Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్ లో జ‌రిగిన ప్రాణ న‌ష్టాని కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


గుజ‌రాత్ లోని వివిధ ప్రాంతాల లో అకాలిక వ‌ర్షాలు, ఇంకా తుఫాను ల కార‌ణం గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“గుజ‌రాత్ లో వివిధ ప్రాంతాల లో అకాలిక వ‌ర్షాలు మ‌రియు తుఫాను ల వల్ల ప్రాణ న‌ష్టం జరిగినందుకు దు:ఖిస్తున్నాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. ప‌రిస్థితి ని అధికారులు అతి నిశితం గా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్రభావితులైన వారికి చేతనైన అన్ని ర‌కాలుగాను స‌హాయాన్ని అందించ‌డం జ‌రుగుతోంది” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

గుజ‌రాత్ లోని విభిన్న ప్రాంతాల లో అకాలిక వ‌ర్షాలు మ‌రియు తుఫాను ల కార‌ణం గా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబికుల కు ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి నుండి త‌లా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్రత్యేక అనుగ్ర‌హ పూర్వక చెల్లింపు నకు ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు. గుజ‌రాత్ లోని విభిన్న ప్రాంతాల లో అకాలిక వ‌ర్షాలు మ‌రియు తుఫాను ల కార‌ణం గా గాయ‌ప‌డిన వారి కి ఒక్కొక్క‌రి కి 50,000 రూపాయ‌ల ప్రత్యేక అనుగ్రహ పూర్వక చెల్లింపు నకు కూడా ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు.