిత రంగం లో భాగం అయి ఉన్నారు. గృహ నిర్మాణాని కి సంబంధించిన ఈ కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ బడ్జెటు లో విస్తృతమైనటువంటి ప్రణాళిక ను తీసుకు వచ్చింది. ఇప్పుడు 15 వేల కన్నా తక్కువ సంపాదించే కార్మికుల కు 60 సంవత్సరాల తరువాత 3000 రూపాయలు పెన్షన్ గా లభిస్తుంది. ఈ పథకం లో చేరడానికి ఈ కార్మికులు ప్రతి నెల సగటు న 100 రూపాయలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం తన పెన్షన్ ఖాతా లో అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.
దేశం లో మధ్య తరగతి కలల ను నెరవేర్చే ఈ కార్మిక మిత్రుల ను ఈ పెన్షన్ పథకం తో ముడి వేయడం ద్వారా వారి పట్ల శ్రద్ధ తీసుకోవలసింది గా మీ అందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్మిక మిత్రుల తో చేరడం ద్వారా మీరు కూడా సహకరించిన పక్షంలో, వారు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లోను, సురక్ష బీమా యోజన లోను చేరేటట్టు కూడా మీరు చూస్తారని నేను అర్థం చేసుకోగలను. నిర్ధారిత బీమా 90 పైసలు అన్న సంగతి ని మీరు గమనించి తీరాలి. అప్పుడప్పుడు మీరు ఏ నేస్తం తో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ కారు ఇంజిన్ ను ఆపకుండా ఉంచితే ఎంత పెట్రోల్ ను ఊరకనే మండిచేస్తారో కదా.
మీరు గనక ఈ మాత్రం చేశారంటే, ఆ నేస్తం జీవితం లో ఏదైనా కష్టం దాపురించిన వేళ లో, ఈ రెండు బీమా పాలసీ ల ద్వారా ఒక్కొక్క టీ రెండేసి లక్ష ల రూపాయల చొప్పున, వారి కుటుంబం గొప్ప శక్తి ని అందించినవారవుతారండీ. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు అలా అవసరమైన కుటుంబాల కు అందాయి; కోట్ల కొద్దీ కుటుంబాలు వీటి తో జోడింపబడివున్నాయి. మీకు ఏదైనా పేద కుటుంబాన్ని గురించి తెలిస్తే, వారి కి వీటి ని గురించి తెలుసొ లేదో కనుక్కోండి. వారి కి తెలియకపోతే, దయచేసి వారి కి తెలియజెప్పండి. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉంది. సామాజిక బాధ్యతల ను గురించి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాల ద్వారా, మనం వాటి ని మరింత విస్తృతం గా చేయగలుగుతాము. పేద పిల్లల విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు స్వచ్ఛ భారత్ అభియాన్ లకు మీరు సహకరిస్తున్నారని నా దృష్టి కి వచ్చింది; దీనికి గాను మిమ్మల్ని నేను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.
మీ వంటి తదుపరి తరం నాయకులు మాత్రమే న్యూ ఇండియా ను తీర్చిదిద్దగలరు. మీ క్రొత్త ఆలోచన ల మరియు మీ సామర్థ్యాల పై నమ్మకం ఉంచి పెద్ద లక్ష్యాల ను, కష్టమైన లక్ష్యాల ను నేను నిర్దేశించగలుగుతాను. మీ శక్తి కారణం గా దీని ని నేను చేయగలుగుతున్నాను. మీ శక్తి రాబోయే రోజుల లో దేశాన్ని బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. గృహాల ను తక్కువ ఖర్చు తో ఎలా రూపొందించవచ్చో అనే విషయమై ఈ కార్యక్రమం లో గంభీరమైనటువంటి మేధోమధనం సాగనుంది; క్రొత్త క్రొత్త ఉపాయాలు పుట్టకు వస్తాయి. ప్రత్యేకించి గృహ నిర్మాణ రంగం లో, స్థిరమైన అభివృద్ధి ని, ఇంకా వినూత్న సాంకేతిక విజ్ఞానాన్ని ఎంత అధికం గాను, ఏ యే రకాలు గాను ఉపయోగించుకోవచ్చో అనే అంశాలను చర్చించడం అవసరం.
