Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు

గుజరాత్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు

గుజరాత్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు

గుజరాత్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని సణోసరా లో సౌరాష్ట్ర నర్మద ఇరిగేషన్ (ఎస్ ఎ యు ఎన్ ఐ..సావుని) ప్రాజెక్టు ప్రారంభ సూచకంగా ఒక శిలా ఫలకాన్నిఆవిష్కరించారు.

ప్రధాన మంత్రి ఆజీ – 3 ఆనకట్ట స్థలాన్ని సందర్శించారు. ఆనకట్ట తలుపులలో నుండి జలాలు విడుదల కావడాన్ని ఆయన వీక్షించారు.

ఈ సందర్భంగా అక్కడకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జలమే రైతుకు అత్యంత ముఖ్యమైన అంశం అనే గట్టి నమ్మకం తాను ఎప్పుడూ గట్టిగా నమ్మేవాడినని ఆయన గుర్తుకు చేసుకున్నారు. రాష్ట్రంలో నీటిమట్టం పెరగడం మొదలైందని ఆయన అన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం కూడా పెద్ద సంఖ్యలో చోటు చేసుకొందని ఆయన చెప్పారు.

ఒకానొక తరుణంలో మన సైనికులకు తగినంత నీరు దొరకని కచ్ఛ్ లో సైతం పరిస్థితి ఎలా మారిపోయింది ప్రధాన మంత్రి వివరించారు.

సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టసభ సభ్యులను తాను మొదటిసారి కలుసుకుని సావుని ప్రాజెక్టుని గురించి చర్చించిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి గుజరాతీ గర్వపడేటట్లు చేసే కార్యక్రమమని ఆయన తెలిపారు.

నీటిని పొదుపుగా వినియోగించుకోవలసిన అవసరం ఉందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయదారుల సంక్షేమం కోసం పంట బీమా వంటి వేరు వేరు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ఎల్ పి జి కనెక్షన్ల కోసం తీసుకువచ్చిన ఉజ్వల పథకం, అలాగే ఎల్ ఇ డి బల్బుల పంపిణీ పథకం వంటివి ప్రజా జీవితంలో నాణ్యతను ఎలా పెంపొందిస్తున్నదీ ప్రధాన మంత్రి వివరించారు.