పిఎంఇండియా
నా తోడి భారతీయులారా,
క్రిందటి సంవత్సరం లో ఇదే రోజు న భారతదేశం యొక్క ప్రజాస్వామ్య చరిత్ర లో ఒక సువర్ణ అధ్యాయం ఆరంభం అయింది. అనేక దశాబ్దాల అనంతరం పూర్తి పదవీకాలం పాటు కొనసాగినటువంటి ప్రభుత్వాని కి సంపూర్ణమైన సంఖ్యాబలం కట్టబెడుతూ దేశ ప్రజలు మళ్లీ ఎన్నుకొన్నారు.
భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజల కు మరియు మన దేశం యొక్క ప్రజాస్వామ్య సభ్యత కు నేను మరో సారి శిరస్సును వంచి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.
సాధారణ కాలాల్లో, నేను మీ మధ్య ఉండేవాడిని. ఏమైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అందుకు అనుమతించడం లేదు. ఈ కారణం గానే, నేను ఈ లేఖ ద్వారా మీ యొక్క ఆశీస్సుల ను కోరుకొంటున్నాను.
మీ యొక్క ప్రేమ, సద్భావన మరియు క్రియాశీల సహకారం ఒక క్రొత్త శక్తి ని మరియు ప్రేరణ ను ప్రసాదించాయి. ప్రజాస్వామ్యం యొక్క సామూహిక బలాన్ని మీరు కళ్లకు కట్టిన తీరు యావత్తు ప్రపంచానికి దారి ని చూపేటటువంటి ఒక దీపం గా ఉన్నది.
2014 వ సంవత్సరం లో, దేశ ప్రజలు ఒక ప్రధానమైన మార్పు కోసం వోటు వేశారు. గడచిన అయిదు సంవత్సరాల లో పరిపాలన యంత్రాంగం ఏ విధం గా యథాపూర్వ స్థితి నుండి మరి అవినీతి తాలూకు బురదనేల లో నుండి అలాగే దుష్పరిపాలన బారి నుండి తనను తాను విముక్తం చేసుకొన్నదో దేశం వీక్షించింది. ‘అంత్యోదయ’ యొక్క వాస్తవిక స్ఫూర్తి కి అనుగుణం గా లక్షల కొద్దీ జీవితాల లో పరివర్తన ను తీసుకు రావడమైంది.
2014 వ సంవత్సరం నుండి 2019 వ సంవత్సరం వరకు భారతదేశం యొక్క స్థాయి అర్థవంతం గా ఉన్నతీకరించబడింది. పేదల యొక్క గౌరవాన్ని పెంపు చేయడం జరిగింది. దేశం ఆర్థిక సమ్మిళితత్వాన్ని, ఉచిత గ్యాస్ కనెక్శన్ లను మరియు విద్యుత్తు కనెక్శన్ లను, సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం తో పాటు ‘అందరికీ గృహ వసతి’ కి పూచీ పడే దిశ గా సాగింది.
భారతదేశం సర్జికల్ స్ట్రైక్ మరియు వైమానిక దాడి ల ద్వారా తన సాహసాన్ని చాటింది. అదే కాలం లో, శతాబ్దాలు గా పరిష్కారం కాకుండా ఉండిపోయినటువంటి వన్ ఒఆర్ఒపి, వన్ నేశన్ వన్ టాక్స్- జిఎస్ టి, రైతుల కోసం మెరుగైన ఎమ్ఎస్ పి వంటివి కార్యరూపాన్ని దాల్చాయి.
2019 వ సంవత్సరం లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే వోటు ను వేయలేదు; వారు భారతదేశాన్ని నూతన శిఖరాల కు తీసుకుపోవాలన్న కల తో కూడాను వోటు వేశారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక నాయకత్వ స్థానం లో ఉండేటట్టు చూడాలన్నదే ఆ స్వప్నం. గత సంవత్సర కాలం లో తీసుకొన్న నిర్ణయాలు ఈ యొక్క కల ను నెరవేర్చే దిశ గా తీసుకొన్నటువంటివే.
ఇవాళ, 130 కోట్ల మంది ప్రజలు దేశ అభివృద్ధి పయన గతి లో తాము మమేకం అయినట్లు గాను, ఏకీకృతం అయినట్లుగాను భావిస్తున్నారు. ‘జన శక్తి’ యొక్క మరియు ‘రాష్ట్ర శక్తి’ యొక్క జ్యోతులు యావత్తు దేశాన్ని వెలిగించాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే మంత్రం ఇచ్చిన శక్తి తో భారతదేశం అన్ని రంగాల లో ముందుకు కదులుతోంది.
