Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్రామీణ విద్యుతీకరణ మరియు సౌభాగ్య లబ్ధిదారులతో సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం


దేశం లో తొలి సారిగా విద్యుత్తు వెలుగులు నిండిన 18 వేల గ్రామాలకు చెందిన మిత్రులందరినీ ఈ రోజు నేను కలుసుకునే అవకాశం దక్కింది.  అసలు విద్యుత్తు వెలుగులు తమకు వస్తాయా, లేదా అనే సందిగ్ధంలో శతాబ్దాలుగా వారు అంధకారం లోనే మగ్గుతూవచ్చారు.  మీ అందరి ఆనందంలోనూ పాలు పంచుకునే అవకాశం ఈ రోజు నాకు చిక్కినందుకు నేను సంతోషిస్తున్నాను.  మీ అందరి ముఖాలలో చిరు నవ్వు, విద్యుత్తు మీ జీవితాలలో ఎటువంటి మార్పును తెస్తుందో అన్న చర్చ కు ప్రాధాన్యం ఉంది.   జన్మించిన రోజు నుండి వెలుగులనే చూస్తూ అసలు చీకటి అంటే ఏమిటో తెలియని వారికి చీకట్ల యొక్క అర్ధం  ఏమిటన్నది తెలియదు.  గ్రామం అంటేనే తెలియదు.  ఉపనిషత్తులలో ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నారు.  ఈ మాటలకు- చీకట్లు తొలగిపోవాలి, అంతటా వెలుగులు ప్రసరించాలి- అని అర్థం. 

చీకటి నుండి వెలుగులోకి వచ్చిన వారందరితో భేటీ అయ్యే అదృష్టం నాకు కలిగింది.  ఏళ్ల తరబడి నిరీక్షించినా గ్రామాలకు వెలుగులు రాలేదు.  మనలో ప్రతి ఒక్కరికీ రోజు లో 24 గంటలు ఉంటాయి.  ఆ సమయాన్ని మన పురోగతి కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం పురోగతి కోసం ఉత్పాదకంగా వినియోగించుకుందామని అనుకుంటాం; కానీ, ఆ 24 గంటలలో 10 గంటలో లేదా 12 గంటలో వృథా అవుతుంటే ఏం చేసేది?  మిగతా 12 గంటలు లేదా 14 గంటలలో ఆ పని ని మనం చేయగలమా ? మోదీ గారు అడుగుతున్న ప్రశ్న ఎలా ఉందో! అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చును.  కానీ, దేశం లోని మారుమూల ప్రాంతాలలో మరియు వెనుకబడిన ప్రాంతాలలో వేలాది గ్రామాలకు చెందిన లక్షలాది కుటుంబాల వారు దశాబ్దాలుగా ఇలాంటి జీవితాన్నే గడుపుతున్నారు.  స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడకు వెలుగులు రాలేదు.  సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని మాత్రమే చూస్తూ వారు మనుగడ సాగిస్తున్నారు.  పిల్లల చదువులు కావచ్చు, వండుకోవడం కావచ్చు, వడ్డించడం కావచ్చు.. సూర్యుని వెలుగులే వారి పని వేళలను శాసిస్తాయి. స్వాత్రంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ?  మేం ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయానికి ఇంకా అలాంటివి 18 వేల గ్రామాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు.  గత కాలపు ప్రభుత్వాలు ఈ పల్లెలలో చీకట్లు పారదోలలేక పోయాయంటే ఆశ్చర్యం కదా ?  విద్యుతీకరణ ను గురించి గత ప్రభుత్వాలు ఎన్నో హామీలను ఇచ్చాయి.  కానీ వాటిని నెరవేర్చలేక పోయాయి.  13 సంవత్సరాల క్రితం 2005 వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  అప్పట్లో ప్రధానిగా మన్ మోహన్ సింగ్ గారు ఉన్నారు.  2009 కల్లా దేశం లో అన్ని గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తానని ఆయన హామీని ఇచ్చారు.  ఆయనే కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా అవే మాటలు ఆడారు.  కానీ ఆ హామీలను ఎప్పటికీ నెరవేర్చలేదు.  ఏ ఒక్కరూ ఆ హామీ ని గంభీరం గా తీసుకోలేదు.  అయితే. మేము ఆ హామీ ని గంభీరంగా పట్టించుకోవడమే కాకుండా పని లో ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి మరింత మెరుగుపరచేందుకు కృషి చేశాం.  ఇంకా తెలియని లోపాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు అన్ని విషయాలను బహిరంగంగా ఉంచాం.  అందరం కష్టపడి పని చేసి మంచి ఫలితాలు సాధించాం. 

