పిఎంఇండియా
చమురు మరియు గ్యాస్ రంగంలో భారతదేశం మరియు బెలారూస్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయుపై 2017 సెప్టెంబర్ 12న బెలారూస్ అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో సంతకాలు అయ్యాయి.
ఈ ఎమ్ఒయు భారతదేశం మరియు బెలారూస్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించనుంది. ఉభయ దేశాల మధ్య చమురు మరియు గ్యాస్ రంగంలో ఆర్థిక సహకారాన్ని మరియు వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఎమ్ ఒయు ఇది. ఈ ఎమ్ఒయు లో భాగంగా భారతదేశం లో అప్ స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్ కార్యకలాపాలు, సామర్థ్య నిర్మాణం, సాంకేతిక విజ్ఞాన బదిలీ, ఆయిల్ రికవరీని పెంచడం మరియు గుర్తించిన క్షేత్రాల యొక్క అభివృద్ధి వంటి రంగాలలో సహకారాన్ని నెలకొల్పే దిశగా ఇరు పక్షాలు కృషి చేస్తాయి.
ఈ ఎమ్ఒయు, దీనిపైన సంతకాలైన నాటి నుండి మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.