Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్ లోని స‌ర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట వ‌ద్ద జ‌రిగిన‌ ‘న‌మామి న‌ర్మ‌ద’ ఉత్స‌వాని కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఈ రోజు న జ‌రిగిన ‘న‌మామి న‌ర్మ‌ద’ ఉత్స‌వం లో పాలు పంచుకొన్నారు.  ఆన‌క‌ట్ట యొక్క జ‌లాశ‌యం పూర్తి సామ‌ర్ధ్యం అయినటువంటి 138.68 మీట‌ర్ల వ‌ర‌కు నీటి ని నింపిన సంద‌ర్భాని కి గుర్తు గా ఈ ఉత్సవాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్వ‌హిస్తున్నది.  2017వ సంవ‌త్స‌రం లో ఆన‌క‌ట్ట యొక్క ఎత్తు ను పెంచినప్పటి నుండి మొట్టమొదటి సారి గా సెప్టెంబ‌ర్ 16వ తేదీ సాయంత్రం కల్లా నీటిమ‌ట్టం దాని అత్య‌ధిక స్థాయి కి చేరుకొన్నది.  గుజ‌రాత్ కు జీవనరేఖ అయిన న‌ర్మ‌ద న‌ది జ‌లాల‌ కు స్వాగ‌తం ప‌ల‌క‌డం కోసం ఆన‌క‌ట్ట ప్ర‌దేశం వ‌ద్ద జ‌రిగిన అర్చ‌న లో ప్ర‌ధాన మంత్రి తాను కూడా పాల్గొన్నారు.

త‌ద‌నంత‌రం, ప్ర‌ధాన మంత్రి ఖ‌ల్‌వానీ ఇకో టూరిజ‌మ్ ప్ర‌దేశాన్ని, ఇంకా కేక్ ట‌స్ గార్డెన్ ను సంద‌ర్శించారు.  కేవ‌డియా లో బ‌ట్ట‌ర్‌ఫ్ల‌య్ గార్డెన్ వ‌ద్ద ఒక పెద్ద గంప లో ఉంచిన సీతాకోక చిలుక‌ల ను ప్రధాన మంత్రి ఉద్యాన‌వ‌నం లోకి విడ‌చిపెట్టారు.  స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప‌రిస‌రాల లో నెల‌కొన్న ఏక్‌తా న‌ర్స‌రీ ని కూడా ఆయ‌న సంద‌ర్శించారు.  ఆ త‌రువాత, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి స‌మీపం లో ఏర్పాటైన ఒక జ‌న స‌భ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు.

‘‘స‌ర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట లో జ‌లాలు 138 మీట‌ర్ల కు పైబ‌డి పెర‌గ‌డాన్ని వీక్షించే భాగ్యం నాకు ద‌క్కింది.  స‌ర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ కు ఒక ఆశాకిర‌ణం గా ఉంది.  ఇది కష్టించి ప‌ని చేసే ల‌క్ష‌లాది రైతుల కు ఒక వ‌రం’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద‌ కు త‌ర‌లి వ‌స్తున్న ప‌ర్య‌ట‌కుల ను స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ వద్దకు  వెళ్తున్న పర్యటకుల‌ తో ప్ర‌ధాన మంత్రి పోల్చుతూ, ‘‘ఆవిష్క‌ర‌ణ జ‌రిగిన 11 నెల‌ల కాలం లోపే స్టాట్యూ ఆఫ్ యూనిటీ 133 సంవ‌త్సరాల వ‌య‌స్సు క‌లిగిన స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ తో దాదాపు స‌మానం గా ప‌ర్య‌ట‌కుల‌ ను ఆక‌ర్షిస్తోంది.  గుజ‌రాత్, కేవ‌డియా లు ప్ర‌పంచ ప‌ర్య‌ట‌క ప‌టం లోకి ఎక్కాయంటే అందుకు కార‌ణం స్టాట్యూ ఆఫ్ యూనిటీ యే.  దేశం నుండి మరియు ప్రపంచం అంతటి నుండి 23 లక్ష‌ల మంది కి పైగా ప‌ర్య‌ట‌కులు గ‌డ‌చిన 11 మాసాల కాలం లో ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించార‌న్న విష‌యం నా దృష్టి కి వ‌చ్చింది’’ అన్నారు.  స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ ప్ర‌తి రోజు స‌గ‌టు న 10,000 మంది ప‌ర్య‌ట‌కుల‌ ను ఆక‌ట్టుకుంటోంది.  అయితే, అది 133 సంవ‌త్స‌రాల పాత‌ద‌న్న అంశాన్ని మీరు దృష్టి లో పెట్టుకోవాలి.  మ‌రోవైపు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ కేవ‌లం 11 నెల‌ల క్రితం ఆవిష్క‌రింపబ‌డింది.  అయిన‌ప్ప‌టి కీ కూడా ఇది ప్ర‌తి రోజూ 8,500 మంది కి పైగా ప‌ర్య‌ట‌కుల ను ఆక‌ర్షిస్తోంది.  ఇది ఒక అద్భుతం అని ఆయ‌న అన్నారు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని 2018 వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 31వ తేదీ నాడు దేశ ప్ర‌ప్ర‌థ‌మ హోం మంత్రి జ‌యంతి కి సూచ‌కం గా ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ప్రారంభించ‌డమైంది.

స‌ర్ దార్ ప‌టేల్ యొక్క‌  దార్శ‌నిక‌త ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసిస్తూ, జ‌మ్ము- క‌శ్మీర్ విష‌యం లో ప్ర‌భుత్వం గ‌డ‌చిన నెల లో తీసుకొన్న నిర్ణ‌యం భార‌త‌దేశ పూర్వ హోం మంత్రి నుండి పొందిన‌టువంటి స్ఫూర్తి  తో కూడుకొన్న‌దని తెలిపారు.  రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు గా విభ‌జించాల‌న్న నిర్ణ‌యం స‌ర్ దార్ ప‌టేల్ నుండి పొందిన ప్రేర‌ణ అని, ద‌శాబ్దాల నాటి ఒక స‌మ‌స్య కు ప‌రిష్కారాన్ని అన్వేషించేందుకు చేప‌ట్టిన ఒక ప్ర‌య‌త్నమని ఆయ‌న వివ‌రించారు.  జ‌మ్ము, క‌శ్మీర్, ఇంకా లద్దాఖ్  ల‌కు విశ్వాసాన్ని మ‌రియు స‌మృద్ధి ని తీసుకొని రాగ‌ల‌మ‌న్న విశ్వాసం త‌న‌లో ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగ క్ర‌మం లో,  ‘‘భార‌త‌దేశం యొక్క ఆధిక్యం మ‌రియు ఏక‌త ల పట్ల మీ సేవ‌కుడు పూర్తి నిబ‌ద్ధ‌త తో ఉన్నాడు.  ఈ నిబ‌ద్ధ‌త ను గ‌డ‌చిన 100 రోజుల‌ కు పైగా మేము పటిష్టపరచాము.  నూత‌న ప్ర‌భుత్వం ఇదివరకటి క‌న్నా వేగ‌వంతంగా పని చేస్తుంది; ఇదివరకటి క‌న్నా పెద్ద పెద్ద ల‌క్ష్యాల‌ ను సాధిస్తుంది’’ అన్నారు.
 

**