హరిత శక్తి, స్వచ్ఛ శక్తి, శక్తి సామర్థ్యం, జల సంరక్షణ, పదార్థాల పునర్ వినియోగం తో నిర్మాణం మరియు అపార్ట్ మెంట్ లలో అధునాతన వ్యర్థ పదార్థ నిర్వహణ వ్యవస్థ ను ప్రోత్సహించటం కూడా మీ ప్రాథమ్యాలు కావాలి. అలాగే, నిర్మాణం లో కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థవంతం గాను, ప్రభావశీలం గాను ఉపయోగించడమూ అవసరమే.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా సుమారు 12 లక్షల గృహాల నిర్మాణం లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని గృహనిర్మాణ రంగాని కి విస్తరించడం ద్వారా ఒక్క నిర్మాణ వ్యయం తగ్గడం మాత్రమే కాక నిర్మాణం కూడాను వేగం గా పూర్తి అవుతుంది. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైనటువంటి గృహనిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించడం కోసం, ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలింజ్’ సమావేశాన్ని సైతం వచ్చే నెల లో ఢిల్లీ లో నిర్వహించబడుతోంది. మీరందరూ ఈ చాలింజ్ లో పాలు పంచుకోవచ్చు.
ప్రతి సామాన్యుని కి మీ పైన గొప్ప ఆశ లు ఉన్నాయి. ఈ ఆశల కు మీరు తుల తూగుతారు, ఈ నమ్మకం తోనే ఈ రోజు న మీకు బోలెడు సంగతుల ను గురించి నేను చెప్పబోతున్నాను. అయితే మరికొన్ని విషయాల ను జోడించాలని కూడా నేను తలపోస్తున్నాను. నేను జక్సయ్ ను అడుగుతున్నాను.. మీ దగ్గర చాలా మంది యువకులు న్నారు కదా, ఏదైనా పోటీ ఉందా?, ఇలాంటి ప్రశ్నలు. అందుకని నేను అన్నాను, మీకు నన్ను ఒక ఆలోచన ను ఇవ్వనివ్వండీ అని.
నిర్మాణ జగత్తు లో, వాతావరణం పరం గా, వినూత్నమైన పనుల ను చేసే కొన్ని స్టార్ట్- అప్ లు ఉండి, నిర్మాణ ప్రపంచాన్ని ఒక అడుగు ముందుకు వేసేందుకు ఏదో ఒకటి చేస్తూ ఉన్న పక్షం లో, పర్యావరణ అనుకూలమైన దాని ని ఉపయోగిస్తూ, వ్యర్థాల నుండి ఉత్తమమైంది తయారు చేసే మెలకువ ను ఉపయోగిస్తూ అలాగే నిర్మాణం లో అటువంటి వ్యర్థాల ను ఉపయోగించడం గాని, లేదా వ్యర్థాల నుండి సంపద ను సృష్టించడం గాని, తదితర రీతుల లో క్రెడాయ్ ఆలోచన చేయాలా. ఈ కోవల లో ఒక పోటీ ని క్రెడాయ్ నిర్వహించాలి, అంతే కాక ఈ రకమైన కార్యక్రమాల లో ఒక న్యాయ సహాయక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి ని పురస్కారాల తోనో, బహుమతుల తోనో ప్రోత్సహించటాన్ని గురించి కూడా ఆలోచన చేయాలి.
మరొక్క విషయం – మరి దీని ని మీరు ఇష్టపడతారనే నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మీకు కూడా ఓ మహిళా సంస్థ ఉంది కదా; అయితే అందులో ఈ రంగం లో పని చేసే మహిళలే ఉన్నారు. వీలయితే మీ కుటుంబం లోని మహిళల తో.. ఎవరైతే వ్యాపారం చేయకపోయినప్పటి కి ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నారో.. వారి తో మరొక సంస్థ ను ఏర్పాటు చేయండి. గుజరాత్ లో నేను ముఖ్యమంత్రి గా ఉండగా, ఒక ప్రయోగం చేశాను.
మురికివాడ ల స్థానం లో ఫ్లాట్ లను మేము నిర్మించాము. పని పెద్ద స్థాయి లో జరిగింది. అయితే నాకు మానసికం గా ఒకటి అనిపించింది, ఎలాగంటే చాలా కాలం క్రితం ఒక సినిమా లో మీరు చూసి వుంటారు. ఆ సినిమా ను నేను కూడా చూశాను- ఆ సినిమా పేరు ను మాత్రం నేను గుర్తు పెట్టుకోలేదు- కాని దాని ని మీరు గుర్తు పెట్టుకొని ఉండవచ్చు. అందులో నటించింది కమల్ హాసన్. ఆయన రైల్వే లైన్ పక్కన ఒక గుడిసె లో నివసిస్తుంటాడు; రైలు చేసే శబ్దం తో అతడు నిద్రపోతుంటాడు. ఇప్పుడు అతడి ఇల్లు మారిపోయింది; అయితే ఆయన రైలు శబ్దం లేనిదే ఎంత మాత్రం నిద్ర పోలేడు. కాబట్టి రైలు యొక్క శబ్దాన్ని అతడు రికార్డు చేసుకుని మరీ రాత్రి వేళ ఆ టేప్ ను పెట్టుకొని నిద్ర పోతాడు.