నా తోడి భారతీయులారా,
గడచిన ఏడాది కాలం లో, కొన్ని నిర్ణయాల పై విస్తృతం గా చర్చించడం జరిగింది మరి అవి ప్రజల మస్తిష్కం లో ముద్ర వేసుకున్నాయి.
ఆర్టికల్ 370 దేశ ఏకత మరియు అఖండత ల భావన ను మరింత వర్ధిల్లజేసింది. మాన్య సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవం గా ఇచ్చినటువంటి రామ మందిరం తీర్పు, శతాబ్దాల తరబడి సాగుతున్న ఒక చర్చ కు సమరసమైన ముగింపును అందించింది. అనాగరకమైనటువంటి ముమ్మారు తలాక్ అభ్యాసాన్ని చరిత్ర అనే చెత్తబుట్ట కు పరిమితం చేయడమైంది. పౌరసత్వ చట్ట సవరణ భారతదేశం యొక్క కరుణామయ స్ఫూర్తి కి మరియు అందరి ని కలుపుకుపోయే స్ఫూర్తి కి ఒక అభివ్యక్తీకరణ గా నిలచింది.
కానీ దేశం యొక్క అభివృద్ధి వేగ గతి కి అదనపు జోరు ను జతచేసినటువంటి ఇతర నిర్ణయాలు అనేకం గా ఉన్నాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ని ఏర్పాటు చేయడమన్నది దీర్ఘ కాలం గా పరిష్కారానికి నోచుకోని ఒక సంస్కరణ గా ఉండిపోయింది. ఈ పదవి ని ఏర్పాటు చేయడం వల్ల సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే కాలం లో, భారతదేశం మిశన్ గగన్ యాన్ కై సన్నాహాల ను ముమ్మరం చేసింది.
పేదల కు, రైతుల కు, మహిళల కు, యువత కు సాధికారిత కల్పన మా యొక్క ప్రాధాన్యం గా ఉంటోంది.
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం పరిధి లో ప్రస్తుతం రైతులు అందరి ని చేర్చడమైంది. ఒకే ఒక సంవత్సర కాలం లో 72,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులను 9 కోట్ల 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలో జమ చేయడమైంది.
జల్ జీవన్ మిశన్ 15 కోట్ల కు పైగా గ్రామీణ ప్రాంత కుటుంబాలకు గొట్టపు మార్గ కనెక్శన్ ల ద్వారా త్రాగు నీటి సరఫరా కు పూచీ పడనున్నది.
యాభై కోట్ల కు పైగా ఉన్నటువంటి మన పశుగణానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసమని వాటి కి టీకామందు ను ఉచితం గావేసే కార్యక్రమాన్ని భారీ స్థాయి లో నిర్వహించడం జరుగుతోంది.
మన దేశ చరిత్ర లో మొట్టమొదటి సారి గా రైతు లు, సేద్య కూలీలు, చిన్న దుకాణదారులు మరియు అసంఘటిత రంగం లోని శ్రామికుల కు 60 ఏళ్ళ వయస్సు తదనంతరం నెలవారీ గా క్రమం తప్పక 3000 రూపాయల నియమిత నెలవారీ పింఛను సౌకర్యానికి పూచీపడటమైంది.
మత్స్యకారుల కోసం బాంకు రుణాల ను పొందే సౌకర్యం తో పాటు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడమైంది. చేపల పెంపకం రంగాన్ని బలోపేతం చేయడం కోసం అనేక ఇతర నిర్ణయాల ను కూడా తీసుకోవడం జరిగింది. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధిపరచగలదు.
అదే విధం గా, వ్యాపారుల సమస్యల ను సకాలం లో పరిష్కరించటానికి ఒక వ్యాపారి కల్యాణ్ బోర్డు ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. స్వయం సహాయక బృందాలతో అనుబంధం కలిగివున్న 7 కోట్ల మంది కి పైగా మహిళల కు అధిక మొత్తం లో ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. ఇటీవలే స్వయం సహాయక బృందాల కు మంజూరు చేసే పూచీకత్తు లేనటువంటి రుణాల ను ఇంత క్రితం ఇస్తున్నటువంటి 10 లక్షల రూపాయల నుండి రెట్టింపు చేసి 20 లక్షల రూపాయలకు పెంచడమైంది.
