పిఎంఇండియా
సోమనాథ్ అమృత్ మహోత్సవానికి సంబంధించిన పలు విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.
పవిత్రమైన సోమనాథ్ ఆలయపు ఎత్తయిన శిఖరంపై సగర్వంగా ఎగురుతున్న ధర్మధ్వజాన్ని చూస్తుంటే.. దేశ అచంచల విజయానికి సంకేతంగాను, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దివ్య ప్రకటనగాను కనిపిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సోమనాథ్ శిఖరాగ్రాన ఉన్న ఆ కాషాయ పతాకం అచంచల భక్తికి సజీవ విజయగాథ అని, అది శాశ్వతంగా భారత కీర్తిని గానం చేస్తూ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
ఆలయ చరిత్రను గుర్తుచేస్తూ, వెయ్యేళ్ల కిందట సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ నేల సంస్కృతిని నాశనం చేయగలమని భావించిన దురాక్రమణదారులు సోమనాథ్పై అనేక దాడులకు పాల్పడ్డారని ప్రస్తావించారు. భరతమాత అత్యంత ధైర్యవంతులైన బిడ్డల కృషి వల్లే సోమనాథ్ ఆలయం పదేపదే పునర్నిర్మాణం అవుతూనే వచ్చిందని ఆయన కొనియాడారు. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో… పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని ప్రధాని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఆక్రమణదారులు చరిత్ర గర్భంలో కలిసిపోయారని, కానీ భారత్ ఆత్మ మాత్రం అజరామరమని ఆ రోజే ప్రపంచానికి చాటిచెప్పినట్లు తెలిపారు. నాగరికత ధైర్యానికి, విడదీయలేని భక్తికి నిదర్శనంగా సోమనాథ్ నేడు సగర్వంగా నిలిచి ఉందని పేర్కొంటూ.. మహాదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘పవిత్రమైన సోమనాథ ఆలయపు ఎత్తయిన శిఖరంపై సగర్వంగా రెపరెపలాడుతున్న పవిత్ర ధర్మధ్వజం దేశ అచంచల విజయానికి ప్రతీక. ఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి చైతన్యంగా, దైవిక ప్రకటనగా కూడా కనిపిస్తోంది. సోమనాథ్ శిఖరాగ్రాన ఉన్న ఈ కాషాయ పతాకం మన విడదీయలేని భక్తికి సజీవ విజయగాథ. ఇది పత్రి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తూ.. దేశ కీర్తిని శాశ్వతంగా ఆలపిస్తూనే ఉంటుంది’’
‘‘వెయ్యేళ్ల క్రితం సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగింది. మన నేల స్వరూపాన్ని నాశనం చేయగలమని భావించిన వారు అప్పట్లో పదేపదే దాడులకు తెగబడ్డారు. కానీ వారి నమ్మకం తప్పయింది. భరతమాత అత్యంత పరాక్రమవంతులైన బిడ్డల పుణ్యమా అని సోమనాథ్ పదేపదే పునర్నిర్మాణం అవుతూనే వచ్చింది.
సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దాడులు చేసిన వారు చరిత్ర గర్భంలో కలిసిపోయారు. కానీ భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంది.
నేడు సోమనాథ్ మన నాగరికత ధైర్యానికి, మన అచంచలమైన భక్తికి నిదర్శనంగా సమున్నతంగా, శాశ్వతంగా నిలిచి ఉంది. ఆ మహాదేవుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను’’
‘‘నేడు తీసిన సోమనాథ్ దేవాలయ దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు’’
***
पवित्र सोमनाथ मंदिर के गगनचुंबी शिखर पर गर्व के साथ लहराता पावन ध्वज भारतवर्ष की आस्था की विजय का प्रतीक है। यह कोटि-कोटि भारतीयों की सामूहिक चेतना का दिव्य उद्घोष भी है। सोमनाथ के शिखर पर केसरिया ध्वज हमारी अटूट श्रद्धा की जीवंत विजयगाथा है। यह ध्वज अनंतकाल तक भारत के गौरव का… pic.twitter.com/4CsFPYioBj
— Narendra Modi (@narendramodi) May 11, 2026
A thousand years ago, the first of many attacks on Somnath took place. Those who kept engaging in such attacks believed they could shatter the ethos of our land. But, they were wrong. Thanks to fiercely courageous children of Bharat Mata, Somnath kept getting rebuilt.… pic.twitter.com/dN6qGEN4c9
— Narendra Modi (@narendramodi) May 11, 2026
Some more glimpses from Somnath today… pic.twitter.com/kp7kZd9nuh
— Narendra Modi (@narendramodi) May 11, 2026