దీని కి అర్థం – పేదరికం లో నివసించే వ్యక్తి, కొత్త ఇంటి కి వెళ్లాడంటే తన ను తాను సర్దుబాటు చేసుకోలేడు – అని. అయితే, ఆ వ్యక్తి కి గనక సరి అయిన కాలం లో మార్గదర్శకత్వం అందిందంటే, అతని కి శిక్షణ లభించిందీ అంటే, ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది; గోడ లను మార్చినంత మాత్రాన జీవితం లో మార్పు రాదు. ఒక ఎన్ జి ఒ తో నేను మాట్లాడి ఏం చేశానంటే – పక్కా ఇళ్ళ ను పొందినటువంటి పేద కుటుంబాల కు చెందిన ప్రజలు విశ్రాంతి గది ని ఎలా ఉపయోగించుకోవాలి ఇంకా ఇతరత్రా వారి కి తెలియని అంశాల పైన వారు శిక్షణ ను అందుకొనేటట్టు చూశాను. మీకు ఒక విషయాన్ని నన్ను చెప్పనివ్వండి – మన దేశం లో ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి, వీటి ని వింటే మనం ఆశ్చర్యపోతాము, ఎందుకంటే ఆ తరహా జీవితాన్ని మనం గడపలేదు, కాబట్టి అవేవీ మనకు తెలియవు. అందువల్ల వారి కి టాయిలెట్ ను ఎలా ఉపయోగించుకోవాలి, నల్లా ఎలాగ పని చేస్తుంది, గాజు కిటికీ గనక ఉంటే, మీరు ఏమి చేస్తారు ? ఇవన్నిటి గురించి వారికి నేర్పడమైంది. మరి పాత చీర ను ఉపయోగించి ఒక కర్టెన్ ను మనం తయారు చేద్దాం.
ఎవరైనా మీ ఇంటి కి వచ్చారనుకోండి, వారు కాళ్ల ను తుడుచుకొనే బట్ట లాంటిది వాడాలి. అటువంటి పనుల లో వారి కి ఒక ఎన్ జిఒ ద్వారా శిక్షణ నివ్వడాన్ని నేను మొదలుపెట్టాను. అలా 3 వారాల ను నేను వెచ్చించాను. ఇప్పుడు వారి విశ్వాసం లో బోలెడంత మార్పు చోటు చేసుకొన్నది. అది ఎలాగంటే వారు డబ్బు ను ఆదా చేసుకొనేటంత గా. వారు కొన్ని ప్లాస్టిక్ కుర్చీల ను కొన్నారు, తరువాత కర్టెన్ ను కట్టడం కోసం ఒక తీగ ను కూడా తీసుకు వచ్చారు. వారు వారి యొక్క జీవితాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టారన్న మాట. అప్పుడు వారు రేడియో, టెలివిజన్ ల వంటి వి కూడా తెచ్చుకోవాలనే ఆలోచన లు చేశారు.
మీరు మీ గృహ నిర్మాణ పథకాల తో పాటు మీ యొక్క సొంత కుటుంబం తో కలసి ఒక ఎన్ జి ఒ ను స్థాపించి, అటువంటి కుటుంబాల కు శిక్షణనిచ్చారంటే గనక వారి కి ఇళ్ల ను నిర్మించి ఇవ్వడం కంటే కూడా వారి జీవితాల లో మార్పు ను తీసుకు రావడం వల్ల మీరు మరింత సంతృప్తి ని పొందుతారని నేను అంటాను.
మీరు కొన్ని కొత్త కొత్త పనుల ను చేస్తారు, మరి మీది యువ రక్తం. మీరు పలు అంశాలను గ్రహించగలరు; మీ లో అపారమైన శక్తి ఉరకలు వేస్తూ ఉంటుంది. నా మనస్సు కూడా ఎంతో యవ్వనం కలిగినటువంటిదే. అందువల్ల మీతో నేను ఇట్టే కలసిపోతాను; మన మధ్య అంతరం ఉందని నేను అనుకోను. అలాగే పదవి రీత్యా గాని, లేదా వయస్సు పరం గా గాని, లేదా నా యొక్క నేపథ్యం విషయం లో గాని అంతరం ఉందని నేను ఎన్నడూ అనుకోలేదు. నా మనస్సు లోపల ఉన్నదల్లా ఒకే అభిలాష. అది ఏమిటి అంటే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీ భవిష్యత్తు ను గురించి ఆలోచించాలని, మీతో కలసి పనిచేయాలని, దేశం కోసం సమష్టి గా కృషి చేయాలనీనూ.