ఆగస్టు 15న ఎర్రకోట బురుజుల మీద నుండి నేను గతంలో ఈ  విషయం చెప్పాను. వేయి రోజులలో ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్తు వెలుగులను తీసుకురావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాం.  ఎటువంటి జాప్యం లేకుండా ప్రభుత్వం పని ని ప్రారంభించింది.  దానిపై ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదు.  ఉత్తరాది నుండి దక్షిణాది వరకు, తూర్పు నుండి పడమర వరకు ప్రతి ఒక్క ప్రాంతం లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన ను విస్తరించాం.  పంపిణీ వ్యవస్థ ను పటిష్ఠం చేసేందుకు ఈ పథకంలో భాగంగా వ్యవసాయదారుల కోసం ప్రత్యేక ఫీడర్ ను ఏర్పాటు చేశా.  ఉజాలా పథకాన్ని కూడా విస్తరించేందుకు వీలుగా చిన్నవైనా, పెద్దవైనా దేశంలోని అన్ని గ్రామాలూ, జనావాస ప్రాంతాలు దానితో అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 

ఏ ఒక్క గ్రామం లేదా ఆవాస ప్రాంతం ఎంత తక్కువ జనాభాను కలిగి ఉన్నదైనా వదలకుండా విద్యుత్తు సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యం తో పని చేశాం.  గ్రిడ్ తో సంధానించేందుకు వీలు లేని గ్రామాలు, ఆవాస  ప్రాంతాలలో ఆఫ్ గ్రిడ్ తో అనుసంధానం చేశాం.  అలా 2018 ఏప్రిల్ 28వ తేదీ దేశ చరిత్ర లో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. మణిపుర్ లోని  లీసాంగ్ పవర్ గ్రిడ్ తో అనుసంధానం అయిన చివరి గ్రామం.  విద్యుత్తు సరఫరా వచ్చిన చివరి గ్రామం ఆయిన లీసాంగ్  ప్రజలతో ఈ  సంభాషణ ను ప్రారంభించాలని ఈ  రోజున నేను భావిస్తున్నాను.  మొదట వారు ఏమి చెబుతారో మనం విందాం.  మణిపుర్ లోని సేనాపతి జిల్లా లో వారు ఉన్నారు. 

చూడండి, ప్రియమైన నా దేశ వాసులారా, విద్యుత్తు సరఫరా అనంతరం జీవితాలలో ఎలాంటి పరివర్తన వచ్చిందో వారు చెప్పిన మాటలు మనం ఇప్పుడే విన్నాం.  విద్యుత్తు సరఫరా ఇంతవరకు చేరని ఆ గ్రామాలన్నీ మంచు కొండలు, దట్టమైన అడవులు, నక్సలైట్లు/తీవ్ర వాద  కార్యాలపాల వల్ల కల్లోలిత ప్రాంతాలుగా వర్గీకరించిన ప్రదేశాలకు చెందినవే.  అటువంటి గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేయడం అంత  తక్కువ సవాలు ఏమీ కాదు.  వీటికి సంధానం కూడా లేకపోవడం వల్ల అక్కడకు చేరడమే పెద్ద పని.  అటువంటివి ఎన్నో గ్రామాలు ఉన్నాయి.  గుర్రాలు, గాడిదలపై మోయించి, పడవలు, హెలికాప్టర్ లు ఉపయోగించి, మనుషుల భుజాలపై మోసి సామగ్రి ని అక్కడకు తరలించవలసి వచ్చింది.  జమ్ము & కశ్మీర్ లో 35 గ్రామాలు, అరుణాచల్ ప్రదేశ్ లో 15 గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా తరలించవలసి వచ్చింది.  అది కేవలం ప్రభుత్వ విజయమో లేదా ఒక వ్యక్తి విజయమో కాదు.  అహర్నిశలు శ్రమించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న  స్థాయి ప్రభుత్యోద్యోగులది.  ఎలక్ట్రీషియన్లు, టెక్నిషియన్లు, కార్మికులు అందరూ స్వయంగా తమ భుజాలతో స్తంభాలు మోశారు.  ఈ రోజున మేం దేశం అంతటికీ  విద్యుత్తును సరఫరా చేస్తున్నాం అంటే అది వారందరి శ్రమ ఫలితం.  దేశం అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  వారికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
 
