Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని బనస్ కాంత జిల్లా లో జున్ను కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ; రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు

గుజరాత్ లోని బనస్ కాంత జిల్లా లో జున్ను కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ; రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని దీసా లో బనస్ కాంత సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (బనస్ డెయిరీ) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

బనస్ డెయిరీ స్వర్ణోత్సవ సంవత్సర వేడుకల ప్రారంభ సూచకంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పాలంపూర్ లో జున్ను యంత్రాగారం మరియు పాల విరుగుడు తేటను ఎండబెట్టే యంత్ర సమూహం ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని రిమోట్ కంట్రోల్ పరికరం ద్వారా ఆవిష్కరించారు.

భారీ సందోహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఉత్తర గుజరాత్ యొక్క వ్యవసాయదారులు వారి శక్తి సామర్థ్యాలు ఎటువంటివో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

బిందు సేద్యం ఈ ప్రాంత వ్యవసాయదారులకు ఎంతటి విస్తృత‌ ప్రయోజనాలను అందించిదీ ప్రధాన మంత్రి గుర్తుచేశారు.

“ఇక్కడి రైతులు పాడి వైపునకు, పశు సంవర్ధకం వైపునకు మళ్లారు. ఇది వారికి లాభాలను పంచిపెట్టింది” అని ఆయన అన్నారు. ‘శ్వేత క్రాంతి’ తో పాటు ‘స్వీట్ క్రాంతి’ కూడా చోటు చేసుకొంది. ఎలాగంటే, ఇప్పుడు ప్రజలకు తేనె ఉత్పత్తులను తయారు చేయడాన్ని గురించి కూడా శిక్షణ ఇస్తున్నారు అని శ్రీ మోదీ చెప్పారు.

నోట్ల చట్టబద్ధత రద్దు గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉగ్రవాదుల బాహవులను మరియు నకిలీ కరెన్సీ కూటవ్యవహారాలలో నిమగ్నమైన వారి బాహువులను బలహీనపరచడంలో కృత‌కృత‌్యురాలయిందన్నారు.

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అలుపెరగకుండా పనిచేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇ-బ్యాంకింగ్ మరియు ఇ-వ్యాలెట్ లను ఉపయోగించవలసిందంటూ ఆయన ప్రజలను ప్రోత్సహించారు. భారతదేశం పురోగమించాలని కోరుకొంటోందని, అందుకోసం అవినీతి మరియు నల్లధనం వంటి దుష్టశక్తులు అంతమై తీరాలని ఆయన అన్నారు.

***