ఇదే మనోభావం తో మరో మారు మీకు మరియు నా రేఖాచిత్రాన్ని ఎంతో అందం గా గీసిన కళాకారుని కి నేను అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కళాకారుని కి ఇవే అభినందనలు. శ్రీ జక్సయ్ ని ఆయన చిరునామా ను ఇవ్వవలసింది గా నేను అడిగాను; నేను ఆయన కు ఒక విషయాన్ని చెప్పే తీరాలి; ఆయన చేసినటువంటి అద్భుతమైన పని కి గాను ఆయన కు నేను ఒక లేఖ ను వ్రాస్తాను.
మీకు మరో సారి నేను శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. మన దేశాని కి సంబంధించి మీకు నేను చెప్పినటువంటి సంగతుల లో మంచి వాటి ని గ్రహించండి. మరి దేనిని గురించి అయినా మీకు చెడు గా అనిపిస్తే గనక దానిని నాకే వదలివేయండి; ఆ సంగతి ని నేను చక్కదిద్దుకొంటాను. మీకు సేవ చేయడం కోసం మీ వద్ద కు నేను మళ్లీ వస్తాను.
అనేకాకనేక ధన్యవాదాలు.
**
देश का गरीब के घर का सपना पूरा हो, 2022 तक हर बेघर को अपना पक्का घर मिले, इस दिशा में तेज़ी से काम किया जा रहा है।
— PMO India (@PMOIndia) February 13, 2019
प्रधानमंत्री आवास योजना के तहत देश के गांव और शहरों में लगभग 1.5 करोड़ गरीबों के घर बनाए जा चुके हैं, जिसमें से लगभग 15 लाख घर शहरी गरीबों के बनाए जा चुके हैं: PM
जब किसी योजना से नाम का या स्वार्थ का भाव निकाल देते हैं तो नीति स्पष्ट हो जाती है
— PMO India (@PMOIndia) February 13, 2019
इसलिए करप्शन का, अपने-पराए का भाव भी निकाल दिया।
अब तकनीक का उपयोग कर लाभार्थियों का चयन होता है, किसी के कहने पर लिस्ट में नाम कटने या जोड़ने का काम जो होता था उसको बंद कर दिया है: PM
RERA के माध्यम से ग्राहक और आप सभी के बीच का भरोसा और मजबूत हुआ है।
— PMO India (@PMOIndia) February 13, 2019
आज RERA 28 राज्यों में नोटिफाई किया जा चुका है।
आज देशभर में करीब 35 हजार रियल एस्टेट प्रोजेक्ट्स और 27 हजार रियल एस्टेट एजेंट्स इससे रजिस्टर हो चुके हैं और लाखों नए फ्लैट्स का निर्माण किया जा रहा है: PM
इसी तरह कंस्ट्रक्शन परमिट सहित तमाम दूसरी परमिशन अब पहले की तुलना में तेज़ी से मिल रही हैं।
— PMO India (@PMOIndia) February 13, 2019
जिसका परिणाम ये हुआ कि ईज़ ऑफ डूइंग बिजनेस रैंकिंग में देश ने बड़ी छलांग बीते साढ़े 4 वर्षों में लगाई: PM
पहले कंस्ट्रक्शन सेक्टर पर 15-18% का टैक्स लगता था। जो सामान है, जैसे पेन्ट, टाइलें, टॉयलेट का सामान, केबल, वायर ऐसी तमाम चीजों पर 30% से ज्यादा टैक्स लगा करता था।
— PMO India (@PMOIndia) February 13, 2019
GST के बाद मध्यम वर्ग के घरों के लिए टैक्स कम हुआ है। इसी तरह कंस्ट्रक्शन मटीरियल पर भी GST को कम किया गया है: PM
पेन्ट, वायर, इलेक्ट्रिकल फिटिंग से जुड़ा सामान, सेनिटरीवेयर, प्लायवुड, टाइल जैसे अनेक सामान पर GST 28 प्रतिशत से घटाकर 18 प्रतिशत लाया गया है।
— PMO India (@PMOIndia) February 13, 2019
वहीं ईंटों पर GST 12 प्रतिशत से घटाकर 5 प्रतिशत किया गया है: PM