పిఎంఇండియా
ప్రపంచవ్యాప్తంగా యోగా అపారమైన ప్రజాదరణ పొందుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పేర్కొన్నారు. రేపు అంటే జూన్ 4న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం కానున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఒకచోట చేరుస్తోందని, యోగాసనానికి సంబంధించిన ప్రపంచ క్రీడా ప్రణాళికలో ఇది ముఖ్యమైన విజయమని ప్రధానమంత్రి తెలియజేశారు. రేపు సాయంత్రం సుమారు 6:40 గంటలకు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటానని శ్రీ మోదీ ప్రకటించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘ప్రపంచవ్యాప్తంగా యోగాకు అత్యంత ప్రజాదరణ లభిస్తోంది! రేపు, జూన్ 4న అహ్మదాబాద్‌లో చాలా ప్రత్యేకమైన పోటీ జరగనుంది. అదే ప్రపంచ యోగాసన క్రీడల ఛాంపియన్షిప్ – 2026. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఈ వేదిక ఒక్కచోటకు చేరుస్తోంది. యోగాసనాలకు సంబంధించి అంతర్జాతీయ క్రీడా ప్రణాళికలో ఇది ఓ ముఖ్యమైన విజయం. రేపు సాయంత్రం 6:40 ప్రాంతంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ వినూత్న కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు.’’
***
Yoga is gaining tremendous popularity across the world! Tomorrow, on 4th June, a very special competition, the 1st World Yogasana Sports Championship 2026 commences in Ahmedabad. This platform has brought together Yoga enthusiasts from around the world. It is a significant…
— Narendra Modi (@narendramodi) June 3, 2026