Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ యాసుహిరో నాకాసోన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


జపాన్ పూర్వ ప్రధాని మరియు ప్రముఖ రాజ‌నీతిజ్ఞుడైన శ్రీ యాసుహిరో నాకాసోన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“జపాన్ పూర్వ ప్రధాని మరియు ప్రముఖ రాజ‌నీతిజ్ఞుడు శ్రీ యాసుహిరో నాకసోన్ మృతి కి ఇదే సంతాపం. వారు భారతదేశాని కి జరిపిన పథ ఛేదక యాత్ర ను మేము ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాము. అది జపాన్ ప్రధాని ఒకరు 23 సంవత్సరాల అంతరం అనంతరం సలిపినటువంటి ఒకటో యాత్ర.

మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాని కి శ్రీ యాసుహిరో నాకాసోన్ అందించిన తోడ్పాటు విలువైంది గా ఉంది. ఆయన ను సమకాలీన భారత-జపాన్ మైత్రి యొక్క స్థపతి గా స్మరించుకోవడం జరుగుతుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.