Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటిస్తారుజనవరి 10 సాయంత్రానికి ప్రధాని సోమనాథ్‌కు చేరుకుంటారురాత్రి గంటల ప్రాంతంలో సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారుఅనంతరం డ్రోన్‌ ప్రదర్శనను వీక్షిస్తారు.

జనవరి 11 ఉదయం సుమారుగా 9:45 గంటలకు శౌర్య యాత్రలో ప్రధానమంత్రి పాల్గొంటారుసోమనాథ్ ఆలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలర్పించిన వీరులందరి గౌరవార్థం ఈ యాత్ర చేపడుతున్నారుఅనంతరం ఉదయం 10:15లకు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారుఉదయం 11 గంటలకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వం సందర్భంగా నిర్వహించే సమావేశంలో ప్రధాని పాల్గొంటారు.

ఆ తర్వాత కచ్సౌరాష్ట్ర ప్రాంతాల కోసం నిర్వహిస్తున్న వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు రాజ్‌కోట్‌కు పయనమవుతారుమధ్యాహ్నం 1:30 గంటలకు సదస్సులో వాణిజ్య ప్రదర్శనఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారురాజ్‌కోట్‌లోని మార్వాడి విశ్వవిద్యాలయంలో కచ్సౌరాష్ట్ర ప్రాంతాల కోసం వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును మధ్యాహ్నం గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారుబహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

రాజ్‌కోట్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రధానమంత్రి బయలుదేరతారుసాయంత్రం 5:15 గంటలకు సెక్టర్ 10 ఏ నుంచి మహాత్మా మందిర్ వరకు నిర్మించిన అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 చివరి భాగాన్ని మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభిస్తారు.

జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ప్రధాని భేటీ అవుతారుఉదయం 9:30 ప్రాంతంలో నాయకులిద్దరూ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారుఅనంతరం సబర్మతీ ముఖద్వారం వద్ద నిర్వహించే అంతర్జాతీయ పతంగుల ఉత్సవాల్లో ఉదయం 10 గంటలకు పాల్గొంటారు.

అనంతరం ఉదయం 11:15 నుంచి గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్లో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారుఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత్జర్మనీ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రిజర్మన్ ఛాన్సలర్ ఇద్దరూ సమీక్షిస్తారు.

 

***