Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురుగోవింద్ సింగ్‌జీ 350 వ ప్ర‌కాష్ ప‌ర్వ్ సంద‌ర్భంగా వారిని స్మ‌రించుకున్న‌ప్ర‌ధాని


సిక్కుల ప‌ద‌వ గురువు గురుగోవింద్‌సింగ్‌జీ 350 వ ప్ర‌కాష్ పర్వ్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ , గురుగోవింద్ సింగ్‌జీకి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి,” గురుగోవింద్ సంగ్‌జీ 350 వ ప్ర‌కాష్ ప‌ర్వ్ సంద‌ర్భంగా ప‌ర‌మ‌పూజ్య గురుగోవింద్‌సింగ్‌జీకి నేను శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. వారు మూర్తీభ‌వించిన అస‌మాన ధైర్య‌శాలి, అపార జ్ఞాన ఖ‌ని.వారు చేసిన మంచిప‌నులు, వారి మ‌హోన్న‌త ఆలోచ‌న‌లు త‌ర‌త‌రాల ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తాయి. గురుగోవింద్ సింగ్‌జీ స‌మాన‌త్వ శ‌క్తిని విశ్వ‌సించారు. అన్ని ర‌కాల‌ సామాజిక వివ‌క్ష‌ను వారు వ్య‌తిరేకించారు. వారి న్యాయ‌దృష్టి, నిజాయితీ వారు అంద‌రికీ గౌర‌వ‌నీయుల‌య్యారు.”

*****