Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌ర్ణాట‌క పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ ఎన్‌. ధ‌ర‌మ్ సింగ్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


క‌ర్ణాట‌క పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ ఎన్‌. ధ‌ర‌మ్ సింగ్ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“క‌ర్ణాట‌క పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ ఎన్‌. ధ‌ర‌మ్ సింగ్ క‌న్ను మూశార‌ని తెలిసి దుఃఖిస్తున్నాను. ఈ దుఃఖ స‌మ‌యంలో ఆయ‌న కుటుంబం మ‌రియు మ‌ద్ద‌తుదారుల శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను.

క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌లోను, దేశ రాజ‌కీయాల‌లోను శ్రీ ఎన్‌. ధ‌ర‌మ్ సింగ్ అపార‌మైన అనుభ‌వాన్ని గ‌డించారు. స‌మాజానికి ఆయ‌న అంకిత భావంతో చేసిన సేవ స‌దా స్మ‌ర‌ణీయం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****