Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాలుపంచుకోనున్న‌ వారి కి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


పుణె లో నేడు ఆరంభమవుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాలుపంచుకోనున్న వారు అంద‌రి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“పుణె లో నేడు మొద‌ల‌వుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాలుపంచుకోనున్న వారు అందరి కి ఇవే నా యొక్క శుభాకాంక్ష‌లు. ఈ ఆటల పోటీ ఉత్త‌మ‌ క్రీడా ప్ర‌తిభ ను కూడా ఆవిష్క‌రించు గాక‌; అలాగే ఇది మ‌న యువ‌తీ యువ‌కులు వారి క్రీడారంగ స్వ‌ప్నాల‌ ను సాకారం చేసుకోవ‌డం కోసం ఒక వేదిక‌ ను అందించుగాక‌.

మ‌రిన్ని క్రీడ‌ల తో, మ‌రింత ఉత్త‌మ‌మైన‌టు వంటి ఆరోగ్యమే కాక దేశ ప్రజలకు దేహ దారుఢ్యం కలుగుగాక‌! 5 మినట్ ఔర్ (మరో అయిదు నిమిషాలు) అనేది ఒక గొప్ప ప్ర‌య‌త్నం. ఇది భార‌త‌దేశం అంత‌టా దేహ దారుఢ్య స్థాయిల‌ ను పెంపొందించ గ‌లుగుతుంది. ప్ర‌ముఖ క్రీడాకారులు మైదానం లో మ‌రింత కాలాన్ని వెచ్చించ‌డం తో పాటు వారి యొక్క స్వీయ అనుభ‌వాల‌ ను వెల్ల‌డించటం సైతం అద్భుతం గా ఉంది’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.