Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్మూకశ్మీర్కు రూ. 80 వేలకోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని

శ్రీనగర్ షేర్-ఇ-కశ్మీర్ స్టేడియం బహిరంగం సభలో ప్రకటన

జమ్మూకశ్మీర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.80 వేల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు. శ్రీనగర్ లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియం వేదికమీద నుంచి ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి సందేశాన్ని గుర్తు చేశారు. కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతి), జమూరియత్ (ప్రజాస్వామ్యం), ఇన్సానియత్ (మానవత్వం) అంటూ వాజ్ పేయి ఇచ్చిన ఆ సందేశం విలువను చాటారు.

కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతి) లేకుండా భారతదేశం సమగ్రం కాదు అంటూ ఈ సందర్భంగా సూఫీ సంప్రదాయాన్ని ప్రధాని ప్రస్తావించారు.

జమ్మూకశ్మీర్ ప్రజలు జమూరియత్ (ప్రజాస్వామ్యం) మీద ఉంచి విశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి ఇన్సానియత్ (మానవత్వం) మీద ఆధారపడి ఉండాలని అన్నారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ (అందరితోపాటు అందరి అభివృద్ధి) కోసం ప్రభుత్వం పని చేస్తోందదని దేశంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేరాలని ప్రధాని అన్నారు. జమ్మూ కశ్మీర్ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని..ఒకప్పుడు దేశంలోని ప్రజలు ఎంతో కొంత సొమ్మును పొదుపు చేసి మరీ జమ్మూకశ్మీర్ ను సందర్శించేవారని ఆ రోజులు తిరిగి రావాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. పర్యాటక రంగంతోపాటు నాణ్యతగల గొర్రెల ఊలు, కుంకుమ పువ్వు ఉత్పత్తి రంగాల బలోపేతంపైన శ్రద్ధ పెట్టాలని అన్నారు.

2001లో వచ్చిన భూకంపంతో గుజరాత్ అతలాకుతలమైపోతే..అనంతరం గుజరాత్ పునర్ నిర్మాణంకోసం తాము చేసిన కృషిని ఆ నాటి అనుభవాలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. గత సంవత్సరం వచ్చిన వరదలతో జమ్మూకశ్మీర్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రజలు ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా రెట్టించిన ఉత్సాహంతో కోలుకున్నారని…ఇది చూసిన తర్వాత రాష్ట్రంపైన తనకు నమ్మకం పెరిగిందని… సమస్యలను త్వరలోనే పరిష్కించుకుంటుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన సమయంలో తాను వెంటనే రాష్ట్రానికి వచ్చి ఇక్కడే ఉండి దీపావళి పర్వదినాన్ని ఇక్కడే జరుపుకున్న విషయాన్ని సభికులకు గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ వరద సహాయనిధి కోసం తన మాతృమూర్తి తనకు రూ.5 వేలు ఇచ్చిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

మొన్నటిదాకా దేశంలో అలుముకున్న నిరాశ నిస్పృహలు తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఈ 17 నెలల్లో తొలగిపోయాయని ప్రధాని అన్నారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

యువ క్రికెటర్ పర్వేజ్ రసూల్ కు జన్మనిచ్చిన ఈ గడ్డ మీద తిరిగి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లు జరగాలనే ఆకాంక్షను ప్రధాని వెలిబుచ్చారు. భారతదేశ ప్రధాన క్రికెటర్లు జమ్మూకశ్మీర్ లో తయారైన బ్యాట్లనే ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్, కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సభలో పాల్గొన్నారు.