ముంబయి ని గురించి మాట్లాడితే  బహుళ అంతస్తుల భవనాలు గుర్తుకువస్తాయి.  విద్యుత్తు దీపాలతో ధగధగలాడే వీధులు కనిపిస్తాయి.  ముంబయి నగరానికి కొద్ది  దూరంలో ఎలిఫెంటా దీవి ఉంది.  పర్యాటకం పెద్ద ఆకర్షణ.  భారీ సంఖ్య లో దేశ విదేశీ పర్యాటకులు రోజూ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు.  ముంబయి కి అంత  దగ్గరగా ఉండి, పర్యాటక ప్రధాన ప్రదేశం అయినా అక్కడ కూడా కొన్ని గ్రామాలకు విద్యుత్తు సరఫరా లేదంటే నాకు ఆశ్చర్యం వేసింది.  ఆ ప్రాంతం చీకట్లలో మగ్గుతున్న విషయం పత్రికలు, టివి  ఛానెళ్లలో ప్రముఖంగా వార్త రాలేదు.  ఏ ఒక్కరూ దానిని గురించి పట్టించుకోలేదు.  ఆ ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు.  అక్కడ పనులు జరుగుతున్న సమయంలో అక్కడి ప్రజలు ఎడమ లేదా కుడి పక్కలకు చూడకుండా ముందు చూపులకు కనిపిస్తున్న ప్రాంతాలకు మాత్రమే విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేశారని మాకు చెప్పారు.  70 సంవత్సరాలుగా ఎలిఫెంటా ప్రజలు చీకట్ల లోనే గడిపారని ఏ ఒక్కరైనా ఊహించగలరా ?  సముద్ర గర్భం లో కేబుల్ వేయడం ద్వారా వారికి కూడా విద్యుత్తును అందుబాటులోకి తెచ్చాం.  ఈ రోజున ఆ గ్రామాల్లో చీకట్లన్నీ మటుమాయం అయ్యాయి.  ఆలోచన లో, సంకల్పం లో, విధానాలలో  స్పష్టత ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా సాధ్యం అవుతుంది. 
 మనం ఇప్పుడు మరో ప్రాంతానికి వెళదాం.  ఝార్ ఖంర్ఖండ్ ను చూద్దాం. 

చూడండి సోదరులు మరియు సోదరీమణులారా, 

గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు.  ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి గాని వివిధ సౌకర్యాలు గాని చోటు చేసుకోలేదు.  ఈ 18 వేల  గ్రామాలే ఇందుకు నిదర్శనం.  వాటి లోని 14,582 గ్రామాలు అంటే సుమారు 15 వేల గ్రామాలు తూర్పు  ప్రాంతంలోనే ఉన్నాయి. అందులో కూడా 5,790 గ్రామాలూ అంటే సుమారు 6 వేల  గ్రామాలు ఈశాన్య మరియు పూర్వాంచల్ ప్రాంతాలలో ఉన్నాయి. మీరు టీవీ ని చూడండి.. ఎర్ర రంగులో గుర్తు పెట్టినవన్నీ చీకట్లలో మగ్గుతున్న ప్రాంతాలే.  ఈ ప్రాంతాలు ఏవీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు కూడా కాదు.  ఇక్కడి పార్లమెంటు సీట్లు కూడా తక్కువే.  అందుకే గత ప్రభుత్వాలు వాటిని తమకు ఎటువంటి ప్రయోజనం లేని ప్రాంతాలుగా భావించాయి.  తమ రాజకీయ ప్రయోజనాలకు ఏ మాత్రం చాలని జనాభా పల్చగా ఉన్న ఈ ప్రాంతాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించేందుకు ఎటువంటి ఆసక్తి ని చూపించ లేదు.  తూర్పు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు కూడా సమాన అభివృద్ధికి నోచుకున్నప్పుడే అభివృద్ధి యానంలో దేశం వేగం అందుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. 

