Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ ప్రజలకు ప్రధాన మంత్రి సందేశం


ప్రియమైన గుజరాత్ సోదర, సోదరిమణులరా..!

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు జన్మించిన రాష్ట్రంలో నిన్నటి నుంచి హింసను ఆయుధంగా వాడుకోవడం అత్యంత బాధాకరం. హింసతో ఎవరికీ మేలు చేకూరదని మన అందరికీ తెలుసు.

మనం ఐక్యంగా ఉండి సమష్ఠిగా ముందడుగులు వేసినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మనం ప్రగాఢంగా విశ్వసించాం. నా సోదర, సోదరిమణులకు ఈ సమయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమయంలో మన అందరిదీ ఒకే మంత్రం కావాలి. అదే శాంతి మంత్రం.

ప్రజా స్వామ్య స్ఫూర్తిని మనం అంతా పాటించాలి. చర్చల ద్వారా సమస్యల పరిష్కారించుకోవాలి. అందుకోసం కలసి పనిచేయాలి. గుజరాత్ ను అభివృద్ధి లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో అందరూ భాగస్వాములు కావాలి. ఇది గుజరాత్ సోదర, సోదరిమణులందరికీ నేను చేస్తున్న వినమ్ర పూర్వక విజ్ఞప్తి.