Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని


జాతిపిత మహాత్మా‌గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

మహాత్మా‌గాంధీ ప్రవచించిన సత్యంఅహింసనైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారుఅభివృద్ధి చెందినసమ్మిళిత భారత్ దిశగా చేస్తోన్న సమష్టి ప్రయాణంలో మార్గదర్శక సూత్రాలుగా గాంధీజీ ఆదర్శాలకు దేశం కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

గాంధీ జయంతి అంటే బాపు అసాధారణ జీవితానికి నివాళి అర్పించడంఆయన ఆలోచనలు మానవ చరిత్ర గతికి ఒక కొత్త మలుపుధైర్యంనిరాడంబర జీవితం.. గొప్ప మార్పునకు బాటలు వేస్తాయని ఆయన ఆచరణాత్మకంగా చూపించారుప్రజల జీవితాలను మార్చేందుకు సేవకరుణకున్న శక్తి అపారమని ఆయన విశ్వసించారువికసిత్ భారత్‌ సాధన కోసం ఆయన చూపిన బాటలో పయనిస్తాం’’