మా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ఇదే విశ్వాసం తో కృషి చేసి ఈశాన్య ప్రాంతాన్ని ప్రధాన అభివృద్ధి స్రవంతి లోకి తెచ్చే ప్రయత్నం చేశాం.  గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం కూడా ఇందులో భాగమే.  ఈ రోజున ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకే కాదు, దేశం లోని ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్తు అందినందుకు నాకు ఆనందంగా ఉంది.  గ్రామీణ ప్రాంతాలలో చీకట్లను పారదోలగలిగాం.  విద్యుత్తు సరఫరా తో జీవితాలలో ఎంత మార్పు వచ్చిందో మీ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది ? 
 
దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి నాకు లేఖలు వస్తూ  ఉంటాయి.  వాటిలో ప్రజలు వారి అనుభవాలను తెలియజేస్తూ ఉంటారు.  అవి చదివి నేను ఎంతో  తెలుసుకుంటూ ఉంటాను. 

గ్రామాలలో విద్యుత్తు వెలుగులు వచ్చిన తరువాత సామాన్య ప్రజల జీవితాలలో ఎటువంటి మార్పు వచ్చిందో మీరు ఊహించుకోవచ్చు.  విద్యుత్తు ఇక ఏ మాత్రం వారి జీవితాలను అదుపు చేయదు.  తమ జీవితాలను తామే శాసించుకుంటారు.  సూర్యాస్తమయం తోనే వారి జీవితాలు ఆగిపోవు.  విద్యుత్తు దీప కాంతులలో పిల్లలు పాఠాలు చదువుకోవచ్చు.  మహిళలు  రాత్రి భోజనాన్ని మధ్యాహ్నం పూటే వండుకోనక్కర లేదు.  ప్రజలకు ఆ బాధలన్నీ తొలగిపోయాయి.  రాత్రి పొద్దు పోయే వరకు మార్కెట్ లు తెరచుకుని ఉంటాయి.  మొబైల్ రీ ఛార్జి చేయించుకునేందుకు దూర  ప్రాంతాలకు వెళ్లనక్కర లేదు.  మీరు మొబైల్ ను అక్కడ వదలి రాత్రి వెళ్లి తెచ్చుకున్నప్పుడు మధ్యలో ఈ  మొబైల్ ను ఉపయోగించి ఏదైనా తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆ నింద ను మీరు మోయవలసి వస్తుంది.  జైలుకు కూడా వెళ్లాల్సి వసుంది.  జమ్ము & కశ్మీర్  ప్రజలు మనతో ఉన్నారు. వారి ప్రాంతాలకు ఎన్నో కష్ఠాలకు ఓర్చి పరికరాలను తరలించాం.  వారంతా ఏమి చెబుతారో విందాం. 

చూడండి, విద్యుత్తు సౌకర్యం అందిన తమ జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చిందో వెలది మందికి తెలుసును.  ఆ గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం తోనే సరిపోదు.  అందుకే గ్రామాల లోని ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ను కల్పిస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఈ లక్ష్యం తోనే ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన ( దీని సంక్షిప్త నామం సౌభాగ్య యోజన)ను చేపట్టాం. పట్టణాల్లో కావచ్చు లేదే పల్లె ప్రాంతాల్లో కావచ్చు విద్యుత్తు సౌకర్యం లేని ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ కనెక్షన్ ను ఇస్తాం.  ఈ పథకంలో భాగంగా నాలుగు కోట్ల విద్యుత్తు కనెక్షన్ లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  దీనిని సాధించేందుకు ఉద్యమ స్ఫూర్తి తో పని చేస్తున్నాం.  ఇప్పటి వరకు 90 లక్షల ఇళ్ళకు విద్యుత్తు కనెక్షన్ లు ఇచ్చాం.  నిరు పేద కుటుంబాలకు పూర్తి ఉచితం గాను , చెల్లించుకో గలిగిన వారికీ  10 వాయిదాల్లో సొమ్ము చెల్లించేలా కేవలం 500 రూపాయల చార్జితోను విద్యుత్ కనెక్షన్ లు ఇస్తున్నాం.  నిర్దిష్ట కాల  పరిమితిలో లక్ష్యం చేరేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం.  అక్కడికక్కడే అన్ని లాంఛనాలు పూర్తి  చేయడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరేందుకు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
 