ఆదివాసీ బాలల విద్య ను దృష్టి లో పెట్టుకొని, మేము క్రొత్త గా 400 కు పైగా ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క నిర్మాణ పనులను మొదలుపెట్టాము.
గడచిన ఏడాది కాలం లో ప్రజల పట్ల మైత్రీపూర్వకం గా ఉండేటటువంటి అనేక చట్టాల ను ప్రవేశపెట్టడమైంది. ఉత్పాదకత పరంగా మన పార్లమెంటు దశాబ్దాల నాటి రికార్డు ను బద్దలు కొట్టింది. తత్పర్యవసానం గా, అది వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్ట సవరణ కావచ్చు, లేదా మహిళల కు, బాలల కు మరియు దివ్యాంగుల కు మరింత రక్షణను ఇచ్చే చట్టాలు కావచ్చు.. పార్లమెంటు లో అవి ఆమోదింపబడటాన్ని శీఘ్రతరం చేయడమైంది.
ప్రభుత్వ విధానాలు మరియు నిర్ణయాల ఫలితం గా గ్రామీణ ప్రాంతాల కు మరియు పట్టణ ప్రాంతాల కు మధ్య అంతరం కుదించుకుపోతున్నది. ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్న భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల నివాసుల సంఖ్య భారతదేశం లోని పట్టణ ప్రాంత నివాసుల సంఖ్య కంటే 10 శాతం అధికం గా ఉంది. ఇటువంటి పరిణామం ఆవిష్యారం కావడం ఇదే తొలి సారి.
దేశ ప్రయోజనాల ను దృష్టి లో పెట్టుకొని తీసుకున్న అటువంటి చరిత్రాత్మక చర్య లు మరియు చరిత్రాత్మక నిర్ణయాల జాబితా ను ఈ లేఖ లో పేర్కొనాలంటే అది సుదీర్ఘం గా ఉంటుంది. కానీ నేను ఒకటి తప్పక చెప్పి తీరాలి; అది ఏమిటి అంటే- ఈ నిర్ణయాల ను తీసుకొంటూ మరియు వాటి ని అమలు పరుస్తూ ఈ సంవత్సర కాలం లోని ప్రతి రోజూ ఇరవైనాలుగు గంటలూ నా ప్రభుత్వం పూర్తి అప్రమత్తత తో కృషి చేసింది- అనేదే.
నా తోడి భారతీయులారా,
మన దేశ ప్రజల ఆశల ను మరియు ఆకాంక్షల ను నెరవేర్చడానికి మనం వేగం గా అడుగులు వేస్తుంటే, కరోనావైరస్ విశ్వమారి మన దేశాన్ని కూడా కమ్ముకొంది.
ఒక వైపు గొప్ప ఆర్థిక వనరులు కలిగినటువంటి మరియు అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలు కలిగివున్నటువంటి శక్తులు, మరో వైపు విస్తారమైనటువంటి జనాభాకు తోడు పరిమిత వనరుల నడుమ సమస్యలతో చుట్టుముట్టబడిన మన దేశం నిలచివున్నాయి.
కరోనా భారతదేశాన్ని ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచాని కి ఒక సమస్య గా మారుతుందని చాలా మంది భయపడ్దారు. కానీ ప్రస్తుతం, అచ్చమైన హుషారుతనం మరియు పరిపూర్ణ విశ్వాసం వంటి వాటి ద్వారా మీరు ప్రపంచం మనకేసి చూస్తున్న తీరు ను మార్చివేయ గలిగారు. భారతీయుల యొక్క సామూహిక బలం మరియు భారతీయుల యొక్క సంభావ్యత ప్రపంచం లోని శక్తిమంతమైన మరియు సుసంపన్నమైన దేశాల తో పోల్చి చూసినప్పుడు సాటిలేనివి అని మీరు నిరూపించారు. కరోనా యోధుల గౌరవార్థం కరతాళ ధ్వనులను చేయడం కావచ్చు, లేదా ఒక దివ్వె ను వెలిగించడం కావచ్చు, భారత సాయుధ దళాల ద్వారా కరోనా యోధుల ను సమ్మానించడం కావచ్చు, జనతా కర్ఫ్యూ కావచ్చు, లేదా దేశవ్యాప్త లాక్ డౌన్ కాలం లో నిర్దేశిత నియమావళి ని నిష్ఠ గా పాటించడం కావచ్చు.. ప్రతి ప్రతి సందర్భం లో మీరు ఏక్ భారత్ ఒక్కటే శ్రేష్ఠ్ భారత్ కు పూచీకత్తు అని రుజువు చేశారు.
