పిఎంఇండియా
కమ్యూనికేశన్స్ రంగం లో సహకారం అంశం పై భారతదేశాని కి మరియు కంబోడియా కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై కంబోడియా లో 2019వ సంవత్సరం మార్చి నెల లో సంతకాలయ్యాయి.
ప్రభావం:
ఈ ఎంఒయు కమ్యూనికేశన్స్ రంగం లో భారతదేశాని కి మరియు కంబోడియా కు మధ్య పరస్పర అవగాహన ను మరియు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లో తోడ్పాటు ను అందించనుంది.
******