మారుమూల ప్రాంతాలు, ప్రయాణ సౌకర్యం లేని లేదా చేరేందుకు వీలు కాని ప్రాంతాల కోసం సౌర విద్యుత్తు మరియు సౌర విద్యుత్తు ఆధారిత వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.  విద్యుత్తు తో వెలుగులే కాదు, ప్రజల్లో ఆత్మ విశ్వాసం కూడా వస్తుంది.  పేదరికాన్ని పారదోలడంలో విద్యుత్తు కీలకమైన పాత్ర ను పోషిస్తుంది.  గ్రామీణ ప్రజలు, గ్రామాల పురోగతికి దోహదపడుతుంది.  ఇప్పుడు మీరందరూ  పంచుకున్న అభిప్రాయాలలో ఇది చాలా  కీలకమైంది.  దేశం మొత్తం మీ మాటలు ఆలకించింది.  మరెన్నో ఇతర గ్రామాలు కూడా ఉన్నాయి అయితే సమయం తక్కువగా ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. నేను అక్కడ ఉండాలి. అయితే నేను కొన్ని గ్రామాలను తప్పక అభినందించాలనుకొంటున్నాను.
 
బస్తర్ కు, అలీరాజ్ పుర్ కు నమస్తే, సీహోర్  కు, నౌపడ కు నమస్తే, సీతాపుర్ కు నమస్తే.  కొన్ని సందర్భాలలో మీరు టీవీ లో చూసి ఉంటారు, పేపర్లు చదివి ఉంటారు, మా ప్రత్యర్థుల ప్రసంగాలను విని ఉంటారు, మా విపక్షం పాటకు పియానో ను వాయించే వారిని చూసి ఉంటారు.  చాలా ఇళ్ళకు విద్యుత్తు సౌకర్యం లేదని వారంతా చెబుతూ ఉంటారు.  కానీ అది మా ప్రభుత్వం మీద, మా మీద చేసిన కామెంట్ ఒక్కటే కాదు, 70 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన వారి మీద కూడా చేసిన వ్యాఖ్య అది.   చాలా పని పెండింగు లో పెట్టిన వారందరి మీద చేసిన వ్యాఖ్య.  ఆ పని పూర్తి  చేసేందుకు మేం  కృషి చేస్తున్నాం.

4 కోట్ల ఇళ్ళకు విద్యుత్తు సౌకర్యం లేదంటే ఇంత కాలం ఉంది మోదీ  ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రమే కనెక్షన్ కట్ చేసిందని అర్థం కాదు.  మొత్తం విద్యుత్తు స్తంభాలు, వైర్లు మోదీ తొలగించారని కానేకాదు.  అంతకు ముందు అవి లేవనే కదా దాని అర్ధం.  అవి ఏర్పాటు చేసేందుకు మేం  ప్రయత్నిస్తున్నాం.  అందుకే మిత్రులారా, మమ్మల్ని ఉద్దేశించి చేస్తున్న ఆ విమర్శలన్నీ వారికీ తగులుతాయి.  గ్రామాలకు వెలుగులు తెచ్చేందుకు కృషి చేసిన దిగువ స్థాయి ఉద్యోగిని కూడా మనం గౌరవించాలి.  వారిని కూడా మీరు ప్రోత్సహించాలి.  వారి సహకారంతోనే కుటుంబాల స్థాయిలో సమస్యలు కూడా తొలగుతాయి.  ప్రస్తుతం మనందరి ముందున్న కార్యాచరణ ఇదే.  సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించడమే మా పని.
 
మనందరికీ భగవంతుడు బలం ఇస్తాడని నేను విశ్వసిస్తున్నాను.  మా ధ్యేయం సుస్పష్టం.  మీ అందరి మీద మా హృదయాల్లో ఎంతో  ప్రేమ ఉంది.  మీ కోసం మేము చేస్తున్న పని చాలదు, మీ కోసం మేం  పని చేస్తూనే ఉంటాం.  మీ అందరికీ  ఇప్పుడు ఒక వీడియో ను చూపించాలనుకుంటున్నాను.  ఆ వీడియో ను చూద్దాం, ఆ తరువాత నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను.

**