Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ ముఖ్యమంత్రి తో కలసి కరవు,నీటి ఎద్దడి స్థితి పై ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపిన ప్రధాన మంత్రి

గుజరాత్ ముఖ్యమంత్రి తో కలసి కరవు,నీటి ఎద్దడి స్థితి పై ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపిన ప్రధాన మంత్రి


గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో కరవు మరియు నీటి ఎద్దడి స్థితి పై ఈ రోజు ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీ బెన్ పటేల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం మరియు గుజరాత్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జలసంరక్షణకు, నీటి వనరుల నిర్మాణానికి మరియు నీటి మట్టాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ, 42.3 బిలియన్ ఘనపుటడుగుల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న 1.68 లక్షల చెక్ డామ్ లు, 2.74 లక్షల వ్వవసాయ నీటి కుంటలు, 1.25 లక్షల బోరీ బంద్ లను పూర్తి చేసినట్లు, తత్ఫలితంగా 6.32 లక్షల హెక్టార్లకు ప్రయోజనం కలిగిందన్నారు.

రాష్ట్రంలోని కుటుంబాలలో 77 శాతం కుటుంబాలకు గొట్టపు మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వరుసగా రెండో సంవత్సరం కూడా వర్షపాతం తగినంతగా లేకపోయినప్పటికీ, స్టేట్ వాటర్ గ్రిడ్ దిశగా చేపట్టిన ప్రయత్నాల కారణంగా కొన్ని మారుమూల ప్రాంతాలకు నీటి సరఫరా కోసం 568 ట్యాంకర్లు మాత్రమే అవసరమయ్యే స్థితి ఉత్పన్నమైంది. ఈ విధమైన కృషి చేసినందుకు ప్రధాన మంత్రి అభినందిస్తూ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఎంతమాత్రం మళ్లకుండానే మంచినీటి అవసరాలను తీర్చేందుకు తదుపరి చర్యలు చేప్టట్టవలసిందిగా పిలుపునిచ్చారు.

సూక్ష్మం సేద్యం రంగంలో రాష్ట్రం గణనీయ పురోగతిని సాధించింది. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పరిధిని 3,789 గ్రామాలకు పూర్తిగా 100 శాతం స్థాయిలో అందించారు.

తగినంతగా వర్ష పాతం లేకపోయినా (దీర్ఘ కాల సగటులో దాదాపు 80 శాతం వరకే వర్షాలు కురిశాయి), వర్షపాతం కొన్ని ప్రాంతాలలోనే నమోదు అయినా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరవును వీలయినంత మేరకు ఎదుర్కొన్నట్లు అయ్యింది. వరుసగా రెండు సంవత్సరాల పాటు దుర్భిక్షం తలెత్తినా, రాష్ట్రంలో పంటల ఉత్పాదకత సాధారణ స్థాయిలో 90 శాతం మేరకు ఉంటుందని అంచనా వేశారు.

సర్దార్ సరోవర్ సేద్యపు నీటి పథకంలో భాగంగా విస్తారంగా కాలువల నిర్మాణాన్ని చేపట్టడం వల్ల పంట దిగుబడులు చెప్పుకోదగిన స్తాయిలో మెరుగయ్యాయి. వ్వవసాయ రాబడి సైతం అధికం అయ్యింది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి జోక్యం చేసుకుంటూ, ఉద్యాన పంటలు, ఇంకా వాణిజ్య పంటల కు విలువను జోడించటంపై శ్రధ్ద తీసుకోవాలని సూచించారు.

చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, సముద్ర జాతి మొక్కల పెంపకంలో పురోగతిని సాధించే దిశగా చేపట్టవలసిన చర్యలను గురించి కూడా సమావేశంలో చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేయాలనే తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.