Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని వాసద్ లో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ వాటర్ కన్ సర్వేశన్ (ఐఐఎస్ డబ్ల్యుసి) యొక్క స్థలాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కు బదలాయించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్ లో భాగంగా ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ వాటర్ కన్ సర్వేశన్ (ఐఐఎస్ డబ్ల్యుసి)కి గుజరాత్ లోని ఆనంద్ జిల్లా వాసద్ లో ఉన్న 4.64 హెక్టార్ల (46384 చ. మీటర్ల) భూమిని 12.67 కోట్ల రూపాయల పరిహారం చెల్లించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఎఐ)కి బదలాయించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని ఎన్ హెచ్-8 లో భాగంగా ఉన్న అహమదాబాద్- వడోదర హైవే ను విస్తరించేందుకు మరియు దానిని ఆరు లేన్ ల రహదారిగా చేసేందుకు వినియోగించనున్నారు.

ఎన్ హెచ్-8 వడోదరను, అహమదాబాద్ ను కలిపే ముఖ్యమైనటువంటి ఒక హైవే. ఎన్ హెచ్-8లో ఒక భాగమైన అహమదాబాద్- వడోదర సెక్షన్ విస్తరణ పనులను చేపట్టడం మరియు ఆరు లేన్ లు కలిగినటువంటిదిగా మలచేందుకు ఈ భూమి బదలాయింపును ఉద్దేశించారు. దీని వల్ల ఆ ప్రాంతంలో అవస్థాపన, రవాణా, కమ్యూనికేషన్, ఉపాధికల్పన సంబంధ అవకాశాలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నిర్ణయం వృద్ధి వేగాన్ని పెంచేందుకు కీలక రంగాలలో అవస్థాపనకు ఊతం ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో ఒక భాగంగా కూడా ఉంది.

***