Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గీతా ప్రెస్ అధ్య‌క్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా మృతిప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి


గీతా ప్రెస్ అధ్య‌క్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా జీ మృతిప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
   ఈమేరకు ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ , గీతా ప్రెస్ అధ్య‌క్షుడు , స‌నాత‌న సాహిత్యాన్ని ప్ర‌జ‌ల‌వద్ద‌కు చేరుస్తున్నరాధేశ్యామ్ ఖేమ్కాజీ మ‌ర‌ణించార‌న్న వార్త అత్యంత దుఃఖం క‌లిగించింది.  ఖేమ్‌కాజీ జీవిత‌ప‌ర్యంత‌మూ సామాజిక కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా ఉంటూ వ‌చ్చారు. ఈ దుఃఖ‌స‌మ‌యంలో వారి కుటుంబానికి, అభిమానుల‌కు నా సంతాపాన్నితెలియజేసుకుంటున్నాను . ఓంశాంతి. అని త‌మ సందేశంలో తెలిపారు.

***