Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చెన్న‌య్ లో ఏప్రిల్ 12 వ తేదీన డిఫ్ఎక్స్‌పో 2018 ని ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఏప్రిల్ 12 వ తేదీ న త‌మిళ‌ నాడు లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయన జ‌రిగే చెన్న‌ై లో జరిగే డిఫెన్స్ ఎక్స్‌పో 10 వ సంచిక ‘డిఫ్ఎక్స్‌పో- 2018’ ని కాంచీపురం జిల్లా తిరువిడందాల్ లో ప్రారంభిస్తారు.

ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు మ‌రియు సంబంధిత భాగాల ఎగుమ‌తికి సంబంధించినంత వ‌ర‌కు భార‌త‌దేశం యొక్క శ‌క్తియుక్తుల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టే విధంగా ‘‘ఇండియా: ది ఎమ‌ర్జింగ్ డిఫెన్స్ మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్’’ ఈ సంవ‌త్స‌రం డిఫ్ఎక్స్‌పో యొక్క ప్ర‌ధాన ఇతివృత్తంగా ఉండబోతోంది. 150 కి పైగా అంత‌ర్జాతీయ ఎగ్జిబిటర్ ల‌తో స‌హా 670 కి పైగా ఎగ్జిబిటర్ లు డిఫ్ఎక్స్‌పో లో పాలుపంచుకొంటారు. దాదాపు 15 శాతం స్టాళ్లతో ఎమ్ఎస్ఎమ్ఇ రంగం ఈసారి న్యాయమైన ప్రాతినిధ్యం తీసుకోబోతోంది.

ఈ ప్ర‌ద‌ర్శ‌నలో టాటా, ఎల్ & టి, క‌ళ్యాణి, భార‌త్ ఫోర్జ్‌, మ‌హీంద్రా, ఎమ్‌కెయు, డిఆర్‌డిఒ, హెచ్ఎఎల్‌, బిఇఎల్‌, బిడిఎల్‌, బిఇఎమ్ఎల్‌, ఎమ్‌డిఎల్‌, జిఆర్ఎస్ఇ, జిఎస్ఎల్‌, హెచ్ఎస్ఎల్‌, మిధాని, ఆయుధ కర్మాగారాలు, ఇంకా ప‌లు ఇత‌ర సంస్థ‌లు భార‌త‌దేశం త‌ర‌ఫున పాల్గొననున్నాయి. యుఎస్ఎ కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్‌, బోయింగ్, స్వీడ‌న్ కు చెందిన సాబ్‌, ఫ్రాన్స్ కు చెందిన ఎయర్ బ‌స్‌, ర‌ఫేల్‌, ర‌ష్యా కు చెందిన రాస‌న్‌బ‌రోన్ ఎక్స్‌పోర్ట్‌ స్, యునైటెడ్ శిప్ బిల్డింగ్, యుకె కు చెందిన బిఎఇ సిస్ట‌మ్స్‌, ఇజ్రాయ‌ల్ కు చెందిన సిబాత్, ఫిన్ లాండ్‌ కు చెందిన వార్ట్‌శిలా, జ‌ర్మ‌నీ కి చెందిన రోడే మ‌రియు శ్వార్జ్ ల‌తో పాటు పలు ఇత‌ర అంతర్జాతీయ కంపెనీలు డిఫ్ ఎక్స్‌పో- 2018 లో పాలుపంచుకోనున్నాయి.

ప్ర‌ధాన మంత్రి చెన్నై లోని అడ‌యార్ లో గల కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ ను కూడా సంద‌ర్శించనున్నారు. ఆయన శ్రీ‌పెరంబ‌దూర్ లో వ‌జ్రోత్స‌వ భ‌వ‌నం, పాలియేటివ్ కేర్ సెంట‌ర్ (మ‌హావీర్ ఆశ్ర‌య్‌) మరియు అడ‌యార్ కేన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ లో డే కేర్ సెంట‌ర్, ఇంకా న‌ర్సుల క్వార్ట‌ర్ ల ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రిస్తారు.

***