ఇంతటి భారీ సంకటం లో, కచ్చితం గా ఎవరూ, ఎటువంటి అసౌకర్యానికి గాని లేదా కష్టాని కి గాని లోనవలేదని బల్లగుద్ది వాదించలేము. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తుల వారు, ఇంకా చిన్న తరహా పరిశ్రమల లో పనులు చేసే హస్త కళాకారులు, బండిల పై సరకులు పెట్టుకొని వీధుల లో తిరిగి విక్రయించుకొనే వారు మరియు అటువంటి తోటి దేశవాసులు అంతులేనటువంటి కష్టాల పాలయ్యారు. వారి కష్టాలను తీర్చడం కోసం మనమంతా కలసికట్టుగా కృషి చేస్తున్నాము.
కానీ, మనం ఎదుర్కొంటున్నటువంటి అసౌకర్యాలు అనర్థాలు గా మారిపోకుండా మనం శ్రద్ధ వహించాలి. అందుకు గాను, అన్ని మార్గదర్శకాలను మరియు నిబంధనలను పాటించడం భారతదేశం లో ప్రతి ఒక్కరి కి చాలా ముఖ్యం. మనం ఇప్పటి వరకు ఓరిమిని చాటాము మరి మనం దీనిని అదే మాదిరి గా కొనసాగించాలి.
అనేక ఇతర దేశాల కంటే సురక్షితమైన మరియు మెరుగైన స్థితి లో భారతదేశం ఉండటానికి గల ముఖ్యమైన కారణాల లో ఇది ఒక కారణం. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం. కానీ మనం ఇప్పటికే గెలుపు బాట లో సాగడం మొదలుపెట్టాము మరి విజయమే మన సమష్టి సంకల్పంగా ఉంది.
గడచిన కొద్ది రోజుల లో, ఒక పెనుతుఫాను పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా లలోని కొన్ని ప్రాంతాలపై విరుచుకుపడింది. ఆ సందర్భం లోనూ, ఈ రాష్ట్రాల ప్రజలు కనబరచినటువంటి స్థితిస్థాపకత గుర్తుంచుకోదగ్గది. వారి ధైర్యం భారత ప్రజల కు ప్రేరణాత్మకమయ్యేదే.
ప్రియమైన మిత్రులారా,
అటువంటి కాలం లో భారతదేశం సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థ లు ఎలా కోలుకుంటాయి అనే అంశం పై చర్చ విస్తృతమైన స్థాయి లో జరుగుతోంది. కానీ, కరోనా వైరస్ తో పోరాడటం లో భారతదేశం తన ఏకత్వం తో మరియు సంకల్పం తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన తీరు ను పట్టి చూస్తే, ఆర్థికం గా కోలుకోవడం లో కూడాను మనం ఒక ఉదాహరణ ను అందించగలమన్న గట్టి నమ్మకమొకటి నెలకొన్నది. ఆర్థిక రంగం లో 130 కోట్ల మంది భారతీయులు వారి యొక్క బలం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఒక్కటే కాకుండా ప్రపంచానికి ప్రేరణ ను సైతం అందించగలుగుతారు.
మనం స్వయం సమృద్ధం కావలసినటువంటి తరుణం ఇది. మనం మన స్వీయ సామర్థ్యాలతో, మనదైన పంథా లో ముందుకు సాగవలసివుంది. మరి అదొక్కటే ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించగలిగే మార్గం గా కనుపిస్తోంది.
‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ కోసం ఇటీవల ఇచ్చినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఈ దిశ లో వేసిన ఒక పెద్ద అడుగు గా ఉంది.
ఈ కార్యక్రమం భారతదేశం లో ప్రతి ఒక్కరి కి- వారు మన రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, చిన్న నవ పారిశ్రామికులు కావచ్చు లేదా స్టార్ట్- అప్ లతో అనుబంధం కలిగిన యువత కావచ్చు- వారందరికీ అవకాశాల తో కూడిన ఒక నూతన శకాన్ని ఆవిష్కరిస్తుంది.
