Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 జూన్ 29వ, 30వ తేదీలలో గుజరాత్ లో పర్యటించనున్నారు.

 

ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతా లో వరుస ట్వీట్ ల ద్వారా ఏమని తెలియజేశారంటే:

 

‘‘రేపటి నుండి రెండు రోజుల పాటు నేను గుజరాత్ పర్యటనలో ఉంటాను.  అహమదాబాద్, రాజ్ కోట్, మొదాసా మరియు గాంధి నగర్ లలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటాను.

 

నా తొలి రెండు కార్యక్రమాలు సాబర్మతి ఆశ్రమంలో ఉంటాయి.  సాబర్మతి ఆశ్రమ శత వార్షికోత్సవాలలో పాలుపంచుకోవడం కోసం ఎదురుచూస్తున్నాను.  సాబర్మతి ఆశ్రమంలో జరిగే రెండో కార్యక్రమం మహాత్మ గాంధి కి గురువైన శ్రీమద్ రాజ్ చంద్ర జీ 150వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమం.

 

తరువాత నేను రాజ్ కోట్ కు వెళ్తాను.  అక్కడ సామాజిక్ అధికారిత శిబిరంలో పాల్గొంటాను;  నా దివ్యాంగ సోదర సోదరీమణులతో భేటీ అవుతాను.

 

అజి డ్యామ్ వద్ద జరిగే ఒక కార్యక్రమానికి నేను హాజరవుతాను.  అక్కడ సాగునీటి, నీటి సంబంధ కార్యక్రమాలను దేశ ప్రజలకు అంకితమిస్తాను.

 

30వ తేదీ నాడు ఉదయం మొదాసా లో వత్రక్, మజూమ్ మరియు మెస్ వో డ్యామ్ లపై ఆధారపడిన నీటి సరఫరా పథకాలను దేశ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది.

 

అనేక మంది భారతయులకు ఉపాధి మార్గంగా ఉన్నటువంటి జౌళి రంగానికి మద్దతిచ్చే పలు కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతోంది.

 

30వ తేదీ నాడు సాయంత్రం పూట నేను క్రీడలు మరియు వినోదం మేళవించినటువంటి ‘ఎరీనా ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించబోతున్నాను.’’