Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చమురు నిల్వ మరియు నిర్వహణ లపై ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్ పిఆర్ఎల్) కు, యుఎఇ కి చెందిన అబూ ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఒసి)కి మధ్య అంతిమ ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


చమురు నిల్వ మరియు నిర్వహణ లపై ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్ పిఆర్ఎల్) కు, యుఎఇ కి చెందిన అబూ ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఒసి)కి మధ్య అంతిమ ఒప్పందం పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందం ప్రకారం, 0.81 ఎమ్ఎమ్ టి లేదా 5860000 మిలియన్ పీపాల ముడి చమురును కర్ణాటకలోని మంగళూరు లో ఉన్న ఐఎస్ పిఆర్ ఎల్ నిల్వ సముదాయానికి ఎడి ఎన్ఒసి అందజేస్తుంది.

నిల్వ చేసిన ముడి చమురులో ప్రధాన భాగం పూర్తిగా వ్యూహాత్మక అవసరాల కోసం వినియోగిస్తారు; కాగా, కొంత భాగం చమురును ఎడిఎన్ఒసి వాణిజ్య ప్రయోజనానికిగాను ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఒప్పందంపై సంతకాలు జరగడం భారతదేశ శక్తి భద్రతను ఇనుమడింపచేసేదే.

భారతదేశం, యుఎఇ లు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ఎడిఎన్ఒసి పెట్టుబడి యుఎఇ యొక్క హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్ వెస్ట్ మెంట్ (హెచ్ ఎల్ టిఎఫ్ఐ) నుండి దక్కే ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాక, భారతదేశ శక్తి రంగంలో యుఎఇ తరఫు నుండి ఒకటో పెట్టుబడి కూడా.

***