భారతదేశం యొక్క నేల తాలూకు పరిమళం మరియు మన శ్రామికుల స్వేదం, కఠోర శ్రమ, ఇంకా ప్రతిభ ల కలయిక భారతదేశం దిగుమతుల పై ఆధారపడడాన్ని తగ్గించివేసుకొని మరి స్వయం సమృద్ధి దిశ గా సాగేటటువంటి ఉత్పాదనల ను తయారు చేసేటట్లు చూస్తుంది.
ప్రియమైన మిత్రులారా,
గడచిన ఆరు సంవత్సరాల ఈ ప్రయాణం లో, మీరు నా మీద నిరంతరాయం గా ప్రేమ ను కురిపించి మరి నన్ను దీవించారు.
మీ ఆశీర్వాదాల బలమే దేశాన్ని చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని, గడచిన సంవత్సరం కాలం లో శీఘ్రం గా పురోగమిచేటట్టు చేసింది. అయినప్పటికీ కూడాను, చేయవలసింది ఇంకా చాలా ఉందన్న సంగతి ని నేను కూడా ఎరుగుదును. మన దేశం ఎదుర్కొంటున్న సమస్య మరియు సవాళ్ళు అనేకం ఉన్నాయి. నేను రేయింబవళ్ళు పనిచేస్తున్నాను. నాలో లోపాలు ఉండవచ్చును కానీ, మన దేశం లో లేనిది అంటూ ఏదీ లేదు. మరి అందుకే, మీ పట్ల నాకు నమ్మకం ఉంది. మీ మీద, మీ బలం మీద మరియు మీ యొక్క సామర్థ్యాల మీదనే నేను స్వయం గా నా కన్నా కూడా అధికమైనటువంటి విశ్వాసాన్ని నిలుపుకొన్నాను.
నా సంకల్పం యొక్క శక్తి మీరు, మీ యొక్క మద్దతు, మీ ప్రేమ, ఇంకా మీ ఆశీర్వాదాలూను.
ప్రపంచవ్యాప్త వ్యాధి కారణం గా ఇది సంక్షోభ కాలమే అయినప్పటికీ, మన భారతీయుల కు ఇది దృఢ సంకల్పాన్ని పూనవలసినటువంటి కాలం కూడాను.
130 కోట్ల మంది భారతీయుల వర్తమానాన్ని మరియు భవిష్యత్తు ను ఎటువంటి ప్రతికూలత ఆజ్ఞాపించలేవు అన్న సంగతి ని మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
మన వర్తమానాన్ని మరియు మన భవిష్యత్తు ను మనం స్వయం గా నిర్ణయించుకొందాము.
మనం ప్రగతి పథం లో ముందుకు సాగిపోదాము మరి జయం మనదే అవుతుంది.
మన వాళ్లు
‘కృతమ్ మే దక్షిణే హస్తే,
జయో మే సవ్య ఆహితః’ అని అంటారు.
ఈ మాటల కు- ఒక చేత కార్యాచరణ మరియు విధి నిర్వహణ ఉంటే, రెండో చేతి లో విజయం ఖాయం- అని భావం.
మన దేశం యొక్క విజయం కోసం ప్రార్థన లు చేస్తూ, మీకునేను మరో సారి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.
మీకు మరియు మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆరోగ్యం గా ఉండండి, సురక్షితం గా ఉండండి.
అప్రమత్తం గా ఉండండి, సమాచారాన్ని తెలుసుకొని మరీ ముందంజ వేయండి.
మీ ప్రధాన సేవకుడు,
నరేంద్ర మోదీ
**
Penned a letter to my fellow citizens.
— Narendra Modi (@narendramodi) May 30, 2020
It takes you through the year gone by and the way ahead. https://t.co/t1uHcAKkAH pic.twitter.com/Ci8TImK3CU
आज से एक साल पहले भारतीय लोकतंत्र के इतिहास में एक नया स्वर्णिम अध्याय जुड़ा। मैं इस पत्र के द्वारा आपके चरणों में प्रणाम करने और आपका आशीर्वाद लेने आया हूं....https://t.co/ZuHWB55AbN pic.twitter.com/v3GZvtFdj9
— Narendra Modi (@narendramodi) May 30, 2020
Expressing gratitude to 130 crore Indians.
Their blessings are a source of immense strength.