Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని

గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని


గౌరవ భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగే వాంగ్‌చుక్ 70వ జయంతి సందర్భంగా థింపూలోని చాంగ్‌లిమిథాంగ్ స్టేడియంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో.. భూటాన్ రాజురాజకుటుంబంభూటాన్ ప్రభుత్వం, ప్రజలతో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో బాధితులకు సానుభూతి తెలుపుతూ భూటాన్ రాజు నేతృత్వంలో ఈ సందర్భంగా సామూహిక ప్రార్థన చేశారు.

సభనుద్దేశించి ప్రసంగించిన శ్రీ నరేంద్ర మోదీ.. గౌరవ నాలుగో రాజుకుభూటాన్ ప్రజలకు భారతీయుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పాలన కాలంలోనే ఆధునిక జాతీయ ప్రభుత్వంగా, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రాజ్యంగా భూటాన్ అవతరించిందని కొనియాడారు. ఆర్థిక వృద్ధిని, సుస్థిరతను మేళవించే ‘స్థూల జాతీయానందం’ అనే విశిష్ట భావన నాలుగో రాజు నేతృత్వంలోనే భూటాన్‌లో మొదలైందన్నారు.

భారత్, భూటాన్ ప్రత్యేక మైత్రి కోసం అమూల్య కృషి చేసిన గౌరవ భూటాన్ నాలుగో రాజుకు భారత ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని రంగాల్లో భారత్  భూటాన్ భాగస్వామ్యాన్ని వ్యక్తిగత శ్రద్ధతో కొన్నేళ్లుగా ఆయన తీర్చిదిద్దారన్నారు. మహారాజు మార్గనిర్దేశం, ఉపయోగకరమైన సూచనలతో ఈ సంబంధం ఇరుపక్షాలకూ లాభదాయకంగా కొనసాగుతుందని భారత ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గౌరవ భూటాన్ రాజు తన దార్శనికత, నిరంతర కృషితో.. గౌరవ నాలుగో రాజు విశిష్ట వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని భారత ప్రధానమంత్రి ప్రశంసించారు. మహారాజు నేతృత్వంలో భూటాన్ అద్భుత పురోగతి సాధించిందని.. అలాగే  భారత్ – భూటాన్ మధ్య శాశ్వత స్నేహం, సన్నిహిత భాగస్వామ్యం నెలకొన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు (లింకు)

 

***