Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైనా, కొరియా, మంగోలియా, వియత్నాం ల ప్ర‌జ‌ల‌కు చాంద్ర‌మాన‌ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చాంద్ర‌మాన‌ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల వేళ చైనా, కొరియా, మంగోలియా, వియత్నాం దేశాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

“ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న చైనా మిత్రుల‌కు ఈ కొత్త సంవ‌త్స‌రంలో ఎంతో సంతోషం సొంతం కావాలి. వాన‌ర సంవ‌త్స‌రం మీ జీవితాల‌లో ఆనందాన్ని, ఐశ్వ‌ర్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను.

ప్రియ‌మైన కొరియా స్నేహితులారా.. మీకు అంద‌రికీ సివోలాల్ శుభాకాంక్ష‌లు. రాబోయే న‌వీన సంవ‌త్స‌రం మీకు మంగ‌ళ‌ప్ర‌దం కావాల‌ని ఆశిస్తున్నాను.

మంగోలియాలో నివ‌సించే అపురూప ప్ర‌జ‌లారా.. మీకు ఇవే స‌గాన్ సార్ శుభ‌కామ‌న‌లు. నూత‌న సంవ‌త్స‌రం మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందించాలి గాక‌.

వియ‌త్నాం నివాసుల‌కు ఇవే నా టెట్ శుభాకాంక్ష‌లు. ఈ సంవ‌త్స‌రం మీ కోసం ఉత్సాహాన్ని, సంప‌ద‌ల‌ను కొనితేవాలి అని కోరుకుంటున్నాను” అంటూ ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో న‌మోదు చేసిన‌ త‌న సందేశాల‌లో పేర్కొన్నారు.

***