Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చట్టసభల మహిళా సభ్యుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

చట్టసభల మహిళా సభ్యుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం


మహిళలే చోదకశక్తులుగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభం కావాలని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో మహిళా లెజిస్లేటర్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలే అభివృద్ధికి చోదకశక్తులు కావాలని నొక్కి చెప్పారు.

మనందరం “మహిళల అభివృద్ధి”కి అతీతంగా ఆలోచించి “మహిళా చోదక ప్రధాన అభివృద్ధి” దిశగా ఆలోచించాలని ఆయన ఉద్బోధించారు.

ఈ కార్యక్రమం నిర్వహించడంలో చూపిన చొరవకు, నాయకత్వ లక్షణాలకు స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ను .ప్రధాని అభినందించారు. ఇలాంటి సదస్సుల్లో ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడం వల్ల మరింత పరిణతి కలుగుతుందని ఆయన అన్నారు.

ఆధునిక తరంలో అత్యంత ప్రధానంగా భావిస్తున్న మల్టీ టాస్కింగ్ (సమాంతరంగా ఒకటి కన్నా ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం) సహజసిద్ధంగా మహిళల్లోనే అధికంగా ఉంటుందని ప్రధాని అన్నారు.

టెక్నాలజీ ఆధారంగా నియోజకవర్గాలతో నిరంతరం అనుసంధానమై ఉండాలని ఆయన మహిళా లెజిస్లేటర్లను కోరారు. దీనికి తన స్వంత అనుభవాన్నే ఉటంకిస్తూ తాను ప్రారంభించిన మైగవ్, నరేంద్రమోదీ యాప్ల ద్వారా ఎందరో అనుసంధానమై ఎన్నో విలువైన అనుభవాలు, ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.